E-Paper
Advertisement

ఢిల్లీ పెద్దల ప్లాన్‌ను బయటపెట్టిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..!

ఢిల్లీ పెద్దల ప్లాన్‌ను బయటపెట్టిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..!
Advertisement

Mahesh Kumar Goud: స్వేచ్చ బ్యూరో: బీజేపీ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణనేనని, ఈక్రమంలో కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని టీపీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ తెలిపారు. ఎస్ ఐఆర్ ద్వారా ప్రభుత్వాలను పడగొట్టాలని బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు. బీఎల్ ఏలు అజాగ్రత్తగా ఉంటే మోస పోతామని వివరించారు. శుక్రవారం గాంధీభవన్ పీఏసీ మీటింగ్ జరిగింది . ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్​ మాట్లాడుతూ.. సంఘటన సృజన్ అభియాన్ లో భాగంగా నూతన డీసీసీలను ఎంపిక చేశామన్నారు.

ఓటు బ్యాంకును తొలగించే కుట్ర..

పార్టీ సంస్థాగత నిర్మాణం, సర్ పై సూచనలు సమాలోచనలు భాగంగా సమావేశం నిర్వహించామని, క్షేత్రస్థాయి బీఎల్ ఏలకు ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. సెక్యులర్ ఓటు బ్యాంకును తొలగించే కుట్ర జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్లు తగ్గించి లబ్ది పొందాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాల సరళికి నిదర్శనం సర్ ప్రక్రియ అని,
92 లక్షల ఓట్లు తొలగించి అర్జీ పెట్టుకుంటే 31 లక్షల ఓట్లు మాత్రమే జత చేశారన్నారు. అక్కడ ప్రభుత్వం మారడానికి 30 లక్షల ఓట్లు మాత్రమే కారణం అన్నారు.

Advertisement

Also read: రిజర్వ్​ చేసిన తీర్పులను.. 3 నెలల్లో వెల్లడించాలి.. హైకోర్టులకు సుప్రీం ఆదేశాలు

బూత్ స్థాయి నుంచి..

బెంగాల్ తర్వత ఫాసిస్టు ప్రభుత్వం టార్గెట్ పంజాబ్, తెలంగాణ అని వివరించారు. ఇప్పటికే సత్తా కలిగిన వారిని బీఎల్ ఏలుగా ఎంపిక చేశామని, జిల్లా అధ్యక్షులు స్థానిక నాయకులతో సమన్వయం చేసుకొని లిస్ట్ పంపాలన్నారు. సంక్షేమం అభివ్రుద్దిలో తెలంగాణ దేశానికే దిక్సూచి అన్నారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం పై దృష్టి పెట్టామన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యులు దామోదర రాజా నర్సింహ, మంత్రులు, సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Also read: టీవీ ఛానళ్ల యాడ్స్​ పై ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు..?

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×