E-Paper
Advertisement

Revenge thriller OTT: అన్న చావుకి చెల్లి రివేంజ్… కట్టి పడేస్తున్న కె డ్రామా. . ఐయండిబిలో 7.6 రేటింగ్

Revenge thriller OTT: అన్న చావుకి చెల్లి రివేంజ్… కట్టి పడేస్తున్న కె డ్రామా. . ఐయండిబిలో 7.6 రేటింగ్
Advertisement

Revenge thriller : వెబ్ సిరీస్ లలో కొరియన్ వెబ్ సిరీస్ లు వేరయా అనేలా ఉంది పరిస్థితి. ఈ సిరీస్ లను చాలా క్రేజీగా చూస్తున్నారు ప్రేక్షకులు కూడా. ఒక్క ఎపిసోడ్ మొదలు పెట్టిన వాళ్ళు, ఫైనల్ ఎపిసోడ్ చూసాకే ప్రశాంతంగా ఉంటున్నారు. ఇక అలాంటి ఒక వెబ్ సిరీస్ గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఈ కొరియన్ థ్రిల్లర్ సిరీస్ సూపర్ హిట్ కూడా అయింది. ఒక స్కూల్ లో జరిగే వేధింపులు, రివెంజ్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన ట్విన్ బ్రదర్ చావుకి కారణమైన వాళ్ళని కనిపెట్టి, రివెంజ్ తీర్చుకోవడానికి ఒక అమ్మాయి చేసే ప్రయత్నమే ఈ స్టోరీ.

జియో హాట్‌స్టార్ (Jio Hotstar) లో

ఈ కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘రివెంజ్ ఆఫ్ అదర్స్’ (Revenge of Others). 2022లో వచ్చిన ఈ సిరీస్ లో షిన్ యే-ఉన్, లోమాన్ ) ప్రధాన పాత్రల్లో నటించారు. మొత్తం 12 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్, ప్రస్తుతం జియో హాట్‌స్టార్ (Jio Hotstar) లో అందుబాటులో ఉంది. దీనిని తెలుగులో డబ్బింగ్ లో కూడా చూడచ్చు. ఐయండిబిలో దీనికి 7.6 రేటింగ్ కూడా ఉంది

స్టోరీలోకి వెళ్తే

Advertisement

చాన్-మీ అనే అమ్మాయి ఒక షూటింగ్ ఛాంపియన్. తన ట్విన్ బ్రదర్ అనుమానాస్పద స్థితిలో చనిపోతే, అది ఆత్మహత్య అని పోలీసులు కేసు క్లోజ్ చేస్తారు. కానీ తన అన్న అంత పిరికివాడు కాదని నమ్మిన చాన్-మీ, అసలు నిజం తెలుసుకోవడానికి, తన అన్న చదువుకున్న స్కూల్‌లోనే జాయిన్ అవుతుంది. అక్కడ ఆమెకు సూ-హీన్ అనే అబ్బాయి పరిచయమవుతాడు. అతను డబ్బు కోసం స్కూల్‌లో ఇతరులను వేధించే బ్యాడ్ స్టూడెంట్స్‌కి బుద్ధి చెబుతుంటాడు. చాన్-మీ తన అన్నను చంపిన హంతకుడిని పట్టుకునేందుకు అతను కూడా సహాయపడతాడు.

ఈ క్రమంలో స్కూల్‌లో ఉండే కొంత మంది విద్యార్థుల పగలు బయటపడతాయి. ముఖ్యంగా మెమరీ లాస్ ఉన్న ఒక రిచ్ స్టూడెంట్ కథలో కీలక మలుపుగా మారతాడు. ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠగా సాగుతూ, అసలైన విలన్ ఎవరు ? చాన్-మీ అన్న ఎలా చనిపోయాడు ? ఆమె ఎలా ప్రతీకారం తీర్చుకుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ కొరియన్ సిరీస్ ని మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : మహిళలకు నరకం చూపించే వింత సైకో… సూదులు గుచ్చి వెర్రి వేషాలు… చూస్తే బుర్ర పాడే

 

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×