E-Paper
Advertisement

Sunscreen: ఎండాకాలంలో ఇంట్లోనే ఉన్నా సన్ స్క్రీన్ వాడాల్సిందేనా?

Sunscreen: ఎండాకాలంలో ఇంట్లోనే ఉన్నా సన్ స్క్రీన్ వాడాల్సిందేనా?
Advertisement

వేసవిలో బయటికి వెళితే కచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాల్సిందే. అయితే ఇంట్లోనే రోజంతా ఉంటే సన్‌స్క్రీన్ అవసరం లేదనుకుంటారు చాలా మంది. ఎండలోకి వెళ్లకపోయినా, ఇంట్లో ఉన్నప్పటికీ సన్‌స్క్రీన్ వాడటం చర్మానికి చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. మనకు సాధారణంగా సూర్యకిరణాలు నేరుగా తాకినప్పుడు మాత్రమే చర్మానికి హాని చేస్తాయని అనుకుంటాం. కానీ సూర్యుడి నుంచి వచ్చే UVA కిరణాలు గాజు కిటికీలను దాటి ఇంటి లోపలికి కూడా చేరుతాయి. ఈ కిరణాలు చర్మం లోతైన పొరల వరకు వెళ్లి నెమ్మదిగా నష్టం కలిగిస్తాయి. దీని వల్ల ముడతలు, మచ్చలు, పిగ్మెంటేషన్ సమస్యలు రావచ్చు. కాబట్టి బయటికి వెళ్లకపోయినా UVA కిరణాల నుంచి రక్షణ అవసరమే.

స్కీన్ నుంచి వచ్చే లైట్
ఇంకా ఒక ముఖ్య కారణం బ్లూ లైట్. మనం రోజంతా మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ వంటి పరికరాలను ఉపయోగిస్తుంటాం. వీటి నుంచి వచ్చే హై ఎనర్జీ విజిబుల్ (HEV) లైట్ కూడా చర్మంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో ఇది చర్మం మసకబారడం, పిగ్మెంటేషన్ పెరగడం వంటి సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఇంట్లో ఉన్నప్పటికీ చర్మాన్ని రక్షించుకోవడం అవసరం.

Advertisement

ఎలాంటిది కొనాలి?
డెర్మటాలజిస్టులు చెబుతున్న ప్రకారం కనీసం SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను రోజూ ఉపయోగించాలి. బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే UVA మరియు UVB రెండింటి నుంచి రక్షణ కల్పించేది. ఉదయం స్నానం చేసిన తర్వాత సన్‌స్క్రీన్‌ను ముఖం, మెడ, చేతులు వంటి బయట కనిపించే భాగాలపై రాయాలి. బయటికి ఎక్కువసేపు వెళ్లాల్సి వస్తే ప్రతి రెండు నుంచి మూడు గంటలకు మళ్లీ రాయడం మంచిది. చాలామంది ఇంట్లో ఎండ పడదు కాబట్టి అవసరం లేదు అనుకుంటారు. కానీ కిటికీ పక్కన కూర్చోవడం, బాల్కనీ దగ్గర ఉండడం, వంటగదిలో సహజ కాంతి పడడం వంటి సందర్భాల్లో కూడా UVA కిరణాలు మన చర్మాన్ని తాకుతాయి. ఇవి వెంటనే కనిపించే నష్టం చేయకపోయినా, కాలక్రమంలో చర్మం వృద్ధాప్యానికి దారితీస్తాయి.

Also read: Egg Pakoda: క్రిస్పీగా మూడు గుడ్లతో ఎగ్ పకోడా ఇలా చేసేయండి, రెసిపీ ఇదిగో

Advertisement

సన్‌స్క్రీన్ వాడటం కేవలం అందం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా అవసరం. దీర్ఘకాలంలో సూర్యకిరణాల ప్రభావం చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రోజువారీ అలవాటులో సన్‌స్క్రీన్‌ను భాగం చేయడం మంచిది. ఆకాశంలో మేఘాలు ఉన్నా కూడా UV కిరణాలు ఉంటాయి. ఎండలేదని భావించి సన్‌స్క్రీన్ వాడకపోవడం సరైంది కాదు. UV కిరణాలు మేఘాలను దాటుకుని కూడా వస్తాయి. అందుకే వర్షకాలంలో కూడా సన్‌స్క్రీన్ ఉపయోగించడం అవసరం.

మార్కెట్లో జెల్, క్రీమ్, లోషన్ రూపాల్లో అనేక రకాల సన్‌స్క్రీన్‌లు అందుబాటులో ఉన్నాయి. మీ చర్మ రకానికి తగ్గదాన్ని ఎంచుకోవడం మంచిది. ఆయిల్ చర్మం ఉన్నవారు లైట్ జెల్ ఫార్ములా వాడవచ్చు. పొడి చర్మం ఉన్నవారు మాయిశ్చరైజింగ్ సన్‌స్క్రీన్ ఎంచుకోవచ్చు. సన్‌స్క్రీన్‌ను కేవలం బీచ్‌కు వెళ్లేటప్పుడు లేదా ఎండలో ఎక్కువసేపు ఉన్నప్పుడు మాత్రమే వాడే ఉత్పత్తిగా చూడకూడదు. ఇది రోజువారీ స్కిన్ కేర్‌లో తప్పనిసరి భాగం కావాలి. ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఎండ పడకపోయినా సన్‌స్క్రీన్ మీ చర్మానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.

Also read: Hair care: జుట్టు విపరీతంగా రాలిపోతోందా? వెంటనే వీటిని తినడం మొదలుపెట్టండి

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×