E-Paper
Advertisement

Thriller Web Series OTT : అందమైన అమ్మాయి మర్డర్ మిస్టరీ… పిచ్చెక్కించే థ్రిల్లర్ సిరీస్

Thriller Web Series OTT : అందమైన అమ్మాయి మర్డర్ మిస్టరీ… పిచ్చెక్కించే థ్రిల్లర్ సిరీస్
Advertisement

Thriller Web Series OTT : ఈ ప్రపంచంలో నిజాలు కూడా వక్రీకరణకు గురవుతుంటాయి. కొన్నిసార్లు రూమర్స్ గాసిప్స్ అంటే పడి చచ్చే జనాల ఆకలి తీర్చడం కోసం సరికొత్తవి పుట్టుకొస్తుంటాయి.  “వదంతి” అంటే తెలుగులో పుకారు అని అర్ధం. ఇదే పేరుతో ఒక వెబ్ సిరీస్ ప్రశంసలు దక్కించుకుంది. పేరుకు తగ్గట్టే ఈ సిరీస్ కూడా ఉంటుంది. మీడియా ఊహాగానాల గురించి, ఒక విషయాన్ని విభిన్న కోణాలలో చెప్పడం గురించి ఈ సిరీస్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. సంచలనం సృష్టించిన ఒక హత్యకి సంబంధించిన కేసుతో ఈ సిరీస్ మొదలవుతుంది. మరి ఈ సిరీస్ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో చూడవచ్చు అంటే

‘Vadhandhi: The Fable of Velonie’ ఒక అద్భుతమైన తమిళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది Amazon Prime Videoలో 2022 డిసెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ లో ఉంది. తమిళం అయినప్పటికీ, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో డబ్బింగ్ చేయబడింది. గతంలో విజయ్ ఆంటోని నటించిన ‘కిల్లర్’ అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు ఆండ్రూ లూయిస్ దీన్ని తెరకెక్కించారు. ఇందులో ఎస్.జె. సూర్య, సంజన కృష్ణమూర్తి, లైలా, నాజర్ లీడ్ రోల్స్ లో నటించారు.

Advertisement

Read Also :  వరుస హత్యలతో పోలీసులకు చుక్కలు… అదిరిపోయే ట్విస్టులు ఉన్న హాంకాంగ్ మూవీ

స్టోరీ ఏమిటంటే

కన్యాకుమారి శివార్లలో ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో ఒక యువతి మృతదేహం దొరుకుతుంది. మొదట ఆ ఆమె సినిమా హీరోయిన్ అని అందరూ అనుకుంటారు, కానీ ఆ తర్వాత ఆమె స్థానిక యువతి వేలోని (సంజన) అని నిర్ధారణ అవుతుంది. వెలోని ఒక అందమైన ఆంగ్లో-ఇండియన్ అమ్మాయి. ఆమె మరణించిన వెంటనే, సోషల్ మీడియాతో పాటు న్యూస్ ఛానెళ్లలో ఆమె వ్యక్తిత్వంపై రకరకాల పుకార్లు వస్తాయి. ఇక ఈ కేసును ఛేదించే బాధ్యత ఎస్.ఐ. వివేక్ (ఎస్.జె. సూర్య) పై పడుతుంది. వెలోని వ్యక్తిత్వంపై వస్తున్న పుకార్లు చూసి అతను ఆశ్చర్యపోతాడు. ఆమె మరణం వెనుక ఉన్న అసలు నిజాన్ని ప్రపంచానికి చూపించాలని అతను నిర్ణయించుకుంటాడు.

Advertisement

ఇక అనుమానితులు కూడా చాలా మంది ఉంటారు. మొదటగా వెలోనికి ఇష్టం లేకపోయినా ఆమెతో నిశ్చితార్థం జరిగిన వ్యక్తి, ఆమెను వేధించేవాడని తెలుస్తుంది. అలాగే సెబాస్టియన్ (నాజర్) అనే ఒక ఒక నవలా రచయిత, వెలోని సౌందర్యానికి ఆకర్షితుడైన ఆమె గురించి ఒక పుస్తకం కూడా రాశాడని తెలియడంతో అతను కూడా అనుమానితుడిగా ఉంటాడు. వెలోనికి, ఆమె తల్లికి కూడా తరచూ గొడవలు జరుగుతుండేవి. తల్లికి ఉన్న ఒక అఫైర్ వల్ల కూడా వెలోని ఇబ్బంది పడుతుండేది. సిరీస్ చివరి వరకు హంతకుడు ఎవరనేది ఉత్కంఠభరితంగా సాగుతుంది. చివరికి కిల్లర్ ఎవరు ? వివేక్ ఎలా కనిపెడతాడు ? ఎందుకు ఆమెను చంపాల్సి వచ్చింది ? అనే విషయాలను ఈ సిరీస్ ని చూసి తెలుసుకోండి.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×