E-Paper
Advertisement

Types of Men: శాస్త్రం ప్రకారం పురుషుల్లోనూ 4 రకాలు ఉంటారట – ఎలాంటి వారు అమ్మాయిలకు బాగా నచ్చుతారో తెలుసా..?

Types of Men: శాస్త్రం ప్రకారం పురుషుల్లోనూ 4 రకాలు ఉంటారట – ఎలాంటి వారు అమ్మాయిలకు బాగా నచ్చుతారో తెలుసా..?

Types of Men: స్త్రీలలో మాదిరి పురుషుల్లోనూ నాలుగు రకాల పురుషులు ఉంటారట. ఆ నాలుగు రకాల పురుషుల్లో ఒక రకమైన పురుషులంటే స్త్రీలకు విపరీతంగా నచ్చుతారట. ఇంతకీ ఆ నాలుగు రకాల పురుష జాతులేవీ.. వారి గుణ గుణాలు ఎలా ఉంటాయి. ఏ రకం పురుషులు ఏ రకం మహిళలకు సరిజోడి అవుతారో ఈ కథనంలో తెలుసుకుందాం.

హిందూ పురాణాల ప్రకారం స్త్రీలలో నాలుగు రకాల జాతులు ఉంటాయని చాలా మందికి తెలుసు కానీ మగజాతిలోనూ నాలురు రకాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. కానీ అదే హిందూ పురాణాలు పురుషులను కూడా నాలుగు రకాలుగా విభజించి వారి గుణగణాలను వారు ఏ రకం జాతి స్త్రీలకు సరిపోతారు. వారు ఎవరిని పెళ్లి చేసుకుంటే సుఖంగా బతుకుతారు. ఏ రకం మగజాతి పురుషులు ఏ రకం స్త్రీలకు విపరీతంగా నచ్చుతారు అనే విషయాలను క్షుణ్ణంగా వివరించినట్టు పండితులు చెప్తున్నారు. మరి మగజాతిలో ఉన్న నాలుగు రకాల పురుషుల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..?

శశజాతి:

వీళ్లు కుందేలు రకం జాతికి చెందిని వారు. వీరు మృదు స్వభావులు నాజూకు శరీరం కలిగి ఉంటారు. సున్నిత మనస్కులు, ఎటువంటి గొడవలు పెట్టుకోవడం కానీ గొడవల్లో తలదూర్చడం కానీ వీరికి నచ్చదు.  మంచి మాటకారులు, శుభ్రత విషయంలో వీరి తర్వాతే ఎవరైనా. ఈ రకం పురుషులు పద్మిణి జాతి  స్ర్తీలకు సరిపోతారని శాస్త్రం చెప్తుందట.

మృగజాతి:

ఈ జాతి పురుషులు జింక స్వభావం కలిగి ఉంటారు.  వీరికి కళల పట్ల ఆకర్షణ ఉంటుంది. వీరు బలమైన శరీరం కలిగి ఉంటారు. వీరికి తెలివి తేటలు కూడా ఎక్కువే ఉంటాయట. వీరు స్నేహశీరులు, ప్రేమలో నైపుణ్యం కలవారై ఉంటారట.  వీరు చిత్రిణి జాతి స్త్రీలకు తగిన వారుగ ఉంటారట. ఈ మృగజాతి పురుషులను అమ్మాయిలు బాగా ఇష్టపడతారట.

వృషభ జాతి:

వీళ్లు వృషభ రకం పురుషులు. వీరు ధృడమైన శరీరం కలిగి ఉంటారట.  అలాగే ఈ వృషభ జాతి వారిక మొరటుతనం కాస్త ఎక్కువగానే ఉంటుందట. ఇక వీరి కఠిన స్వభావం ఇతరులను ఇబ్బందికి గురి చేస్తుందట. పైగా  వీరికి శారీరక సుఖాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుందగ.. అలాగే  వీరికి దయ తక్కువగా ఉంటుంది. వీరు శంకిణీ జాతి  స్త్రీలకు సరిజోడి అని పండితులు చెప్తుంటారు.

అశ్వజాతి: 

వీరు గుర్రం జాతికి చెందిన వారు. ఈ అశ్వజాతి పురుషులు  అతి బలవంతులుగా ఉంటారట. అత్యంత శక్తివంతులైన వారందరూ ఈ అశ్వజాతికే చెందిన వారట. ఈ జాతి పరుషులు నిర్భయులుగా ఉంటారట. వీరు హస్తిని జాతి  స్త్రీలకు సరిపోతారని పండితులు చెప్తుంటారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: తిరుమల తిరుపతి బోర్డు నుంచి బంపర్ ఆఫర్ – రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రమే

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×