E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode June 5th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును కిడ్నాప్‌ చేసిన ఐశ్వర్య  

Brahmamudi Serial Today Episode June 5th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును కిడ్నాప్‌ చేసిన ఐశ్వర్య  
Advertisement

Brahmamudi serial today Episode: రాజు, శేషుతో ఫోన్‌లో ఫోటోలు దిగితూ.. సినిమా చాన్స్‌ల కోసం ప్రయత్నిస్తే ఎలా ఉంటానని అడుగుతుంటాడు. శేషు సూపర్ గా ఉన్నావని.. నీకు తిరుగే లేదని చెప్తుంటాడు. ఇంతలో ఇందు వచ్చి ఆఫీసుకు టైం అవుతుంది ఈ ఫోటోలకు ఫోజులు ఆపేసి వస్తారా…? అంటూ కోపంగా చెప్పి వెళ్లిపోతుంది. బయటకు వెళ్లిన ఇందును ఐశ్వర్య పట్టుకుని ఇందాక తిట్టినందుకు సారీ అంటూ తాను పెద్ద ప్రాబ్లమ్‌లో ఉన్నానని హెల్ప్‌ చేయమని అడుగుతుంది.

దీంతో ఇందు వెటకారంగా నా సమస్యలే నేను సాల్వ్‌ చేసుకోలేనని చెప్పగానే.. ఐశ్వర్య బాధగా రాజేష్‌ తనను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడని తన ఫోటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరిస్తున్నాడని చెప్పగానే.. ఇందు షాక్‌ అవుతుంది. రాజేష్‌పై కోపంగా నేను ఉన్నాను కదా నువ్వేం భయపడకు వాడికి ఒకసారి ఫోన్‌ చేయ్‌ అంటూ చెప్పగానే.. తన ఫోన్‌ కట్‌ చేస్తున్నాడని వాడు డబ్బులు తీసుకుని ఒక ప్లేస్‌కు రమ్మన్నాడు.. అక్కడికి నాతో నువ్వు రా ఫ్లీజ్‌ అంటూ ఇందును ఎలాగైనా ఆఫీసుకు వెళ్లకుండా.. చేయాలని ప్లాన్‌ చేస్తుంది. అన్ని రకాలుగా కావ్యను కన్వీన్స్‌ చేయాలని చూస్తుంది. ఇందు రానని చెబితే ముష్టిదానిలా అడ్డుకుని ఇందును తనతో తీసుకెళ్తుంది.

Advertisement

రేఖ, భూషణ్‌ ఆఫీసుకు వెళ్తుంటే.. భ్రమరాంబ హారతి తీసుకుని వస్తుంది. ఇప్పుడెందుకు హారతి అని రేఖ అడగ్గానే.. ఈరోజు నీకు మంచి జరగాలని దేవుడికి పూజ చేసి హారతి ఇచ్చాను. నువ్వు తీసుకో.. అంటూ రేఖ హారతి తీసుకున్నాక భ్రమరాంబ ఆల్ ది బెస్ట్‌ రేఖ మళ్లీ నువ్వే సీఈవో అవ్వాలి అంటుంది. అప్పుడే వచ్చిన రాజు నేను లాగేసుకుంటాను అంటాడు. నన్ను తట్టుకుని ఎదురునిలబడే దమ్ము ఎవరికి ఉంది అంటాడు. దీంతో శేషు అవును అల్లుడు నువ్వు నువ్వే మా రేఖ రేఖే అంటాడు. తర్వాత రాజు తన విశ్వరూపం చూపిస్తానంటే.. శేషు వద్దు అల్లుడు తను తట్టుకోలేదు నేను చెప్తాను ఉండు అంటూ రేఖకు ఏదో చెప్పబోతుంటే.. రేఖ సరే ఎవరి టాలెంట్‌ ఏంటో తెలుస్తుంది. కానీ ముందు ఇందు ఎక్కడుంది అని అడగ్గానే.. రాజు తనకు తెలియదని చెప్తాడు.

మరి ఇందుకు ఎక్కడికి వెళ్లినట్టు అంటూ అందరూ ఆలోచిస్తుంటారు. ఇందు లేకపోతే నేను సీఈవో అవ్వడం కష్టం అని రేఖ మనసులో అనుకుంటూ రాజును తిడుతుంది. ఇందును ఎక్కడ దాచావు అంటూ నిలదీస్తుంది. ఇందును మళ్లీ కిడ్నాప్‌ చేశావా..? చెప్పు అంటూ అడగ్గానే.. రాజు కోపంగా ఇందుకు ఫోన్‌ చేస్తాడు. రాజు ఫోన్‌ చేస్తున్నాడు అని ఇందు, ఐశ్వర్యకు చెబితే ఈ విషయం చెప్పకుండా ఏదో ఒకటి చెప్పి మేనేజ్‌ చేయ్‌ అని చెప్తుంది. దీంతో ఇందు తాను బయటకు వెళ్లానని మీటింగ్‌ స్టార్ట్‌ అయ్యే లోపు వస్తానని చెప్పడంతో రాజు సరే అంటూ ఆఫీసుకు వెళ్తారు.

Advertisement

కారులో వెళ్తున్న ఐశ్వర్య, ఇందును చూస్తూ.. మనసులో నిన్ను సీఈవో కాకుండా ఈ ప్లాన్‌ చేశాను. ఈ రోజు సాయంత్రం వరకు నువ్వు నాతోనే లాక్‌ అవుతావు. రాకేష్ లేడు ఎవ్వడూ లేడు అని మనసులో అనుకుంటుంది. మరోవైపు వెంకీని బయటకు తీసుకెళ్లిన నందు, వెంకీకి భరోసా ఇస్తుంది. సూసైడ్‌ అటెంప్ట్‌  ఎందుకు చేసుకున్నావు అంటూ తిడుతుంది. మరోసారి అలాంటి పిచ్చి పనులు చేయకూడదని వార్నింగ్‌ ఇస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×