E-Paper
Advertisement

OTT Movie : SonyLivలో ఉన్న టాప్ 5 మలయాళ సినిమాలు… ఇందులో మీరెన్ని చూశారు?

OTT Movie : SonyLivలో ఉన్న టాప్ 5 మలయాళ సినిమాలు… ఇందులో మీరెన్ని చూశారు?
Advertisement

OTT Movie : మలయాళం సినిమాలకి ఇప్పుడు మంచి రోజులనే చెప్పుకోవాలి. ఒకప్పుడు అంత ఆదరణ లేని ఈ సినిమాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. థియేటర్లలో కంటే ఓటీటీలో వీటిని క్రేజీగా చూస్తున్నారు ఆడియన్స్. ఈ సందర్భంలో SonyLiv లో అదిరిపోయే కంటెంట్ ఉన్న ఆసక్తికరమైన టాప్ ట్రెండింగ్ లో ఉన్న సినిమాల గురించి చెప్పుకుందాం. ఇందులో మొదటి స్థానంలో జోజు జార్జ్ దర్శకత్వం వహించిన పానీ ఉండగా, బ్లడీ బ్లడ్ బాత్ యాక్షన్ సినిమా మార్కో రెండవ స్థానంలో ఉంది. ఇక 2025లో SonyLivలో ఇప్పటివరకు వచ్చిన టాప్ 5 మలయాళ సినిమాల గురించి ఓ లుక్ వేద్దాం పదండి.

‘పానీ’ (Pani)

మొదట చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ, ఇప్పుడు మలయాళ సినిమాలో అగ్ర నటులలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు జోజు జార్జ్. పానీ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి, ఈ చిత్రంలో గ్యాంగ్స్టర్  గిరి పాత్రను పోషించాడు. ఇందులో అభినయ, సాగర్ సూర్య కీలక పాత్రల్లో నటించారు. ఈ కథ చిన్న చిన్న నేరాలు చేసే ఇద్దరు యువకులు, ఆ ఊరి డాన్ తో పెట్టుకుంటారు. వీళ్ళ మధ్య జరిగే యాక్షన్ సీన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పానీని టాప్ ప్లేస్ లో నిలిపాయి.

‘మార్కో’ (Marco)

Advertisement

ఉన్ని ముకుందన్ యాక్షన్ చిత్రం మార్కో 100 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్లింది. ఈ సినిమా ఒక క్రూరమైన ప్రతీకార కథను చూపిస్తుంది. మార్కో తన సోదరుడు అంధుడైన విక్టర్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాడు. మహిళలను కూడా విడిచిపెట్టకుండా దారుణంగా ఇతని రివేంజ్ ఉంటుంది. అత్యంత హింసాత్మక మలయాళ చిత్రంగా మార్కోను పిలుస్తారు. అయినప్పటికీ ఈ సినిమా SonyLiv టాప్ 5 జాబితాలో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. సీనియర్ నటుడు జగదీష్ ఈ చిత్రంలో విలన్‌గా నటించారు.

‘రేఖ చిత్రం’ (Rekhachitram)

‘రేఖచిత్రం’ సోనీ లివ్ లో మూడవ స్థానంలో ఉంది. ఈ చిత్రం 1985లో జరిగిన దశాబ్దాల నాటి మిస్టరీని పరిష్కరించే ఒక పోలీసు అధికారి చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్, మనోజ్ కె. జయన్ లీడ్ రోల్స్ లో నటించారు. రాజేంద్రన్ అనే వృద్ధుడు ఒక ఫేస్‌బుక్ లైవ్ వీడియోలో 40 సంవత్సరాల క్రితం, రేఖ అనే అమ్మాయిని చంపినట్లు ఒప్పుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. సస్పెండ్ అయిన తర్వాత తిరిగి విధుల్లో చేరిన CI వివేక్ గోపినాథ్ ఈ కేసును విచారిస్తాడు. ఈ సినిమా కూడా మలయాళం సినిమాలలో బెస్ట్ సినిమాగా నిలిచింది.

‘అలప్పుజ జింఖానా’ (Alappuzha Gymkhana)

Advertisement

ప్రేమలు విజయం తర్వాత యువ నటుడు నస్లెన్ మరోసారి అలప్పుజ జింఖానాతో తన టాలెంట్ నిరూపించుకున్నాడు. ఇక్కడ బాక్సింగ్ ప్రధాన అంశంగా మారుతుంది. ఇంటర్ పరీక్షలలో తప్పిన తర్వాత, కొంతమంది స్పోర్ట్స్ కోటా ద్వారా కాలేజ్ లో చేరాలని, రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలో తలపడతారు. ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నస్లెన్, సందీప్ ప్రదీప్, లుక్మాన్ అవరన్ ముఖ్య పాత్రలు పోషించారు.

‘నరివెట్ట’ (Narivetta)

ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో టోవినో థామస్, సూరజ్ వెంజరమూడు , చేరన్, ఆర్య సలీం, ప్రియంవద కృష్ణన్ నటించారు. ఒక మారుమూల గిరిజన ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా చేరిన ఒక వ్యక్తి చుట్టూ స్టోరీ తిరుగుతుంది. అధికారులు గిరిజనులను అణచివేయడానికి చేసే ప్రయత్నాలను ఇది హృదయ విధారకంగా చూపిస్తుంది. అనురాజ్ మనోహర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Read Also : పెళ్ళాం మిస్సింగ్… పక్కింటోడిపై కన్ను… ఈ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులోనే

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×