E-Paper
Advertisement

OTT Movie : ఈ ఏడాది థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : ఈ ఏడాది థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?
Advertisement

OTT Movie : థియేటర్లలో వస్తున్న సినిమాలలో కొన్ని నెగిటివ్ టాక్ తెచ్చుకుంటే మరికొన్ని మిక్స్డ్ టాక్ తో ఎంటర్టైన్ చేస్తుంటాయి. అయితే ఇంకొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ, థియేటర్లను షేక్ చేస్తుంటాయి. వేల కోట్లతో కాసుల వర్షం కురిపిస్తుంటాయి. ఈ ఏడాది అలంటి సినిమాల హవా మొదలైంది. అదికూడా యానిమేటెడ్ సినిమాలే ఈ రికార్డులను బ్రేక్ చేశాయి. 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-5 మూవీస్ పేర్లు ఏమిటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం పదండి.

‘నీ ఝా 2’ (Ne Zha 2)

ఈ ఏడాది చైనా యానిమేటెడ్ ‘నీ ఝా 2’ మూవీ అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 17,700 కోట్లను వసూలు చేసి ఔరా అనిపించింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

‘లైలో అండ్ స్టిచ్’ (Lilo & Stitch)

Advertisement

2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన వాటిల్లో ఇది రెండవ స్థానంలో నిలిచింది. ఈ అమెరికన్ యానిమేటెడ్ మూవీ సుమారుగా 8 500 కోట్లకు పైగా వసూలు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ సినిమా జియోహాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

‘ఎ మైన్‌క్రాఫ్ట్ మూవీ’ (A Minecraft Movie)

ఈ థ్రిల్లర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఈ ఏడాది కలెక్షన్ల పరముగా మూడవ స్థానంలో నిలిచింది. వార్నర్ బ్రదర్స్ రూపొందించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 7950 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా జియోహాట్, ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ (Jurassic World Rebirth)

Advertisement

ఈ ఏడాది థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది. డైనోసర్లను సరికొత్తగా చూపించింది. ఫ్యామిలీలతో సహా చూసేందుకు క్యూ కట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ చిత్రం కలెక్షన్ల పరంగా 7210 కోట్లు వసూలు చేసి నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం జియోహాట్ స్టార్, ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

‘డీమాన్ స్లేయర్ : ది మూవీ ఇన్ఫినిటీ కాస్టిల్’ (Demon Slayer : Infinity Castle)

ఈ జపనీస్ యానిమేటెడ్ మూవీ థియేటర్లలో అద్భుతమైన విజయాన్ని అందుకుని, 6145 కోట్లను వసూలు చేసి ఐదో స్థానంలో నిలిచింది. అయితే ఈ సినిమా ఇంకా ఓటీటీలో అడుగు పెట్టలేదు. తొందర్లోనే స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన కోసం వేచిచూడాల్సిందే.

 

OTT Movie : గేమ్‌తో డేంజరస్ ఆత్మ రిటర్న్… చావును దగ్గరగా చూపించే మంత్రగత్తె… ఈ సినిమా చూస్తే గూస్ బంప్స్ పక్కా

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×