E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : దివ్యాకు దండం పెట్టేసిన భరణి… ఇక మారరా వీళ్ళు

Bigg Boss 9 Telugu : దివ్యాకు దండం పెట్టేసిన భరణి… ఇక మారరా వీళ్ళు
Advertisement

Bigg Boss 9 Telugu : భరణి, దివ్య బాండ్ బిగ్ బాస్ ప్రియులకు రోజురోజుకూ మరింత చిరాకు పెడుతోంది. వీళ్ళ మధ్య జరిగే నెవర్ ఎండింగ్ గొడవలు ఆడియన్స్ ను ఇరిటేట్ చేస్తున్నాయి. ఫ్యామిలీ వీక్ డ్రామా అంతా ముగిశాక, నామినేషన్ లలో ఊహించని విధంగా దివ్య, భరణి మధ్య ఫైట్ జరిగింది. ఇద్దరూ ఇక మాట్లాడుకోరేమో.. మనకు ఇక ఈ బాధ ఉండదులే అని ప్రేక్షకులు ఆనంద పడేలోపు మళ్ళీ మామూలుగా మాట్లాడకోవడం మొదలు పెట్టారు ఇద్దరూ. కానీ గొడవలు పడడానికే మాట్లాడుతున్నట్టుగా అన్పిస్తోంది వీళ్ళ తీరు చూస్తుంటే.

దివ్యా నీకో దండం 

80వ రోజు ఎపిసోడ్ లో ఉదయాన్నే భరణి, రీతూ, ఇమ్మూ కెమెరా ముందు ఫన్నీ స్టెప్ వేసి నవ్వించారు. ఆ తరువాత కాసేపటికే “నేనే తక్కువ మాట్లాడడం బెటర్” అంటూ మళ్ళీ భరణి స్టార్ట్ చేశాడు. “ట్రై చేయండి చూద్దాం” అని దివ్య అన్నది. “నిజంగానే ట్రై చేస్తున్నా…” అని భరణి చెప్తే.. “అంటే నేను ఫోర్స్ చేస్తున్నానా? ఇక మీ ప్రశాంతతను నేనేం భంగపరచను” అన్నది దివ్య. “ఇలాగే ఏదో ఒకటి స్టార్ట్ చేస్తావు. నేను వాయిస్ రైజ్ చేసి ఏదీ మాట్లాడను. నువ్వు కూడా మాట్లాడకు. సంబంధం లేకుండా దూరకు” అని భరణి కౌంటర్ వేశాడు. “సంబంధం లేకుండా కాదు” అని దివ్య చెప్పేలోపే… “నీకో దండం దివ్య.. నేను అన్న మాటను మనసులో పెట్టుకుని ఇప్పుడు అన్నావ్ కదా ఆపెయ్” అన్నాడు భరణి. “మనసులో పెట్టుకుని ఏంటి? నేను జోక్ వేశాను. నేను అక్కడ కుంటుతున్నప్పుడు మీరు జోక్ వేశారు. నేను ఇక్కడ జోక్ వేశాను. ఇక వద్దు అన్నారు. ఈ టాపిక్ గురించి నేను చేయను అన్నాను. అయిపోయాక నేను నీతో తక్కువ మాట్లాడతా అని మీరే అన్నారు. మళ్ళీ దివ్య నీకో నమస్కారం అని డైలాగులు కొట్టకండి” అని చెప్పింది దివ్య.

అసలు సమస్య ఇదే 

Advertisement

“పదిసార్లు ఏజ్ గురించి మాట్లాడితే చిరాగ్గా ఉంటది ఎవడికైనా” అని భరణి అంటే… “అది చెప్పాకే కదా నేను ఆపేశాను” అని సమాధానం ఇచ్చింది దివ్య. “నిన్న ప్రేరణ మాట్లాడుతుంటే అది చెప్పక్కర్లేదు అని మధ్యలో దూరి అన్నావ్. అందుకే నేను అన్నెసెసరి ఎంట్రీ అన్నా” అని గుర్తు చేశాడు భరణి. “దానికి ఫీల్ అయ్యారా? నేను నిజంగానే కావాలని గుర్తు చేస్తున్నా అనుకుంటున్నారు. నేను మీరు నిజంగా ఫీల్ అయ్యే పాయింట్ ఉంటే అనను కదా…” అని దివ్య సమర్థించుకుంది. “దేనికైనా లిమిట్ ఉంటుంది కదా?” అని భరణి… “నేను నిన్నటి నుంచి కుంటుతుంటే దానిపై జోక్స్ వేశారు కదా. మీరు జోక్స్ వేస్తే నేను తీసుకుంటున్నా. మరి నేను వేస్తే ఎందుకు ప్రాబ్లం అవుతుంది?” అని ప్రశ్నించింది దివ్య.

“రియల్లీ సారీ దివ్య. నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. నాకే కరెక్ట్ అనిపించలేదు. నీతోనే కాదు నాకు ఎంత క్లోజ్ గా ఉన్నవాళ్ళనైనా సరే మాట అనడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తా. అది గబుక్కున వచ్చేసింది. రియల్లీ సారీ. పక్కా ఇంకెప్పుడూ ఇది రిపీట్ చేయను” అంటూ సాగదీశాడు భరణి. “ఇలాంటి యాక్షన్ లే వద్దు” అని దివ్య అంటే… “ఇది వదిలెయ్. నాకు సారీ చెప్పాలి అన్పించింది. సారీ అనేది వినమ్రంగానే చెప్తారు. నాకు అదే అలవాటు” అని వెళ్ళిపోయాడు.

Advertisement

Read Also : తనుజకు అభిజిత్ తో పోలికా? ఆన్లైన్ రివ్యూస్ చూసి వచ్చావా హారిక?

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×