E-Paper
Advertisement

క్షమించలేని తప్పు… మర్చిపోలేని గతం… దెబ్బకి మైండ్ బ్లాక్ అయ్యి మొద్దుబారిపోయిన ఒక మనిషి కథ

క్షమించలేని తప్పు… మర్చిపోలేని గతం… దెబ్బకి మైండ్ బ్లాక్ అయ్యి మొద్దుబారిపోయిన ఒక మనిషి కథ
Advertisement

Tragedy movie OTT : మంచి ఫీల్ ఉన్న సినిమా చూడాలనుకుంటే, ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఒక హాలీవుడ్ సినిమాను తప్పకుండా చూడండి. ఇది మన కమర్షియల్ సినిమాల్లాగా ఫైట్లు, డ్యాన్సులు, అదిరిపోయే ట్విస్టులు ఉండే సినిమా అయితే అస్సలు కాదు. ఇది ఒక ప్యూర్ ఎమోషనల్ డ్రామా. సినిమా అంతా చాలా సైలెంట్ గా, గుండెను పిండేసేలా సాగుతుంది. ఒక మనిషి జీవితంలో కోలుకోలేనంత పెద్ద తప్పు చేస్తే, ఆ గిల్టీతో చావలేక, బతకలేక ఎలా నలిగిపోతాడనేదే ఈ సినిమా. ఇందులో హీరో పెద్దగా డైలాగులు చెప్పడు, పైకి ఏడవడు.. కానీ అతని కళ్ళల్లో ఉండే ఆ ఫీల్ చూస్తే మనకే తెలియకుండా బాధేస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు మనకు ఏదో ఒక మూల భారంగా అనిపిస్తూనే ఉంటుంది. ఈ సినిమా ఆస్కార్ గెలిచి సెన్సేషన్ అయింది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

కెన్నెత్ లోనెర్గాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ అమెరికన్ ఎమోషనల్ డ్రామా మూవీ పేరు ‘మాంచెస్టర్ బై ది సీ’ (Manchester by the Sea). ఇందులో కేసీ అఫ్లెక్ (లీ చాండ్లర్), మిచెల్ విలియమ్స్ (రాండి), కైల్ చాండ్లర్ (జో), మరియు లూకాస్ హెడ్జెస్ (ప్యాట్రిక్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కేవలం 9 మిలియన్ డాలర్ల తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు 79 మిలియన్ డాలర్ల భారీ వసూళ్లను సాధించింది. నిజానికి ఈ సినిమాలో లీ చాండ్లర్ పాత్రను మ్యాట్ డామన్ చేయాల్సి ఉంది. కానీ డేట్స్ కుదరక తన స్నేహితుడైన కేసీ అఫ్లెక్‌కు ఆ అవకాశం ఇచ్చారు. కేసీ అఫ్లెక్ ఈ పాత్ర కోసం పడిన కష్టానికి గానూ ఆయనకు దాదాపు 40కి పైగా అంతర్జాతీయ అవార్డులు రావడం విశేషం. ఈ చిత్రం విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. 89వ అకాడమీ అవార్డుల్లో కేసీ అఫ్లెక్ ఉత్తమ నటుడిగా, కెన్నెత్ లోనెర్గాన్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో అవార్డులను గెలుచుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Video లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే  

Advertisement

లీ చాండ్లర్ (కేసీ అఫ్లెక్) బోస్టన్ నగరంలో ఒక అపార్ట్‌మెంట్ క్లీనర్‌గా పని చేసుకుంటూ ఉంటాడు. అతను ఎవరితోనూ పెద్దగా కలవకుండా తన పని తాను చేసుకుంటూ ఒంటరిగా బతుకుతుంటాడు. ఒకరోజు తన అన్నయ్య జో చాండ్లర్ చనిపోయాడన్న వార్త విని తన సొంత ఊరైన ‘మాంచెస్టర్ బై ది సీ’కి వెళ్తాడు. అయితే అక్కడ తన అన్నయ్య వీలునామా చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే తన 16 ఏళ్ల మేనల్లుడు ప్యాట్రిక్ బాధ్యతను అన్నయ్య లీకి అప్పగిస్తాడు. కానీ లీకి ఆ ఊరిలో ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. ఇప్పుడు కథ గతంలోకి వెళ్తుంది.

లీకి ఆ ఊరంటే అంత భయం ఎందుకంటే, గతంలో అక్కడే ఒక భయంకరమైన ప్రమాదం జరుగుతుంది. లీ చేసిన చిన్న పొరపాటు వల్ల తన ముగ్గురు పిల్లలు మంటల్లో చనిపోతారు. ఆ బాధ భరించలేక భార్య రాండి అతనికి విడాకులు ఇచ్చేస్తుంది. అప్పటినుండి లీ డిప్రెషన్ లోకి వెళ్ళి ఊరు వదిలి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మళ్ళీ అదే ఊరికి రావడం, పాత జ్ఞాపకాలు గుర్తొస్తుండటంతో లీ మానసికంగా చాలా ఇబ్బంది పడతాడు. చివరికి లీ ఒక నిర్ణయానికి వస్తాడు. ఆ నిర్ణయ ఏమిటి ? తన మేనల్లుడిని తన దగ్గరే ఉంచుకుంటాడా ? తన భార్యతో మళ్ళీ జీవితం మొదలు పెడతాడా ? ఈ కథకు ముగింపు ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : మోసగాళ్లకి మైండ్ బ్లాక్ అయ్యేలా… బ్యాంక్ దొంగల పని పట్టిన లోకల్ గ్యాంగ్… ఓటీటీలో ఆకట్టుకుంటున్న హీస్ట్ కామెడీ

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×