E-Paper
Advertisement

మోసగాళ్లకి మైండ్ బ్లాక్ అయ్యేలా… బ్యాంక్ దొంగల పని పట్టిన లోకల్ గ్యాంగ్… ఓటీటీలో ఆకట్టుకుంటున్న హీస్ట్ కామెడీ

మోసగాళ్లకి మైండ్ బ్లాక్ అయ్యేలా… బ్యాంక్ దొంగల పని పట్టిన లోకల్ గ్యాంగ్… ఓటీటీలో ఆకట్టుకుంటున్న హీస్ట్ కామెడీ
Advertisement

Comedy Drama on OTT : 2001లో అర్జెంటీనాలో వచ్చిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఒక హీస్ట్ కామెడీ సినిమా వచ్చింది. ఆ సమయంలో ప్రభుత్వం బ్యాంకుల నుండి డబ్బు డ్రా చేయకుండా ఆంక్షలు విధించడంతో లక్షలాది మంది సామాన్యులు రోడ్డున పడ్డారు. ఆ బాధాకరమైన సంఘటన నేపథ్యంగా, ఒక పక్కా కామెడీ హీస్ట్ సినిమాగా తెరకెక్కింది. చాలా ఆసక్తికరంగా, నవ్వు తెప్పించేలా ఈ కథ ఉంటుంది. చూస్తే ఒక మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక ఊర్లో ఉండే మామూలు జనం బ్యాంకులో దాచుకున్న డబ్బులను ఒక లాయర్ మోసం చేసి కాజేస్తాడు. ఏ అనుభవం లేని ఆ సామాన్యులంతా కలిసి ఒక టీమ్‌గా ఏర్పడి తమ సొమ్మును ఎలా తెచ్చుకున్నారనేదే ఈ సినిమా. ఇందులో పెద్ద ఫైట్లు, భారీ బిల్డప్‌లు ఉండవు కానీ, ప్రతి సీన్ చాలా నేచురల్‌గా ఉండి మనల్ని కథలో లీనం చేస్తుంది. అందుకే ఈ సినిమా చూస్తున్నంత సేపు ఆ సామాన్యులు గెలవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ అర్జెంటైన్ హీస్ట్ కామెడీ డ్రామా సినిమా పేరు ‘హీరోయిక్ లూజర్స్’ (Heroic Losers). 2019లో వచ్చిన ఈ సినిమా అసలు పేరు ‘La odisea de los giles. సెబాస్టియన్ బోరెన్స్‌టీన్ దీనికి దర్శకత్వం వహించారు. ఇది ఎడ్వర్డో సచేరి రాసిన ‘లా నోచే డి లా ఉసినా’ నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలో అతిపెద్ద విశేషం ఏమిటంటే, అర్జెంటీనా సినిమా దిగ్గజం రికార్డో డారిన్, అతని కొడుకు చినో డారిన్ తొలిసారి కలిసి నటించడం. వీరిద్దరూ కేవలం నటించడమే కాకుండా, తమ సొంత నిర్మాణ సంస్థ ద్వారా ఈ సినిమాను నిర్మించారు. సామాన్య ప్రజలు వ్యవస్థపై చేసే తిరుగుబాటును చాలా వినోదాత్మకంగా చూపించినందుకు గాను, ఈ సినిమాకు స్పానిష్ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘గోయా అవార్డు’ లభించింది. అంతేకాకుండా 2020 ఆస్కార్ రేసులో అర్జెంటీనా తరపున అధికారిక ఎంట్రీగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. రొట్టెన్ టొమాటోస్ వంటి వెబ్‌సైట్లలో 90% పైగా రేటింగ్ సాధించి, విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా కమర్షియల్‌గా కూడా మంచి వసూళ్లను సాధించింది ఈ సినిమా. ప్రస్తుతం ఇది ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

అర్జెంటీనాలో ఆర్థిక సంక్షోభం ఉన్న సమయంలో, ఒక చిన్న గ్రామంలో ఉండే ఫెర్మిన్ (హీరో) తన స్నేహితులతో కలిసి ఒక పాత గోదామును కొని, అక్కడ ఒక వ్యవసాయ సహకార సంఘాన్ని మొదలుపెట్టాలనుకుంటాడు. దీనికోసం ఊర్లో వాళ్లందరి దగ్గర డబ్బులు పోగుచేసి, సుమారు 1.5 లక్షల డాలర్లను బ్యాంకులో పెడతాడు. కానీ ఒక కన్నింగ్ లాయర్, బ్యాంక్ మేనేజర్ కలిసి ప్లాన్ వేసి, మరుసటి రోజే ఆ బ్యాంక్ మూతపడేలా చేస్తారు. దీనివల్ల ఆ ఊరి ప్రజల కష్టార్జితం మొత్తం ఆ లాయర్ చేతికి వెళ్ళిపోతుంది.

తమ డబ్బును మోసపూరితంగా కొట్టేసిన ఆ లాయర్, ఆ మొత్తాన్ని అడవి మధ్యలో ఒక సీక్రెట్ ప్లేస్ లో దాచాడని వీరికి తెలుస్తుంది. చట్టబద్ధంగా ఆ డబ్బును తిరిగి పొందలేమని అర్థం చేసుకున్న ఫెర్మిన్, అతని స్నేహితులు ఆ డబ్బును తిరిగి దొంగిలించాలని నిర్ణయించుకుంటారు. అయితే వీరందరికీ పెద్దగా దొంగతనాలు చేసిన అనుభవం లేకపోయినా, తమ డబ్బు కోసం రకరకాల తెలివైన ప్లాన్లు వేస్తారు. ఈ క్రమంలో ఆ డబ్బును వీళ్ళు తిరిగి చేజిక్కించుకున్నారా ? లాయర్ వల్ల వీళ్ళకు ఎలాంటి చిక్కులు వచ్చాయి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : నిద్రలో వచ్చే నిజమైన కలలు… ఫ్యూచర్‌ ముందే చూస్తూ విలన్లకు చుక్కలు చూపించే మైండ్ బ్లోయింగ్ కే డ్రామా

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×