E-Paper
Advertisement

మైక్రో ఫైనాన్స్ కుంభకోణం.. తప్పు చేశామని నిరూపిస్తే..?, మంగ్లీ సోదరుడు ఏమన్నాడంటే?

మైక్రో ఫైనాన్స్ కుంభకోణం.. తప్పు చేశామని నిరూపిస్తే..?, మంగ్లీ సోదరుడు ఏమన్నాడంటే?
Advertisement

ప్రముఖ గాయని మంగ్లీపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను ఆమె తమ్ముడు శివ చౌహన్ తీవ్రంగా ఖండించారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యవహారంపై స్పష్టతనిచ్చారు. గత ముప్పై రోజులుగా తమ కుటుంబంపై వస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. ప్రధానంగా మైక్రో ఫైనాన్స్ స్కామ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మంగ్లీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు కుట్రపూరితంగా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము నమ్మే హనుమంతుడు, సేవాలాల్ సాక్షిగా ఈ స్కామ్‌లో తమ ప్రమేయం లేదని ఆయన ప్రమాణం చేశారు.

ఈ వివాదానికి గల నేపథ్యాన్ని వివరిస్తూ హేమాకాంత్ రెడ్డి, మధు రమావత్ అనే వ్యక్తులు తీజ్ పండుగ విషయం మాట్లాడటానికి తమ వద్దకు వచ్చారని శివ చౌహన్ తెలిపారు. ఆ సమయంలో తన అక్క (మంగ్లీ) తన ఫోన్ నంబర్ ఇచ్చి వారితో మాట్లాడమని సూచించినట్లు పేర్కొన్నారు. తాము ఒక ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ముగించుకుని వస్తుండగా వారు తమ గ్రామానికి ఆహ్వానించడంతో అక్కడికి వెళ్లామని చెప్పారు. అక్కడ డిన్నర్ చేసిన తర్వాతే ఫోటోలు దిగామని వివరించారు. వెంచర్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి మంగ్లీని రమ్మని కోరగా ఇటువంటి కార్యక్రమాలకు ఆమె రారని తాను స్పష్టం చేసినట్లు వెల్లడించారు. జూన్ 9వ తేదీన ఆ ఫోటోలు దిగడం జరిగిందని పేర్కొన్న ఆయన ఆ మరుసటి రోజే అక్క పుట్టినరోజు వేడుకలు ఉండటంతో ఏర్పాట్ల కోసం హడావిడిగా వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు.

Advertisement

ఆ సమయంలో తనతో పాటు వచ్చిన డ్రైవర్లు తీసిన ఫోటోలను ఇప్పుడు అడ్డం పెట్టుకుని తమకు డబ్బులు ఇచ్చామని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని శివ చౌహన్ మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా తమకు చెందిన ప్లాట్ ఒకటి వారికి చూపించామని దానికి అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతే వారితో పరిచయం పెరిగిందని వివరించారు. ఆ తర్వాత తాము లేని సమయంలో కూడా హేమాకాంత్ రెడ్డి, రమాకాంత్ తమ ఊరికి వచ్చారని వెల్లడించారు. మైక్రో ఫైనాన్స్ స్కామ్‌కు సంబంధించి నమోదైన 60 నుండి 90 కేసుల్లో ఎక్కడా తమ పేర్లు లేవని ఆయన గుర్తు చేశారు. బాధితులు కూడా ఎవరూ తమపై ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు.

Advertisement

న్యాయవాది సుబ్బారావు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని శివ చౌహన్ వ్యాఖ్యానించారు. కోర్టులో తేల్చుకోకుండా మీడియా ముందుకు వచ్చి తప్పుదారి పట్టించడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. తాము ఎవరినీ బెదిరించలేదని కనీసం మెసేజ్ లేదా కాల్ కూడా చేయలేదని వెల్లడించారు. ఈ నిరాధార ఆరోపణల వల్ల తమ కుటుంబ పరువుకు భంగం కలిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల విచారణలో తమకు క్లీన్ చిట్ వచ్చిన తర్వాత కోర్టు ద్వారా పరువు నష్టం దావా వేస్తామని స్పష్టం చేశారు. పద్నాలుగేళ్లుగా ఎన్నో కష్టాలు పడి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చామని పేర్కొన్నారు. బాధితుల తరపున తాము కూడా పోరాడుతామని నిజం త్వరలోనే వెలుగులోకి వస్తుందని శివ చౌహన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ALSO READ: Minister Ponguleti: పెట్రోల్, డీజిల్ కొరతకు.. కేంద్రమే మూల కారణం.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×