BigTV English
Advertisement

OTT Movie : జాబ్ పేరుతో పేద అమ్మాయితో పాడు పనులు… చివరికి వాడికి పట్టే గతి చూస్తే మతి పోవాల్సిందే

OTT Movie : జాబ్ పేరుతో పేద అమ్మాయితో పాడు పనులు… చివరికి వాడికి పట్టే గతి చూస్తే మతి పోవాల్సిందే

OTT Movie : అమ్మాయిలతో కొంతమంది నడిపే లవ్ స్టోరీలు పడక గది వరకు మాత్రమే పరిమితం అవుతుంటాయి. వాటికి ప్రేమ అనే మూసుగును తగిలిస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో కూడా ఇదే జరుగుతుంది. ఒక పేద ఇంటి అమ్మాయిని ఉద్యోగం పేరుతో, ఒక డబ్బున్న వ్యక్తి లొంగదీసుకుంటాడు. ఈ స్టోరీ చివరివరకూ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

త్రిష్ణ రాజస్థాన్‌లోని ఒక గ్రామీణ కుటుంబంలో జన్మించిన యువతి. ఆమె తన కుటుంబానికి ఆర్థికంగా సహాయపడటానికి సమీపంలోని ఒక రిసార్ట్‌లో పనిచేస్తుంది. ఆమె తండ్రి ఆటో రిక్షాను నడుపుతూ జీవనం సాగిస్తూ ఉంటాడు. కానీ ఒక ప్రమాదంలో అతని వాహనం ధ్వంసమవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడుతుంది. ఈ సమయంలో జే సింగ్ ఒక సంపన్న వ్యాపారవేత్త కుమారుడు, తన తండ్రి హోటల్ వ్యాపారంని చూసుకోవడానికి రాజస్థాన్‌కు వస్తాడు. త్రిష్ణ ఒక హోటల్‌లో డాన్స్ చేస్తుండగా జే ఆమెను చూసి ఇంప్రెస్ అవుతాడు. జే, త్రిష్ణకు తన తండ్రి హోటల్‌లో ఉద్యోగం ఇస్తాడు. దీని ద్వారా ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది. వీరిద్దరూ ప్రేమలో పడతారు కానీ వీళ్ళ సంబంధం ఏకాంతంగా గడపడానికి మాత్రమే పరిమితం అవుతుంది. జే, త్రిష్ణను ముంబైకి తీసుకెళ్తాడు. అక్కడ వీళ్ళు కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తారు.


త్రిష్ణ నృత్య కళాకారిణిగా కెరీర్‌ను కొనసాగించాలని కలలు కంటుంది. కానీ జే ఆమెను ఇంటి పనులకు మాత్రమే పరిమితం చేస్తాడు. ఒక రాత్రి జే, త్రిష్ణపై లైం*గిక దాడి చేస్తాడు. ఆతరువాత త్రిష్ణ గర్భం దాల్చడంతో ఇంటికి తిరిగి వెళ్తుంది. కానీ సమాజంలో తలెత్తుకునే పరిస్థితి లేకపోవడంతో, ఆమె గర్భస్రావం చేయించుకుంటుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా, ఆమె మళ్లీ జే వద్దకు తిరిగి వెళ్లవలసి వస్తుంది. జే తన తండ్రి హోటల్‌లో తిరిగి పనిచేయడానికి రాజస్థాన్‌కు తిరిగి వస్తాడు. త్రిష్ణను రహస్యంగా తన సంబంధాన్ని కొనసాగించమని ఒప్పిస్తాడు. అయితే అతను ఆమెను కోరికలను తీర్చే ఒక యంత్రంలా చూస్తాడు. ఆతరువాత పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. చివరికి ఈ రిలేషన్ ఎంతవరకు వెళ్తుంది ? ఆమె జీవితం ఏమౌతుంది ? వీళ్ళకు ఎటువంటి సమస్యలు వస్తాయి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : మగ జాతిని అంతం చేసే వైరస్… మిగిలిన ఒక్క అబ్బాయితో అమ్మాయిలంతా…

యూట్యూబ్ (Youtube) లో

ఈ మూవీ పేరు ‘త్రిష్ణ’ (Trishna). 2011 లో వచ్చిన ఈ సినిమాకి మైఖేల్ వింటర్‌బాటమ్ దర్శకత్వం వహించారు. ఇది థామస్ హార్డీ రాసిన ‘టెస్ ఆఫ్ ది డి ఉర్బర్విల్లెస్’నవల ఆధారంగా రూపొందింది. ఈ మూవీ రాజస్థాన్, ముంబై నేపథ్యంలో సాగుతుంది. ఇందులో ఫ్రీడా పింటో (త్రిష్ణ), రిజ్ అహ్మద్ (జే సింగ్) ప్రధాన పాత్రల్లో నటించారు. యూట్యూబ్ (Youtube) లో ఈ మూవీని ఫ్రీగానే చూడవచ్చు.

Related News

Jatadhara OTT: ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Feminichi Fathima OTT : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..

OTT Movie : ఎక్స్ కంటే డేంజర్ గా ఉండే 5 థ్రిల్లర్ సిరీస్ లు… యాక్షన్ మాత్రమే కాదు మజా ఇచ్చే అడ్వెంచర్ కూడా

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Big Stories

×