E-Paper
Advertisement

OTT Movie : టన్నెల్ లో ఇరుక్కుపోయే కామన్ మ్యాన్… చేతులెత్తేసే ఆఫీసర్లు… మైండ్ బ్లాకయ్యే సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : టన్నెల్ లో ఇరుక్కుపోయే కామన్ మ్యాన్… చేతులెత్తేసే ఆఫీసర్లు… మైండ్ బ్లాకయ్యే సర్వైవల్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : రియల్ లైఫ్ ఇన్‌స్పైర్డ్ స్టోరీలతో వచ్చే సినిమాలు ఓటీటీలోకి చాలానే వస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలు బ్లాక్ బస్టర్లతో రికార్డులు సృష్టిస్తుంటాయి. మంజుమాల్ బాయ్స్ తరహాలో ఓ కొరియెన్ మూవీ సెన్సేషన్క్రియేట్ చేసింది. ఈ కథలో ఒక మనిషి కొత్తగా తవ్విన హైవే టన్నెల్ లో చిక్కుకుని 35 రోజులు లోపల సర్వైవ్ చేయడం చుట్టూ తిరుగుతుంది. ప్రతి సీన్ చాలా ఉత్కంఠంగా ఉంటుంది. ఒక మంచి థ్రిల్లర్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే, ఈ సర్వైవల్ థ్రిల్లర్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2016లో విడుదలైన ఈ సౌత్ కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘టన్నెల్’. కిమ్ సియాంగ్-హూన్ డైరెక్షన్ లో ఇది తెరకెక్కింది. ఇందులో హా జంగ్-వూ (లీ జంగ్-సూ),సే-హ్యూన్ (జంగ్-సూ వైఫ్), ఓ డాల్-సూ (రెస్క్యూ టీమ్ కెప్టెన్) లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2016 మార్చి 10న థియేట్రికల్ రిలీజ్ అవ్వడంతో పాటు, కొరియన్ సినిమాల్లో బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్స్‌లో ఒకటిగా నిలిచింది. దాదాపు రెండు గంటల నిడివి ఉన్న ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఐయండిబిలో 6.8/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

జంగ్-సూ ఒక కార్ షోరూమ్ మేనేజర్. భార్య బర్త్‌డే కోసం కేక్ తీసుకుని ఇంటికి వెళ్తుంటే కొత్తగా తవ్విన హైవే టన్నెల్ లోపలికి వెళ్తాడు. అయితే ప్రమాద వశాత్తు టన్నెల్ కూలిపోతుంది. జంగ్-సూ టన్నెల్ లోపల కారులో చిక్కుకుపోతాడు. బయట రెస్క్యూ టీమ్ వచ్చి ఆపరేషన్ మొదలెడుతుంది. జంగ్-సూ లోపల 35 రోజులు సర్వైవ్ చేయాలి. కేవలం ఒక బాటిల్ వాటర్, బర్త్‌డే కేక్ మాత్రమే ఉంటాయి. మొబైల్ సిగ్నల్ లేదు, ఆక్సిజన్ తక్కువ. జంగ్-సూ కారు బ్యాటరీతో లైట్ వాడుతాడు. రేడియోలో బయట న్యూస్ వింటాడు. బయట జంగ్-సూ వైఫ్ భర్త తిరిగి వస్తాడన్న ఆశతో ఎదురుచూస్తుంది. రెస్క్యూ టీమ్ డ్రిల్లింగ్ చేస్తుంది కానీ రెండోసారి టన్నెల్ కూలిపోతుంది. దీంతో రెస్క్యూ టీమ్ ఏం చేయలేమని చేతులు ఎత్తేస్తుంది.

Read Also : హాంటెడ్ హౌస్ లో మోడ్రన్ భూతాలు… సినిమా డైరెక్టర్ తో మంతనాలు… వాటి జోలికెళ్తే దబిడి దిబిడే

Advertisement

మీడియా కూడా ఇక ఛాన్స్ లేదని రిపోర్ట్ కూడా ఇస్తుంది. కానీ రెస్క్యూ టీమ్ కెప్టెన్ కిమ్ వదలడు. సొంత రిస్క్‌తో ఆపరేషన్ కంటిన్యూ చేస్తాడు. జంగ్-సూ లోపల ఆకలి, దాహం, చలి, ఒంటరితనంతో పోరాడతాడు. 35వ రోజు రెస్క్యూ టీమ్ జంగ్-సూ కారు దగ్గరకు చేరుకుంటుంది. చివరికి జంగ్-సూ ప్రాణాలతో బయట పడతాడా ? రెస్క్యూ టీమ్ ఆపరేషన్ విజయవంతంగా ముగిస్తుందా ? జంగ్-సూ తన ఫ్యామిలీని కలుస్తాడా ? అనే ప్రశనలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Related News

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

Big Stories

Advertisement
×