E-Paper
Advertisement

Upcoming Web Series OTT : హార‌ర్‌ నుంచి యాక్షన్ వరకు… ఓటీటీలోకి వచ్చేస్తున్న అదిరే బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు, సిరీస్‌లు

Upcoming Web Series OTT : హార‌ర్‌ నుంచి యాక్షన్ వరకు… ఓటీటీలోకి వచ్చేస్తున్న అదిరే బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు, సిరీస్‌లు
Advertisement

Upcoming Web Series OTT : ఓటీటీలో ఈ నెల హారర్, యాక్షన్, థ్రిల్లర్ జానర్లలో సూపర్ హిట్ కంటెంట్ వస్తోంది. ‘The Bluff movie’ తో మొదలు పెడితే ‘The Conjuring: Last Rites’ వరకు చూడటం మొదలు పెడితే ఆపలేరు. ఇక్కడ ఫిబ్రవరి 2026లో వచ్చే టాప్ అప్‌కమింగ్ రిలీజ్‌లు వివరంగా చూద్దాం. ఇవి చూస్తుంటే రాత్రంతా బింగ్ వాచ్ చేయాలనిపిస్తుంది. కుర్చీలకి అతుక్కుపోయే కంటెంట్లు ఉన్న స్టోరీలు ఇవి.

Death Whisperer 3

ఇది థాయ్ హారర్ ఫ్రాంచైజీలో మూడవ భాగం. మొదటి రెండు సినిమాలు చూసినవాళ్లు తెగ భయపడ్డారు ఈ సినిమాను చూసి. ఈసారి మరిన్ని సూపర్‌నాచురల్ స్కేర్స్, ఘోస్ట్‌లు, డెత్ విస్పర్స్ లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. స్టోరీలో Yak మళ్లీ ఆ ఘోస్ట్ స్పిరిట్‌తో ఫైట్ చేయాల్సి ఉంటుంది. చూస్తుంటే ఒంట్లో వణుకు పుట్టేస్తుంది. మొదటి రెండు హిట్ అయిన తర్వాత ఇది మరింత ఇంటెన్స్‌గా ఉంటుందని టాక్. రాత్రి ఒంటరిగా చూస్తే పక్కా భయమేస్తుంది. సుమారు 2 గంటల రన్‌టైమ్ తో ఈ సినిమా 2025అక్టోబర్ 1న రిలీజ్ అయింది. Netflixలో 2026 ఫిబ్రవరి 4 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా.

The Lincoln Lawyer Season 4

Advertisement

ఇదొక లీగల్ థ్రిల్లర్ సిరీస్. సీజన్ 3 తర్వాత ఇప్పుడు మిక్కీ మీదే మర్డర్ కేస్‌లో ఆరోపణలు వస్తాయి. అతను తనను తాను డిఫెండ్ చేసుకోవాల్సి వస్తుంది. 10 ఎపిసోడ్స్ ఉంటాయి, ప్రతి ఎపిసోడ్ సుమారు 45-50 నిమిషాలు ఉంటుంది. ఇది మైకేల్ కానలీ బుక్స్ ఆధారంగా తీసినది. ఇందులో మిక్కీ ఫ్రెండ్స్, ఎక్స్ వైఫ్ మధ్య రిలేషన్స్ కూడా డెప్త్‌గా చూపిస్తారు. క్రైమ్ డ్రామా ఫ్యాన్స్‌కి బెస్ట్ బింగ్, కోర్ట్ సీన్స్‌ చూస్తుంటే టెన్షన్ పీక్‌కు వెళ్తుంది. ఇది Netflixలో 2026 ఫిబ్రవరి 5న రిలీజ్ కాబోతోంది.

Kohra Season 2

ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో బారున్, మోనా సింగ్ మళ్లీ వస్తున్నారు. ఈ పంజాబ్ బ్యాక్‌డ్రాప్‌లో మరిన్ని మర్డర్ మిస్టరీ కేస్‌లు వస్తాయి. సీజన్ 1లో ఆ కేస్ సాల్వ్ అయిన తర్వాత ఇప్పుడు కొత్త క్రైమ్స్ తో పొలిటికల్ కాన్‌స్పిరసీలు కూడా మిక్స్ అవుతాయి. 8 ఎపిసోడ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి సుమారు 50 నిమిషాలు ఉంటుంది. సీజన్ 1 సూపర్ హిట్ అయిన తర్వాత ఇది మరింత డార్క్‌గా, ఇంటెన్స్‌గా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ చూస్తుంటే ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ చేయకూడదనిపిస్తుంది. ఇది Netflixలో 2026 ఫిబ్రవరి 11 నుంచి వస్తుంది

The Bluff

Advertisement

ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ప్రియాంక చోప్రా, కార్ల్ అర్బన్ మెయిన్ రోల్స్‌లో నటించారు. ఇది పైరేట్ థీమ్‌తో వచ్చిన ఒక ఎపిక్ యాక్షన్ సినిమా. 18వ శతాబ్దం కరేబియన్ సీస్‌లో సాగుతుంది. ఇందులో ప్రియాంక ఒక మాజీ పైరేట్. తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి ఆమె ఫైట్ చేస్తుంది ఇందులో. ఈ హై-ఆక్షన్ సీన్స్ చూస్తుంటే, ప్రియాంక ఫ్యాన్స్‌కి బిగ్ ట్రీట్ ఇచ్చినట్లే ఉంది. ఇది Prime Videoలో 2026 ఫిబ్రవరి 25న స్ట్రీమింగ్ అవుతుంది.

The Conjuring: Last Rites

ఈ హారర్ మూవీ Conjuring యూనివర్స్‌లో ఫైనల్ భాగం. వెరా ఫార్మిగా (లోరైన్ వారెన్), పాట్రిక్ విల్సన్ (ఎడ్ వారెన్) మళ్లీ ఘోస్ట్ హంటర్స్‌గా వస్తున్నారు. థియేటర్స్‌లో బాక్సాఫీస్ హిట్ అయిన తర్వాత ఓటీటీలోకి వస్తోంది ఈ సినిమా. రన్‌టైమ్ సుమారు 2 గంటలు ఉంటుంది. హారర్ లవర్స్‌కి ఫైనల్ స్కేర్. లైట్స్ ఆఫ్ చేసి చూడండి, మధ్యలో లేచి పారిపోవాలనిపిస్తుంది. ఇది JioHotstarలో 2026 ఫిబ్రవరి 13 నుంచి స్ట్రీమింగ్ లోకి వస్తుంది.

Read Also :  పదేళ్ళ తరువాత లవర్ కోసం వస్తే… మూగ భర్తతో షాక్ ఇచ్చే అమ్మాయి… గుండెను బరువెక్కించే కథ

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×