E-Paper
Advertisement

అమ్మాయి చస్తే ఇవేం సైకో పనులు భయ్యా… 8 ఎపిసోడ్ల మెంటల్ మాస్ క్రైమ్ థ్రిల్లర్

అమ్మాయి చస్తే ఇవేం సైకో పనులు భయ్యా… 8 ఎపిసోడ్ల మెంటల్ మాస్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Crime Thriller Series OTT : ఓటీటీలో కొత్త సిరీస్‌ లు ప్రతి వారం వచ్చినా, దీర్ఘకాలం ట్రెండింగ్‌ లో నిలబడి ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా అరుదు. అలాంటి ఒక పవర్ ఫుల్ సిరీసే ‘వాధంధి: ది ఫేబుల్ ఆఫ్ వెలోనీ’ (Vadhandhi: The Fable of Velonie). రషోమన్ స్టైల్‌ లో వివిధ కోణాల నుంచి రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల మనసును పూర్తిగా ఆక్రమించేస్తుంది. సిరీస్ ను చూసిన చాలా రోజుల తరువాత కూడా స్టోరీ వెంటాడుతుంది. మరి ఇంతకీ ఈ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

సిరీస్ కథ ఏమిటి ?

మన సిరీస్ లో స్టోరీ అంతా అందమైన యువతి వెలోనీ చుట్టే తిరుగుతుంది. ఆ అమ్మాయి హత్యకు గురవుతుంది. ఆమె మృతదేహం ఒక సినిమా షూటింగ్ స్థలంలో దొరుకుతుంది. ఈ హత్య కేసు దర్యాప్తును సబ్ ఇన్‌స్పెక్టర్ వివేక్ (ఎస్.జె. సూర్య) చేపడతాడు. నిజానికి ఆయన కేసును పూర్తి నిబద్ధతతో పరిశోధిస్తాడు. కానీ విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ వెలోనీ గురించి వచ్చే వివిధ రకాల రూమర్లు, అర్ధ సత్యాలు ఆమె మర్డర్ మిస్టరీని పూర్తిగా మార్చేస్తాయి. ఈ సిరీస్ లో వెలోనీ హత్యను వివిధ వ్యక్తుల దృక్పథం నుంచి చూపించారు. ఒక వైపు నిరంతరం కేసును ఫాలో అవుతున్న పోలీసు అధికారి, మరోవైపు వెలోనీ అందంపై మనసు పడిన నవలా రచయిత, ఇంకొకవైపు సెన్సేషనల్ న్యూస్ కోసం వెంపర్లాడే మీడియా ఎడిటర్… ఇలా ప్రతి ఒక్కరి కోణం నుంచి కథ మారుతూ ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే మలుపులు ప్రేక్షకులను క్లైమాక్స్ వరకు ఉత్కంఠలో ఉంచుతాయి. అసలు ఆ అమ్మాయి హత్యకు కారణం ఎవరు ? చివరికి ఈ కేసును ఆ పోలీస్ ఎలా సాల్వ్ చేశాడు ? హత్యకు, సోషల్ మీడియాకు ఉన్న లింకు ఏంటి ? అన్నది తెరపై చూడాల్సిన కథ.

Advertisement

Also Read : యూఫోరియా సీజన్ 3 క్లైమాక్స్ ఎక్స్ప్లెనేషన్… చివరికి జరిగింది ఇదే

ఎక్కడ చూడాలి ?

సిరీస్ లో మెయిన్ రోల్ లో ఎస్.జె. సూర్య నటించారు. ఆయన సబ్ ఇన్‌స్పెక్టర్ వివేక్ పాత్రలో కన్పిస్తారు. వెలోనీగా సంజనా కృష్ణమూర్తి, రూబీ (వెలోనీ తల్లి పాత్ర లైలాగా రూబీ, సబ్ ఇన్‌స్పెక్టర్ రామర్ గా వివేక్ ప్రసన్న, నాసర్ కీలక పాత్రలు పోషించారు. ఇతర నటులు కూడా తమ పాత్రలకు బాగా న్యాయం చేశారు. క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వాధంధి’లో హత్య వెనుక ఉన్న రహస్యాలు, సమాజంలో మహిళల ఇమేజ్ ఎలా సులభంగా మారిపోతుంది, మీడియా ట్రయల్, పోలీసు వ్యవస్థ.. వంటి అంశాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ప్రతి ఎపిసోడ్ ముగిసేటప్పటికి మరిన్ని ప్రశ్నలు మిగులుస్తుంది. ట్విస్టులు, సస్పెన్స్, ఎమోషన్ అన్నీ బ్యాలెన్స్‌గా ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ తమిళ్‌లో వచ్చింది. IMDbలో మంచి రేటింగ్ సాధించిన ఈ సిరీస్ ను క్రైమ్ థ్రిల్లర్ లవర్స్‌కి డోంట్ మిస్.

Related News

పెళ్ళయిన వ్యక్తితో రిలేషన్ లో… మెదడును కదిలించే క్లైమాక్స్

లవర్ కు మతిమరుపు వస్తే… కన్నీళ్ళు పెట్టించే తెలుగు రొమాంటిక్ డ్రామా

గర్ల్ ఫ్రెండ్ కోసం కుక్కను తెచ్చి కొత్త చిక్కుల్లో… డాగ్ లవర్స్ డోంట్ మిస్

ఒకరి తర్వాత ఒకరు సైకోలుగా మారి హత్యలు చేసే పేరున్న వ్యక్తులు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

యాక్సిడెంట్, కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి భార్యగా… మెంటలెక్కించే తమిళ సై-ఫై రొమాంటిక్ థ్రిల్లర్

ఏం సిరీస్ గురూ… మనుషుల్ని చంపి పచ్చి మాంసం నోట్లో కుక్కే కిల్లర్

50 రోజులు అందమైన అమ్మాయితో గదిలో కాలు బయట పెట్టకుండా… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ

ఏడుగురు ఆవారాగాళ్ల కథ… షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవ్వాలనుకునే కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×