E-Paper
Advertisement

Distributary Canals: నకిరేకల్ మున్సిపాలిటీలో ఘోరం.. ఉదయ సముద్రం కాలువల దయనీయ స్థితి..!

Distributary Canals: నకిరేకల్ మున్సిపాలిటీలో ఘోరం.. ఉదయ సముద్రం కాలువల దయనీయ స్థితి..!

Distributary Canals: స్వేచ్చ బ్యూరో: వర్షాకాలం ముంగిటకొచ్చింది.. ఆకాశం వైపు రైతాంగం ఆశగా ఎదురుచూస్తోంది. కానీ, పొలాలకు నీరందించాల్సిన, చెరువులను నింపాల్సిన ఇరిగేషన్ డిస్ట్రిబ్యూటరీలు (ఉప కాలువలు) మాత్రం అస్తవ్యస్తంగా మారాయి. పూడికలు తీయక, ముళ్లపొదలు, గుర్రపు డెక్క, తుమ్మకంపలను తొలగించకపోవడంతో కాలువలు రూపురేఖలు కోల్పోయాయి. మరికొన్ని చోట్ల ఏకంగా కాలువ కట్టలనే ఆక్రమించేస్తున్నారు. ఈ నేపథ్యంలో “డిస్ట్రిబ్యూటరీలు ఇలా ఉంటే.. నీరు పారెదెలా? చెరువులు నిండెదెలా?” అంటూ ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పర్యవేక్షణ శూన్యం.

రాష్ట్రంలో ప్రాజెక్టుల కింద మెయిన్ కెనాల్స్ ఉన్నాయి. వాటికి ప్రభుత్వం లైనింగ్ పనులు చేపడుతుంది. వర్షాకాలంలో మెయిన్ కెనాల్స్ కు గండిపడకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కానీ మెయిన్ కెనాల్స్ నుంచి తాగు, సాగునీటి కోసం చెరువులు, కుంటలు నింపేందుకు డిస్ట్రిబ్యూటరీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ వాటిపర్యవేక్షణ మరిచింది. దీంతో ప్రధాన సాగునీటి వనరులైన డిస్ట్రిబ్యూటరీల పరిస్థితి దయనీయంగా మారింది. ఏళ్ల తరబడి సరైన మరమ్మతులు, పర్యవేక్షణ లేకపోవడంతో కాల్వల ఉనికికే ముప్పు వాటిల్లుతోంది. కాల్వల్లో పెద్ద ఎత్తున కంపచెట్లు మొలిచి అడవిని తలపిస్తున్నాయి. టన్నుల కొద్దీ మట్టి కూరుకుపోయి కాల్వల లోతు తగ్గిపోయింది. దీనివల్ల ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసినా, ఆ నీరు చివరి ఆయకట్టుకు చేరడం లేదని రైతులు పేర్కొంటున్నారు. పలు చోట్ల డిస్ట్రిబ్యూటరీల కట్టలను సైతం కొందరు అక్రమార్కులు ఆక్రమించేస్తున్నారు. కట్టల మట్టిని సైతం అమ్ముకున్న ఘటనలు ఉన్నాయి. కట్టలను తవ్వేసి సాగు భూములుగా మార్చుకుంటున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పర్యవేక్షణ ఏది?

వాస్తవానికి వర్షాకాలం ప్రారంభానికి ముందే కాల్వల మరమ్మతులు, పూడికతీత పనులు పూర్తి కావాలి. కానీ, క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. కాల్వల పరిస్థితిని ముందే అంచనా వేసి నిధులు మంజూరు చేయించడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి.కాల్వల్లో చెట్లు పెరిగి చెత్తాచెదారం పేరుకుపోయింది. నీళ్లు వదిలినా మా పొలాల దాకా రావు. చెరువులు నిండవు. అధికారులు ముందస్తుగా ఎస్టిమేషన్లు వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించాల్సి ఉన్నప్పటికీ కాలయాపన చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాలు పడ్డాక పనులు చేస్తారా?” అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

Also Read: Jagga Reddy: ఆధార్ కార్డు ఇస్తే చాలు.. మీ ఇంటికి సైకిల్ వస్తుంది: జగ్గారెడ్డి!

ప్రభుత్వానికి చేరిన ‘ఎస్టిమేషన్లు’?  

సీజన్ తలపున ఉండటంతో ఇరిగేషన్ శాఖ అధికారులు మేల్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యవసరంగా పూడికతీత, మరమ్మతులు చేపట్టాల్సిన డిస్ట్రిబ్యూటరీల జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇందుకోసం ఎంత ఖర్చవుతుందనే దానిపై ‘ఎస్టిమేషన్ నివేదికలను’ ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. కానీ ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే తప్ప డిస్ట్రిబ్యూటరీల మరమ్మతులు సాగవు.

అన్నదాతల కళ్లల్లో ఆనందం..

రుతుపవనాలు ప్రవేశిస్తున్న తరుణంలో ప్రభుత్వం అధికారులు ఇచ్చిన నివేదికలను పరిశీలించి, నిధులు మంజూరు చేసి, టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. లేకుంటే వర్షాకాలం ప్రారంభమైతే కాల్వల్లోకి నీరు వస్తే, అప్పుడు పనులు చేయడం సాంకేతికంగా సాధ్యం కాని పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా కాల్వల ఆక్రమణలను అడ్డుకోవడంతో పాటు, యుద్ధప్రాతిపదికన నిధులు విడుదల చేసి డిస్ట్రిబ్యూటరీలను పునరుద్ధరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లేదంటే ఈ రబీ, ఖరీఫ్ సీజన్లలో చివరి ఆయకట్టు రైతులకు ఎండగట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అన్నదాతల కళ్లల్లో ఆనందం చూడాలంటే పాలకులు, అధికారులు ఫైళ్ల కదలికను వేగవంతం చేయాల్సిందే.

Also read: ఇంగ్లీష్ ఇర‌గ‌దీసిన రేవంత్‌! త‌డ‌బ‌డ‌కుండా.. సూటిగా! పాల‌న‌పై త‌న‌దైన మార్కును వివ‌రించిన సీఎం!

కట్టల ఆక్రమణ.. కొరవడిన పర్యవేక్షణ!

డిస్ట్రిబ్యూటరీ కాల్వల కట్టలను సైతం ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షించాల్సిఉంది. కానీ వారి నిర్లక్ష్యం ఆక్రమణదారులకు వరంగా మారింది. పలు ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటరీల కట్టలను పక్కనే ఉన్న భూస్వాములు, ఇతరులు ఆక్రమించి పొలాల్లో కలిపేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణాలకు వాడుకుంటున్నారు.కళ్లముందే కాలువలు అంతరించిపోతున్నా, కట్టలు తరిగిపోతున్నా ఇరిగేషన్ క్షేత్రస్థాయి అధికారులు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు రైతుల మధ్య ఘర్షణలు సైతం జరుగుతున్నాయి. కట్టల ఆక్రమణలతో కాలువల వెడల్పు తగ్గిపోతోంది. కొంతమంది రైతులు ఫిర్యాదు చేసినాసర్వే చేస్తామంటూ కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

మరమత్తులు శూన్యం..

ఎస్ఎల్బీసీ నుంచి నల్లగొండ ఉదయ సముద్రం ,మూసీకి నీరు వచ్చే మెయిన్ కెనాల్స్ కు ప్రభుత్వం నిధులు మంజూరుచేసి మరమ్మతులు చేపడుతుంది. కానీ ఉదయసముద్రం కింద ఉన్న 41 నుంచి55 వరకు ఉన్న డిస్ట్రిబ్యూటరీల మరమ్మతులు మాత్రం చేపట్టడం లేదు. దీంతో ఆ డిస్ట్రిబ్యూటరీకాల్వల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డిస్ట్రిబ్యూటరీ కాల్వాల కట్టలు ఆక్రమణకు గురయ్యాయి. కానీ అధికారులు నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకున్నదాఖలాలు లేవనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా? లేదా? చూడాలి.

Also Read: సీఎంను బలిస్తాం అంటూ.. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్!

Related News

సీఎంను బలిస్తాం అంటూ.. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్!

Singareni Coal: డేంజర్ బెల్స్.. సింగరేణిలో పడిపోయిన బొగ్గు నిల్వలు..?

Telangana Rains: దంచి కొట్టిన వర్షం.. నేడు రాష్ట్రంలోనే హయ్యెస్ట్ వాన ఎక్కడంటే..?

మిర్యాలగూడ బస్టాండ్‌లో ఏసీబీ ఉచ్చు.. దొరికిపోయిన వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్!

భద్రాచలం ఆలయ భూముల కబ్జా.. ఏపీ మంత్రికి తెలంగాణ మంత్రి లేఖ.. ఏం రాశారంటే?

Jagga Reddy: ఆధార్ కార్డు ఇస్తే చాలు.. మీ ఇంటికి సైకిల్ వస్తుంది: జగ్గారెడ్డి!

ఖమ్మం నగరానికి నయా లుక్.. సిద్ధమైన తీగల వంతెన.. తుది మెరుగులు చూసారా..!

Big Stories

×