E-Paper
Advertisement

OTT Movie : సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మలయాళ డార్క్ కామెడీ చిత్రం… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

OTT Movie : సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మలయాళ డార్క్ కామెడీ చిత్రం… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
Advertisement

OTT Movie :ఈ నవంబర్ నెలలో మలయాళం సినిమాల హడావిడి ఎక్కువగానే ఉంది. ఎక్కువగా థ్రిల్లర్ జానర్ లో నే స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. ఇప్పడు ధ్యాన్ శ్రీనివాసన్, లుక్మాన్ అవరన్ నటించిన ఒక డార్క్ కామెడీ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఇది ఒక డిఫరెంట్ స్టోరీతో రూపొందింది. ఈ కథ ఒక బంగారు గాజుల చుట్టూ తిరుగుతుంది. ఈ కథ క్లైమాక్స్ వరకు ఆసక్తికరమైన స్టోరీతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఈ మలయాళం కామెడీ ఎంటర్టైనర్ ఇప్పుడు ఏ ఓటీటీలోకి వచ్చింది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘వాలా – స్టోరీ ఆఫ్ ఎ బ్యాంగిల్’ (Vala: Story of a Bangle) అనే ఈ మలయాళ సినిమా ముహాషిన్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో లుక్మాన్ అవరాన్, ధ్యాన్ శ్రీనివాసన్, రవీనా రవి, విజయరాఘవన్ శాంతి కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2025 సెప్టెంబర్ 19న థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఇది నవంబర్ 13నుంచి సైనా ప్లేలో తెలుగు, తమిళ్, కన్నడ డబ్బింగ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఐయండిబిలో 7.2/10 రేటింగ్ కూడా పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సినిమా మొదలవ్వగానే సరళ అనే యువతి తన అమ్మమ్మ ఇచ్చిన పాత బంగారు గాజులను ధరించుకుని ప్రేమికుడు బానుతో పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి తర్వాత బాను ఆ బ్యాంగిల్‌ని తీసేయడానికి ట్రై చేస్తాడు. కానీ అది తీసేయలేకపోతాడు. ఆ బ్యాంగిల్‌కు మ్యాజికల్ లాక్ లాంటిది ఉంది. తీసేయడానికి స్పెషల్ కీ కావాలి. సరళకి ఇది ఒక ఇన్‌సెక్యూరిటీ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అది ఆమె అమ్మమ్మ గుర్తుగా ఉంటుంది. ఇదే సమయంలో పురుషు అనే మరొక యువకుడు, అతని భార్య వశిలాక్షితో కలిసి ఒక కమ్యూనిటీ సెంటర్‌లో సరళను కలుస్తారు. వశిలాక్షి ఆ బ్యాంగిల్‌ని చూసి ఇష్టపడి, పురుషును అలాంటి గాజులు కావాలని అడుగుతుంది.

Read Also : రిటైర్డ్ ఏజ్ లో పడుచు పిల్లతో పెళ్లి… కడుపుబ్బా నవ్వించే తెలుగు కామెడీ డ్రామా

ఇక అసలు స్టోరీ మొదలవుతుంది. పురుషు అది కొనిపెట్టడానికి ట్రై చేస్తాడు. కానీ అసలు అది ప్రైస్‌లెస్ అంటిక్. 19వ శతాబ్దానికి చెందిన రేర్ పీస్, హిస్టారికల్ వాల్యూతో ఉంటుంది. మరొకటి ఎంత వెతికినా దొరకదు. ఆ తరువాత ఎలాగైనా ఆ గాజులను సొంతం చేసుకోవాలనుకుంటాడు పురుషు. ఈ క్రమంలో కథలో ఊహించని ట్విస్ట్లు వస్తాయి. దానికి చాలా చరిత్ర ఉంటుంది. చివరికి ఆ గాజుల కథ ఏమవుతుంది ? పురుషు తన భార్యకి అలాంటి గాజులు తెచ్చిపెడతాడా ? దాని గత చరిత్ర ఏమిటి ?  అనే విషయాలను, ఈ మలయాళ కామెడీ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.
Advertisement

 

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×