Telugu Crime Thriller Series: భార్య కనిపించకుండా పోతే ఏ భర్త అయినా ఆమె ఆచూకీ కోసం ఆందోళన పడతాడు. పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆమె ఎక్కడుందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ అదే భర్త ప్రవర్తన పోలీసులకు అనుమానం కలిగిస్తే ? భార్య కోసం వెతకాల్సిన పోలీసులు, ఫిర్యాదు చేసిన భర్తనే ప్రశ్నించాల్సి వస్తే ? అతడు చెప్పే మాటల్లోనే ఏదైనా రహస్యం దాగి ఉందా ? ఇలాంటి అనుమానాలు, ఊహించని మలుపులతో సాగే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘నా వైఫ్ మిస్సింగ్’ (Na Wife Missing). అతని భార్య అదృశ్యం వెనుక అసలు నిజమేంటనేది కథలో ఆసక్తిని పెంచుతుంది. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను ఏ ఓటీటీలో చూడొచ్చు ? కథ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…
బాలసుబ్రహ్మణ్యం అలియాస్ బాలు తన భార్య స్వప్న కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయిస్తాడు. ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియడం లేదని, ఆచూకీ కనిపెట్టాలని ఫిర్యాదు చేస్తాడు. మొదట ఇది సాధారణ మిస్సింగ్ కేసులాగే కనిపించినా, బాలు వ్యవహరించిన తీరు పోలీసుల్లో అనుమానాలు రేకెత్తిస్తుంది. ముఖ్యంగా స్వప్న కనిపించకుండా పోయిన వెంటనే కాకుండా ఒక రోజు ఆలస్యంగా ఫిర్యాదు చేయడం వారిని ఆలోచనలో పడేస్తుంది. నిజంగా భార్య కనిపించకపోవడంతో అతడు ఆందోళన చెందుతున్నాడా, లేక ఏదైనా విషయం దాచి పెడుతున్నాడా అనే సందేహం మొదలవుతుంది.
దీంతో పోలీసులు విచారణను ముమ్మరం చేస్తారు. స్వప్న చివరిసారిగా ఎక్కడ కనిపించింది ? బాలు ఆమెతో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడాడు ? భార్యాభర్తల మధ్య ఏవైనా గొడవలు జరిగాయా ? ఆమె కనిపించకుండా పోయిన సమయంలో బాలు ఎక్కడ ఉన్నాడు ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తారు. బాలు చెప్పే విషయాలను పరిశీలిస్తూ, అతడి మాటలకు ఇతర ఆధారాలు సరిపోతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.
మరోవైపు స్వప్న అదృశ్యానికి అసలు కారణమేంటన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగులుతుంది. ఆమె ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందా ? లేక ఆమె కనిపించకుండా పోవడం వెనుక ఏదైనా నేరం ఉందా ? బాలు నిజంగానే భార్యను వెతుకుతున్నాడా, లేక పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడా ? ఇలా ఒక్కో ప్రశ్న కథపై ఆసక్తిని పెంచుతుంది. దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ అనుమానాలు మరింత బలపడతాయి. అసలు నిజం బయటపడే వరకు ప్రేక్షకులు కూడా ప్రతి పాత్రను అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఆమె ఎలా మిస్ అయ్యింది ? దానికి కారణం ఎవరు ? అందులో ఆమె భర్త పాత్ర ఏంటి ? చివరికి దొరికిందా లేదా ? అన్నది చూసి తెలుసుకోవాల్సిన స్టోరీ.
వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘నా వైఫ్ మిస్సింగ్’ (Na Wife Missing) తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. గతంలో ఈ జంట ‘కొత్త బంగారులోకం’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత మరోసారి ఈ సిరీస్ తో తెరపై సందడి చేస్తోంది వరుణ్ – శ్వేత జంట. ఇక ఈ సిరీస్ ఆహా (Aha)లో స్ట్రీమింగ్ అవుతోంది. భార్య అదృశ్యం, అనుమానాస్పద భర్త, పోలీసుల దర్యాప్తు చుట్టూ కథ సాగుతుంది. మిస్టరీలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఊహించని మలుపులు ఇష్టపడేవారు ఈ సిరీస్ ను అస్సలు మిస్ అవ్వొద్దు.
Read Also: కాలేజీ హాస్టల్లో వరుసగా మిస్సవుతున్న అమ్మాయిలు… సైకో కిల్లర్ మాస్ మర్డర్స్ వెనుక బిగ్ ట్విస్ట్