E-Paper
Advertisement

కాలేజీ హాస్టల్‌లో వరుసగా మిస్సవుతున్న అమ్మాయిలు… సైకో కిల్లర్ మాస్ మర్డర్స్ వెనుక బిగ్ ట్విస్ట్

కాలేజీ హాస్టల్‌లో వరుసగా మిస్సవుతున్న అమ్మాయిలు… సైకో కిల్లర్ మాస్ మర్డర్స్ వెనుక బిగ్ ట్విస్ట్
Advertisement

Tamil Crime Thriller: ఓ ఇంజినీరింగ్ కాలేజీ… చుట్టూ దట్టమైన అడవి… రాత్రి అయితే బయటకు రావాలంటేనే భయం. ఆ కాలేజీ అమ్మాయిల హాస్టల్‌ లో మాత్రం వరుసగా విద్యార్థినులు ప్రాణాలు కోల్పోతుంటారు. వాటిని అడవి జంతువుల దాడులుగా చెబుతూ కాలేజీ యాజమాన్యం అసలు నిజాన్ని దాచిపెడుతుంది. కానీ ఓ విద్యార్థి మాత్రం ఈ మరణాల వెనుక ఏదో పెద్ద రహస్యం ఉందని అనుమానిస్తాడు. తన స్నేహితులతో కలిసి దర్యాప్తు మొదలుపెట్టి, భయంకరమైన నిజాన్ని బయటపెడతాడు. అదే తమిళ హారర్ క్రైమ్ థ్రిల్లర్ ‘డి బ్లాక్’ (D Block). ఈ హార్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో ? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే… 

కథ 2006లో కోయంబత్తూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ నేపథ్యంలో సాగుతుంది. అడవికి దగ్గరగా ఉన్న ఈ కాలేజీలో అరుల్ మొదటి సంవత్సరం చదవడానికి వస్తాడు. కొత్త స్నేహితులు, కాలేజీ జీవితం, ప్రేమ… ఇలా అతడి రోజులు సరదాగా గడుస్తుంటాయి. శృతితో అతడికి ప్రేమ కూడా మొదలవుతుంది. అయితే అమ్మాయిల హాస్టల్‌లో జరుగుతున్న వింత సంఘటనలు ఆ వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేస్తాయి.

Advertisement

స్వాతి అనే విద్యార్థిని రాత్రి సమయంలో వింత ఆకారాన్ని చూసి భయపడుతుంది. ఆ తర్వాత హాస్టల్‌ లోనే ఆమె అనుమానాస్పదంగా చనిపోతుంది. ఆమెను అడవి జంతువు చంపిందని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. కానీ ఆ మరణం వెనుక ఉన్న అసలు కారణాన్ని దాచి పెడుతుంది. ఆ తర్వాత కూడా అమ్మాయిలు ఒక్కొక్కరుగా కనిపించకుండా పోవడం, వారి మృతదేహాలు బయట పడటంతో విద్యార్థుల్లో భయం పెరుగుతుంది.

అరుల్‌ కు ఈ మరణాలపై అనుమానం వస్తుంది. తన స్నేహితులతో కలిసి విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. గతంలో చనిపోయిన అమ్మాయిల వివరాలు పరిశీలిస్తుండగా, ఈ సంఘటనలన్నింటికీ మధ్య కొన్ని పోలికలు ఉన్నాయని గుర్తిస్తారు. కాలేజీ యాజమాన్యం నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో, పాత ఘటనల గురించి తెలిసిన వారిని కలుస్తారు. అప్పుడు ఈ హత్యల వెనుక కాళి అనే వ్యక్తి ఉన్నాడనే భయంకరమైన నిజం బయటపడుతుంది.

Advertisement

చిన్నప్పటి నుంచే మానసిక సమస్యలతో ఉన్న కాళి గతంలోనూ చిన్నారులను అపహరించి హత్య చేసిన నేరస్థుడు. పోలీసులకు చిక్కి చికిత్స కేంద్రానికి వెళ్లిన అతడు అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత డి బ్లాక్ నిర్మాణ పనుల్లో పని చేస్తూ కాలేజీ పరిసరాలకు చేరుకుంటాడు. ఒకసారి అమ్మాయిల హాస్టల్‌ లోకి చొరబడేందుకు ప్రయత్నించినప్పుడు విద్యార్థులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించబోతారు. కానీ అతడు తప్పించుకుంటాడు. అప్పటి నుంచి హాస్టల్‌ లోని అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయడం మొదలుపెడతాడు.

అరుల్, అతడి స్నేహితులు కాళిని పట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా, శృతి కూడా అతడి బారిన పడుతుంది. ఆమెను అడవిలో బంధించిన కాళి నుంచి అరుల్, అతడి స్నేహితులు కాపాడతారు. పోలీసుల కోసం ఎదురు చూస్తున్న సమయంలో కాళి మళ్లీ హాస్టల్‌ పై దాడి చేస్తాడు. ఈసారి అతడిని ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదని గ్రహించిన విద్యార్థినులంతా ఒక్కటవుతారు. చివరికి అందరూ కలిసి కాళిని అడ్డుకుంటారు. ఈ భయంకరమైన హత్యల పరంపరకు ముగింపు పడుతుందా ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

ఓటీటీలో తెలుగులో చూడొచ్చా ?

విజయ్ కుమార్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరుళ్‌నిధి, అవంతిక మిశ్రా, చరణ్‌దీప్ కీలక పాత్రల్లో నటించారు. హాస్టల్‌లో జరిగే హత్యలు, అడవిలోని భయానక వాతావరణం, కిల్లర్ వెనుక ఉన్న నేపథ్యంతో కథ సాగుతుంది. ఈ సినిమా జీ5 (Zee5)లో తమిళ ఆడియోతో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు. హాస్టల్ మిస్టరీలు, సైకో కిల్లర్ కథలు, చివరి వరకు నిందితుడు ఎవరో తెలుసుకోవాలనే ఉత్కంఠ ఉన్న ఈ సినిమా థ్రిల్లర్ మూవీ లవర్స్ కు మంచి ఫీస్ట్.

Read Also: అపార్ట్‌మెంట్‌లో వరుస మిస్సింగ్స్.. ఆ బిల్డింగ్ కేర్‌టేకర్‌ వెనుక దాగిన భయంకర నిజం… హాలీవుడ్ హారర్ థ్రిల్లర్

Tags

Related News

విదేశాల్లో ఇండియన్ డిప్లొమాట్ కిడ్నాప్… ప్రాణాలను పణంగా పెట్టి ఏజెంట్ సాహసం… ఎండ్లెస్ డేంజర్ మిషన్

హైటెక్ పారిస్‌లో ఊహకందని హత్యలు… ఏఐ టెక్నాలజీతో ఆడుకుంటున్న సైకో కిల్లర్

ఆ అడవిలో చీకటి పడితే చాలు వింత శబ్దాలు… ట్రిప్ అంటేనే జడుసుకునే సైకలాజికల్ హార్రర్ థ్రిల్లర్

కూతురి ప్రాణాలు కాపాడుకోవడానికి లండన్‌ వెళ్తే ఊహించని షాక్… తండ్రికి నరకం… మస్ట్ వాచ్ థ్రిల్లర్

పెళ్లి, ప్రేమంటేనే గిట్టదు.. ఏకంగా ఆ బొమ్మల కంపెనీ ఓనర్‌తోనే… ట్రెండింగ్ కొరియన్‌ సిరీస్‌ తెలుగులో

కూతురిని కాపాడాలంటే భార్యను పంపమనే మాఫియా డాన్… 8.8 రేటింగ్‌తో దూసుకెళ్తున్న తెలుగు థ్రిల్లర్

పూజారి అంటే పూజలే అనుకుంటున్నారా ? విలన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఫైటర్… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×