E-Paper
Advertisement

Nayanam Trailer: కళ్ళు కదా చాలా ఇంపార్టెంట్.. ఆకట్టుకుంటున్న నయనం ట్రైలర్!

Nayanam Trailer: కళ్ళు కదా చాలా ఇంపార్టెంట్.. ఆకట్టుకుంటున్న నయనం ట్రైలర్!
Advertisement

Nayanam Trailer: టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ (Varun Sandesh)ఇదివరకు వెండి తెర సినిమాలలో నటించే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఇటీవల కాలంలో ఈయన వెండితెర సినిమాల ద్వారా సక్సెస్ అందుకోలేకపోయారు. ఈ క్రమంలో ఈయన డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల వరుణ్ సందేశ్ హీరోగా నయనం (Nayanam)అనే వెబ్ సిరీస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ జీ 5 లో డిసెంబర్ 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సిరీస్ స్వాతి ప్రకాష్ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సిరీస్ లో వరుణ్ సందేశ్ కంటి డాక్టర్ పాత్రలో కనిపించారు. బుల్లితెర నటి ప్రియాంక జైన్(Priyanka Jain) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ నుంచి ట్రైలర్ విడుదల చేయడంతో ఈ ట్రైలర్ కాస్త అందరిని ఆకట్టుకుంటుంది. “కళ్ళు కదా చాలా ఇంపార్టెంట్” అంటూ వచ్చే డైలాగులతో పాటు “కంటి డాక్టర్ దగ్గర కంటికి కనిపించని రహస్యాలు చాలా ఉన్నాయి” అంటూ వచ్చే డైలాగులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో వైరల్ అవుతుంది.

సైకో థ్రిల్లర్ గా నయనం..

ఇక ఈ ట్రైలర్ వీడియో చూస్తుంటే ఈ సిరీస్ మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ సైకో థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టం అవుతుంది. మొత్తం ఈ సిరీస్ ఆరు ఎపిసోడ్లు ఉండబోతున్నాయి. ఇందులో వరుణ్ సందేశ్ పాత్ర డార్క్ యాంగిల్ లో ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఫస్ట్ సిరీస్ కి సంబంధించిన ప్రమోషనల్ అప్డేట్స్ ఈ సిరీస్ పట్ల మంచి అంచనాలని పెంచేసాయి. మరి వెండి తెరపై ఇటీవల సక్సెస్ అందుకోలేకపోతున్న వరుణ్ సందేశ్ ఓటీటీ ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది. ఇక ఈ సిరీస్ డిసెంబర్ 19వ తేదీ జీ 5 లో అందుబాటులోకి రానుంది.

Advertisement

Also Read: LIK Movie: వాయిదా పడ్డ ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. కొత్త రిలీజ్ డేట్ ఇదే?

వరుణ్ సందేశ్ హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి నటుడిగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా అనంతరం ఈయన కొత్త బంగారులోకం వంటి మరో సూపర్ హిట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుణ్ సందేశ్ కు తిరుగు ఉండదని భావించారు కానీ తదుపరియన నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా డిజాస్టర్లు అయ్యాయి దీంతో వెండితెర అవకాశాలు తగ్గిపోయాయని చెప్పాలి. వెండితెర అవకాశాలు తగ్గడంతోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.బుల్లితెర నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ప్రియాంక జైన్ ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కు కాస్త దూరమైనప్పటికీ వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు .ఇక బిగ్ బాస్ తర్వాత పూర్తిగా సీరియల్స్ కు దూరంగా ఉన్న ఈమె త్వరలోనే నయనం అనే వెబ్ సిరీస్ ద్వారా రాబోతున్నారు.

Advertisement

 

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×