E-Paper
Advertisement

Poco C85 5G smartphone: పోకో సి85 5జి మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ.. ఫస్ట్ లుక్ రివీల్..

Poco C85 5G smartphone: పోకో సి85 5జి మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ.. ఫస్ట్ లుక్ రివీల్..
Advertisement

Poco C85 5G smartphone: భారతీయ మార్కెట్‌లోకి బడ్జెట్ 5జి సెగ్మెంట్‌లో సంచలనం సృష్టించడానికి Poco C85 5G సిద్ధమైంది. ఈ స్మార్ట్‌ఫోన్ నేడు డిసెంబర్ 9, 2025 మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా లాంచ్ కానుంది. గత కొద్ది రోజులుగా ఈ హ్యాండ్‌సెట్‌పై భారీ హైప్ నెలకొంది. బడ్జెట్ 5జి కేటగిరీలో పెద్ద బ్యాటరీ, భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌ల కాంబినేషన్‌తో వస్తుండటంతో, దీని పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రీమియం లుక్‌ డిజైన్

Advertisement

పోకో సి85 స్మార్ట్‌ఫోన్ ఆకర్షణీయమైన స్లీక్ బాడీ ట్రెండీ డ్యూయల్ టోన్ కలర్ డిజైన్‌తో వస్తోంది. ఈ ఫోన్ కేవలం 7.99mm థిక్‌నెస్‌తో చాలా స్లీక్‌గా ఉంటుంది. ఈ స్లిమ్ ప్రొఫైల్ ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. ఈ డిజైన్ యువతను లక్ష్యంగా చేసుకుంది. ఫోన్ చూడటానికి పెద్దగా అనిపించినా, చేతిలోకి తీసుకుంటే లైట్ వెయిట్‌గా ఉంటుందని, ఇది యూజర్‌కు, నిరంతర వినియోగంలో కూడా మంచి అనుభూతిని అందిస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ బ్లాక్, పర్పుల్, గ్రీన్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి వస్తుంది.

6.9 అంగుళాల స్మూత్ స్క్రీన్ డిస్‌ప్లే

Advertisement

ఈ హ్యాండ్‌సెట్‌లో 6.9 అంగుళాల ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లేని అందించారు. ఈ భారీ డిస్‌ప్లే అత్యంత స్మూత్ బెజెల్స్‌తో, ముందు వైపున సెల్ఫీ కెమెరా కోసం వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్‌తో వస్తుంది. స్క్రోలింగ్ గేమింగ్ అనుభవాన్ని పెంచడానికి ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ ఫెసిలిటీ కల్పించారు. హై రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల, సినిమాలు చూడటానికి, సోషల్ మీడియాలో స్క్రోల్ చేసినా, గేమ్ ఆడినా ఎలాంటి లాగ్ లేదా అడ్డుపడే ఫీలింగ్ లేకుండా కళ్లకు కిక్ ఇచ్చేంత స్మూత్‌గా ఉంటుంది.

బ్యాటరీ సామర్థ్యం 6000mAh

ఈ ఫోన్ యొక్క ప్రధాన ఆకర్షణ భారీ బ్యాటరీ సామర్థ్యం. ఈఫోన్‌లో 6000mAh శక్తి గల బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకూ కూడా ఆగకుండా నడిపే అద్భుతమైన స్టామినా దీనికి ఉందని కంపెనీ పేర్కొంటోంది. ఛార్జింగ్ కోసం 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు. దీనితో ఉదయం ఆఫీస్‌కు రెడీ అయ్యే లోపే కేవలం 20 నిమిషాలు ఛార్జ్ పెట్టినా, సగం రోజుకు సరిపోయేంత పవర్‌ను పొందవచ్చు. అత్యవసర సమయాల్లో ఇతర ఫోన్లకు పవర్ షేర్ చేయడానికి రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.

Also Read: Flipkart Buy Buy Sale: రేపటితో బై బై చెప్పనున్న ఫ్లిప్‌కార్ట్ బై బై సేల్.. భారీ డిస్కౌంట్‌తో 43 ఇంచుల TV హీట్ డీల్

కెమెరా .. డైలీ యూజ్‌కు తగిన సెటప్

కెమెరా విషయానికి వస్తే, వెనుకవైపు 50ఎంపి కెమెరా ముందువైపు 8ఎంపి సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ సెటప్ రోజువారీ ఫోటోలు, వీడియో కాల్స్, రీల్స్ సోషల్ మీడియా పోస్టింగ్‌లకు సరిగ్గా సరిపోతుంది. ఈ కెమెరా స్టిల్ క్వాలిటీ మెరుగ్గా ఉంటుందని, తగినంత బ్రైట్‌నెస్‌తో కూడిన షాట్‌లను తీయగలదని టాక్. కెమెరా టెస్ట్ తర్వాత దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్

పర్ ఫార్మెన్స్ సైడ్ లో మెడియటేక్ డిమెంసిటీ 6300 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. రోజువారీ పనులు, ఆఫీస్ అప్లికేషన్లు, సోషల్ మీడియా స్క్రోలింగ్, మరియు లైట్ గేమింగ్‌కు ఇది సరిపోతుంది. ఈ ఫోన్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులోకి వస్తుంది. స్టోరేజీని పెంచుకోవడానికి మైక్రో ఎస్‌డి కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. కెమెరా విషయానికి వస్తే, వెనుకవైపు 50ఎంపి ఏఐ కెమెరా, ముందువైపు 8ఎంపి సెల్ఫీ కెమెరాను అందించారు. సాధారణ ఫోటోలు, వీడియో కాల్స్, సోషల్ మీడియా పోస్టింగ్‌లకు ఈ సెటప్ తగినంత. డ్యూయల్ సిమ్ 5జి సపోర్ట్, లౌడ్ స్పీకర్, 3.5mm ఆడియో జాక్ వంటి అదనపు ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇండియాలో ధర ఎంతంటే?

Poco C85 5G ధర రూ.12,000 నుంచి రూ.13,000 మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు బలంగా అంచనా వేస్తున్నాయి. ఈ స్పెసిఫికేషన్లు ఈ ధర పరిధిలో లభిస్తే, ఈ ఫోన్ బడ్జెట్ 5జి సెగ్మెంట్‌లో తప్పక హడావుడి సృష్టించడం ఖాయం. విద్యార్థులు కొత్త ఉద్యోగులు వంటి బడ్జెట్ వినియోగదారులకు ఇది ఒక మంచి స్మార్ట్‌ఫోన్ డీల్ అవుతుంది. తక్కువ ఖర్చుతో అల్ట్రా మోడ్రన్ ఫీచర్లు కావాలంటే, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు జరిగే లాంచ్ తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ వివరాలను తప్పక పరిశీలించవచ్చు.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×