E-Paper
Advertisement

The Family Man season 3: ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ సిరీస్ లో విజయ్ సేతుపతి… కేక పెట్టించే క్రాస్ ఓవర్ మావా

The Family Man season 3: ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ సిరీస్ లో విజయ్ సేతుపతి… కేక పెట్టించే క్రాస్ ఓవర్ మావా
Advertisement

The Family Man season 3 : గత కొన్ని సంవత్సరాలలో ఎన్నో వెబ్ సిరీస్‌లు ఓటీటీలలో రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని మాత్రమే కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాయి. అందులో మనోజ్ బాజ్‌పేయి నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ కూడా ఒకటి. తాజాగా సీజన్ 3 రిలీజ్ కాగా, మతిపోగోట్టే స్పాయిలర్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సిరీస్ లో సౌత్ స్టార్ విజయ్ సేతుపతి క్యామియో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. పైగా ఫ్యామిలీ మ్యాన్ తో మరో మైండ్ బెండింగ్ సిరీస్ క్రాస్ ఓవర్ ట్విస్ట్ కూడా ఉండడం విశేషం.

విజయ్ సేతుపతి రోల్ ఇదే 

‘ది ఫ్యామిలీ మ్యాన్’ మొదటి సీజన్ 2019 సెప్టెంబర్ 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై, సంచలనం సృష్టించింది. 2021 జూలై 4న సీజన్ 2 రిలీజ్ కాగా, దానికి కూడా మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఇక దాదాపు నాలుగేళ్ళ గ్యాప్ తరువాత ఈ శుక్రవారం ‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇందులో విజయ్ సేతుపతి పోషించిన క్యామియో హైలెట్ గా మారింది. విజయ్ సేతుపతి ఈ సిరీస్‌లో మైఖేల్ వెడనాయగం క్యామియోను పోషించాడు. అతను ‘ఫర్జీ’ సిరీస్‌లోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ అండ్ కౌంటర్‌ఫీటింగ్ అండ్ కరెన్సీ ఫ్రాడ్ అనాలిసిస్ & రీసెర్చ్ టీమ్ (CCFART) చీఫ్. ఇది ‘ఫర్జీ’, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మధ్య మొదటి అధికారిక క్రాస్‌ఓవర్ అన్నమాట.

Advertisement

‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’లో ఒక ఎపిసోడ్‌లో మయన్మార్‌లో ఉన్న రుక్పాను వెతకడానికి శ్రీకాంత్ (మనోజ్ బాజ్‌పేయి), జెకె (షరీబ్) సరిహద్దు దాటవలసి ఉంటుంది. ఇక్కడ మైఖేల్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి వారిద్దరూ అక్రమంగా సరిహద్దు దాటడానికి సహాయం చేస్తాడు. ఇక్కడ మైఖేల్-శ్రీకాంత్ మధ్య జరిగే డిస్కషన్ ఈ సిరీస్‌లో మెయిన్ హైలైట్.

ఊహించని క్రాస్ ఓవర్

‘ది ఫ్యామిలీ మ్యాన్’లాగే, ‘ఫర్జీ’ సిరీస్ ను కూడా రాజ్ నిడిమోరు, కృష్ణ డికె అకా రాజ్-డికె దర్శకత్వం వహించారు. ఇంకా రెండు షోలు కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అయ్యాయి. ఆసక్తికరంగా రాజ్-డికె రెండు షోల క్రాస్ఓవర్‌ను ‘ఫర్జీ’తోనే ముందు స్టార్ట్ చేశారు. ఇందులో ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’లోని ఐకానిక్ క్యారెక్టర్ చెల్లం సర్ (ఉదయ్ మహేష్) నటించారు. అంతే కాదు ‘ఫర్జీ’లో శ్రీకాంత్ తివారీ వాయిస్ ఓవర్ కూడా వచ్చింది. ఇక సీజన్ 3 లో మైఖేల్ వాయిస్ ఓవర్‌గా మాత్రమే తిరిగి వస్తాడని చాలా మంది అభిమానులు ఆశించారు. కానీ మేకర్స్ ఏకంగా ఆయన పాత్రనే తీసుకువచ్చి ఆడియన్స్ కు సర్పైజ్ ఇచ్చారు.

Advertisement

Read Also : ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3’ రివ్యూ

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×