E-Paper
Advertisement

IND VS SA 2nd Test: నేటి నుంచే రెండో టెస్ట్..లంచ్‌, టీ బ్రేక్ లో మార్పులు, 30 నిమిషాలు ముందుగానే

IND VS SA 2nd Test: నేటి నుంచే రెండో టెస్ట్..లంచ్‌, టీ బ్రేక్ లో మార్పులు, 30 నిమిషాలు ముందుగానే
Advertisement

IND VS SA 2nd Test:  టీమిండియా మరో రసవత్తర ఫైట్ కు సిద్ధమైంది. టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 2nd Test ) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే తొలి టెస్ట్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగగా, అందులో 30 పరుగులు తేడాతో టీమ్ ఇండియా దారుణ ఓటమి చవిచూసింది. చేజేతులా టీమిండియా ఆ మ్యాచ్ లో ఓడిపోయింది. ఇక ఇవాల్టి నుంచి ఈ రెండు జట్ల మధ్య రెండో బిగ్ ఫైట్ జరగనుంది. గౌహతి బర్సపారా క్రికెట్ స్టేడియం ( Barsapara Cricket Stadium, Guwahati) వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండో టెస్టు ఇవాళ ఉదయం ప్రారంభం అవుతుంది. ఇక ఈ మ్యాచ్ కు గిల్ దూరం అవుతున్నాడు. దీంతో రిష‌బ్ పంత్ కెప్టెన్ గా జ‌ట్టును న‌డిపించ‌నున్నాడు.

Also Read: 2025–26 Ashes series: ఇవాళ్టి నుంచే ‘యాషెస్’ సమరం.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్, టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే !

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ టైమింగ్స్ లో మార్పులు

Advertisement

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య నేటి నుంచి గౌహతి బర్సపారా క్రికెట్ స్టేడియం
వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ నేపథ్యంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. మ్యాచ్ టైమింగ్స్, లంచ్, టీ బ్రేక్ లలో కీలక పరిణామాలు జరగనున్నాయి. గౌహతిలో సూర్యుడు కాస్త ముందుగా రానున్నాడట. అలాగే సాయంత్రం కూడా త్వరగా చీకటి కానుంది. దీనికి చలికాలమే కారణం. ఈ నేపథ్యంలో టీ బ్రేక్ ఉదయం పూట నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది. మొదటి సెషన్ 30 నిమిషాలు ముందుగానే ప్రారంభమవుతుంది. మ్యాచ్ సాయంత్రం దాదాపు గంట ముందే ఫినిష్ కానుంది. అంటే 8:30 గంటలకు టాస్ ప్రక్రియ ఉదయం ఉంటుంది. 9 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. 11 గంటల వరకు తొలి సెషన్ పూర్తవుతుంది. 11 నుంచి 11:20 గంటల వరకు అంటే 20 నిమిషాల పాటు టీ బ్రేక్ ఇస్తారు. 12:20 నుంచి 1:20 మధ్యాహ్నం వరకు రెండవ సెషన్ కొనసాగుతుంది. 1.20 గంటల నుంచి 2PM వరకు లంచ్ బ్రేక్ ఇస్తారు. ఇక మూడవ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది.

Also Read: Asia Cup Rising Stars 2025: టీమిండియా వ‌ర్సెస్ బంగ్లా మ‌ధ్య సెమీస్‌..పాకిస్తాన్ మ్యాచ్ కూడా, టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

ఇరు జ‌ట్ల అంచ‌నా

Advertisement

ఇండియా ప్రాబబుల్ XI: యశస్వి జైస్వాల్, KL రాహుల్, వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్ (c & wk), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్/నితీష్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

దక్షిణాఫ్రికా ప్రాబబుల్ XI: ర్యాన్ రికెల్టన్, ఐడెన్ మార్క్రామ్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా (సి), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్నే (వారం), మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్/లుంగి ఎన్గిడి, సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×