BigTV English
Advertisement

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : బాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమాలను ఎప్పటినుంచో ఆరాధిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. ముంబై స్లమ్‌ జీవితం గడిపే ఒక టాక్సీ డ్రైవర్, లగ్జరీ లైఫ్‌లో ఉండే ఆకాశ్ అనే పైలట్ జీవితాలు అనూహ్యంగా కలవడంతో ఈ కథ ఊహించని మలుపులు తీసుకుంటుంది. డ్రగ్స్, కిడ్నాప్ వంటి అంశాలు ఎంట్రీ ఇవ్వడంతో, ఈ కథ ఎంగేజింగ్ గా నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


జియో సినిమాలో స్ట్రీమింగ్

“విస్ఫోట్”(Visfot)  2024లో విడుదలైన హిందీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. కూకీ గులాటీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రితీష్ దేశ్‌ముఖ్, ఫర్దీన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తే, ప్రియా బాపట్, క్రిస్టల్ డి’సోజా, షీబా చడ్డా, సీమా బిస్వాస్ సపోర్టింగ్ రోల్స్‌లో నటించారు. వైట్ ఫెదర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సంజయ్ గుప్తా, అనురాధ గుప్తా నిర్మించిన ఈ సినిమా, వెనిజువెలా చిత్రం రాక్, పేపర్, సిజర్స్ కి (2012) రీమేక్. ఈ సినిమా 2024 సెప్టెంబర్ 6న జియో సినిమాలో విడుదలైంది. 2 గంటల 11 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 5.7/10 రేటింగ్ పొందింది.

స్టోరీలోకి వెళ్తే

షోయబ్ ఖాన్ ముంబై డోంగ్రీలో టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూ, డిమెన్షియాతో బాధపడే తల్లి రోషన్, లవర్ లక్కీతో సంతోషంగా జీవిస్తుంటాడు. అతని చిన్ననాటి స్నేహితుడు మన్యా, డ్రగ్ పెడ్లర్‌గా, ఒక భయంకరమైన గ్యాంగ్‌స్టర్ ఆసిడ్ తాయ్ దగ్గర పనిచేస్తుంటాడు. ఒక రోజు మన్యా పోలీసుల నుంచి తప్పించుకోవడానికి, షోయబ్ టాక్సీలో డ్రగ్స్‌తో నిండిన జాకెట్‌ని వదిలేస్తాడు. షోయబ్ ఇంట్లో జాకెట్‌ని ఉంచగా, అతని ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ కారణంగా జాకెట్ మిస్‌ప్లేస్ అవుతుంది.  మరోవైపు ఆకాశ్ అనే పైలట్, తన భార్య తారా, కొడుకు పార్థ్ తో రిచ్ లైఫ్ గడుపుతుంటాడు. అయితే తారా, జావేద్ అనే వేరే వ్యక్తితో అఫైర్‌లో ఉండటం ఆకాశ్‌కి తెలుస్తుంది. దీంతో అతని లైఫ్ తలకిందులవుతుంది. ఫస్ట్ హాఫ్‌లో, షోయబ్, ఆకాశ్ జీవితాలు అనూహ్యంగా కలుస్తాయి. డ్రగ్స్ జాకెట్, కిడ్నాప్ సీన్‌తో టెన్షన్ బిల్డ్ అవుతుంది.


సెకండ్ హాఫ్‌లో జాకెట్ కోసం ఆసిడ్ తాయ్ నుంచి షోయబ్ బెదిరింపులను ఎదుర్కొంటాడు. ఆకాశ్ కొడుకు పార్థ్ కిడ్నాప్ కావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది. షోయబ్ నిజాయితీగా ఉన్నా, అతను వేరే వాళ్ల ఆటలో బొమ్మగా మారడం కథను ట్విస్ట్‌లతో నడిపిస్తుంది. ఆకాశ్, తారాల మధ్య కాన్‌ఫ్లిక్ట్, షోయబ్‌ని బాధ్యుడిగా నిందించడం, కరప్ట్ కాప్‌లు, గ్యాంగ్‌స్టర్‌లతో వచ్చే సీన్స్ ఫాస్ట్-పేస్డ్ యాక్షన్‌ని తెస్తాయి. చివరికి షోయబ్ ఈ డ్రగ్స్ రాకెట్ నుంచి బయటపడతాడా ? ఆకాశ్ కొడుకుని ఎవరు కిడ్నాప్ చేసారు ? షోయబ్, ఆకాశ్ ల జీవితాలు ఎలా లింకప్ అవుతాయి ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

Read Also : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Related News

Chiranjeeva Movie Review : ‘చిరంజీవ’ మూవీ రివ్యూ : షార్ట్ ఫిలింని తలపించే ఓటీటీ సినిమా

Jana Nayagan OTT: భారీ ధరలకు జననాయగన్ ఓటీటీ రైట్స్… తమిళ ఇండస్ట్రీలోనే రికార్డు ధర!

The Family Man 3 Trailer: హై వోల్టేజ్ యాక్షన్ గా ది ఫ్యామిలీ మ్యాన్ 3.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!

Chiranjeeva OTT : ఓటీటీలోకి వచ్చేసిన రాజ్ తరుణ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Jatadhara OTT: ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Big Stories

×