BigTV English

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : మలయాళం సినిమాలు మంచి కంటెంట్ ఉన్న స్టోరీలతో వస్తున్నాయి. ఓటీటీలో రావడమే ఆలస్యం, ఇక వీటిని వదిలి పెట్టకుండా చూస్తున్నారు. రీసెంట్ గా థియేటర్లలో ఫహద్ ఫాసిల్ నటించిన ఒక రొమాంటిక్ మూవీ సందడి చేసింది. ఈ నెల 26 నుంచి ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కి రాబోతోంది. పెళ్లి రోజు, పెళ్లి కూతురు పారిపోవడంతో ఈ కథ మొదలవుతుంది. ఆతరువాత ఈ సినిమా పెళ్లి కొడుకు ఎమోషనల్ జర్నీని ఆసక్తికరంగా చూపిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘ఒడుం కుతిర చాడుం కుతిర’ 2025లో విడుదలైన మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ. అల్తాఫ్ సలీం డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, కల్యాణీ ప్రియదర్శన్, రేవతి పిళ్ళై, లాల్, వినయ్ ఫోర్ట్, సురేష్ కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆషిక్ ఉస్మాన్ నిర్మించిన ఈ సినిమా,2025 ఆగస్టు 29న ఓణం సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్‌లో 2025 సెప్టెంబర్ 26 నుంచి మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమ్ అవ్వబోతోంది. 2 గంటల 33 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 7.2/10 రేటింగ్ పొందింది.

స్టోరీలోకి వెళ్తే

ఈ కథ అబీ అనే సరదాగా ఉండే యువకుడితో మొదలవుతుంది. అతను తన ప్రియురాలు నిధితో వివాహం చేసుకోబోతుంటాడు. అబీ హాయిగా జీవించే వ్యక్తి. తన జీవితంలో కొత్త ప్రేమ కోసం ఎదురుచూస్తున్నాడు. నిధి కలలో జీవించే స్వభావం కలిగిన అమ్మాయి. ఆమె ఎప్పుడూ తన ఊహలలో బతుకుతుంటుంది. పెళ్లి కి ముందు రాత్రి నిధి ఒక వింతైన కోరికను కోరుతుంది. ఆమెకు తెల్లని హల్వా ముక్కలా కనిపించే గుర్రం కావాలని అడుగుతుంది. ఈ కోరిక అబీని గందరగోళంలోకి నెట్టివేస్తుంది. కానీ అతను తన ప్రేమను నిరూపించుకోవడానికి ఈ అసాధారణ గుర్రాన్ని వెతకడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో పెళ్లి రోజున నిధి ఊహించని విధంగా అబీని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అతన్ని డిసప్పాయింట్ చేస్తుంది. ఆమె వెళ్లిపోయాక అబీ కూడా కోమాలోకి వెళ్ళిపోతాడు. సంవత్సరం తరువాత అందులో నుంచి బయటపడతాడు.


ఆ తరువాత అబీ ఒంటరిగా బాధపడుతున్న సమయంలో, బెంగళూరులో ఒక మహిళ పరిచయం అవుతుంది. ఆమెకు ఇతని సహాయం అవసరం అవుతుంది. ఈ మహిళ కూడా మానసిక సమస్యలతో, మొదట అబీతో దూరంగా ఉంటుంది. కానీ క్రమంగా వారిద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుని ఓదార్చుకుంటారు. ఈ సంబంధం అబీకి ఒక కొత్త ఆశను చిగురించేలా చేస్తుంది. అతను తన గతాన్ని మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. కథ మధ్యలో నిధి ఊహించని విధంగా అబీ జీవితంలోకి తిరిగి వస్తుంది. ఆమె తన తప్పులను గుర్తించి, అబీని అర్థం చేసుకున్నట్లు చెబుతుంది. ఆమె రాకతో అబీ మరింత గందరగోళంలో పడతాడు. ఇప్పుడు అతను రేవతితో ఏర్పడిన కొత్త బంధం, నిధితో తన గత సంబంధం మధ్య చిక్కుకుంటాడు. క్లైమాక్స్ ఒక విచిత్రమైన ముగింపును అందిస్తుంది. అబీ ఎవరితో జీవితం పంచుకుంటాడు ? ఈ కథ ముగింపు ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : పెళ్ళైన మహిళ మరో వ్యక్తితో… మర్డర్స్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

Related News

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : ఈ దెయ్యానికి అమ్మాయిలే కావాలి… ఒక్కో సీన్ కు గుండె జారిపోద్ది… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : గర్ల్స్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరా… విషయం తెలిసిందని అమ్మాయిపై అరాచకం… మెంటలెక్కించే ట్విస్టులు

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

Big Stories

×