Kerala News: కారణాలు ఏమైనా కావచ్చు.. భార్యభర్తల చిన్నపాటి మనస్పర్థల కారణంగా పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నారు. ఫలితంగా ఒకరినొకరు చంపుకోవడాలు మొదలయ్యాయి. తాజాగా అలాంటి ఘటన కేరళలో వెలుగుచూసింది. భార్యని చంపిన భర్త, ఆ తర్వాత ఫేస్‌బుక్ లైవ్‌లో భార్యని చంపిన నిజాన్ని అంగీకరించాడు. అసలు మేటరేంటి?
కేరళలోని కొల్లం ప్రాంతానికి చెందిన షాలిని-ఐజాక్ లకు వివాహ జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో ఒకరు కేన్సర్‌తో పోరాటం చేస్తున్నాడు. అయితే వారిద్దరి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. భర్త వేధింపుల కారణంగా సొంత ఇంట్లో నివాసం ఉంటుంది. స్థానిక పాఠశాలలో కేర్ టేకర్‌గా పనిచేస్తోంది. డ్యూటీకి వెళ్లడానికి సిద్ధమవుతోంది.
ఈ క్రమంలో సోమవారం షాలిని స్నానం చేసేందుకు వెళ్తున్న సమయంలో ఐజాక్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. శరీరంలో పలు చోట్ల కత్తితో ఆమెని గాయపరిచాడు. ఈ తతంగాన్ని ఘటన జరిగిన వెంటనే నిందితుడు ఫేస్‌బుక్ లైవ్ ద్వారా తన నేరాన్ని అంగీకరించాడు. ఘటన సమయంలో ఇద్దరు పిల్లలలో ఒకరు స్పాట్‌లో ఉన్నారు. తల్లి అరుపులు విని ఇరుగుపొరుగువారిని అప్రమత్తం చేశాడు.
కేవలం షాలినిపై అపనమ్మకం ఏర్పడిందని, ఈ కారణంగా చంపేశానని ఫేస్‌బుక్ లైవ్‌లో చెప్పాడు నిందితుడు. భార్యపై తీవ్ర ఆరోపణలు చేశాడు. షాలిని తనకు తెలియకుండానే ఇంటి బంగారాన్ని తాకట్టు పెట్టిందన్నాడు. కనీసం తనను పట్టించుకోలేదని, తన తల్లితో కలిసి విలాసవంతమైన జీవితం గడపాలని కోరుకుంటుందని ఆరోపించాడు.
ALSO READ: ప్రియురాలిని చంపి.. సూట్ కేసులో బాడీని కుక్కి, ఆపై సెల్పీ
తల్లి సపోర్టుగా అహంకారంగా ప్రవర్తించిందని, ఉద్యోగాలు పదేపదే మార్చడం ఇందుకు కారణంగా ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు నిందితుడు. భార్యను తాను హత్య చేసినట్లు పోలీసులకు వివరించాడు. అందుకు గల కారణాలను వివరించారు. వెంటనే నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు, అక్కడి నుంచి షాలిని ఇంటికి వచ్చారు.
మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. షాలిని 19 ఏళ్ల కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు. హత్య జరిగిన ఇంటిని ఫోరెన్సిక్ బృందం పరిశీలించాయి. మృతురాలు షాలిని, నిందితుని మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని కొల్లం నివాసి షాలినిగా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో నేరానికి ముందు దంపతుల మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నట్లు తేలింది.