Madhuri Rathod:రాతిరి రాతిరి రాతిరిలో, ప్రమీల ఓ ప్రమీల, బాసింగ బలాలే అంటూ ఎన్నో ఫోక్ సాంగ్స్ తో డ్యాన్సర్ గా తనకంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మాధురి రాథోడ్ (Madhuri Rathod) ఇటీవల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తన తోటి డ్యాన్సర్ ఈశ్వర్ సాయి (Eshwar Sai) తో రహస్య ఎఫైర్ నడుపుతోంది అంటూ ఈశ్వర్ సాయి భార్య అందుకు సంబంధించిన వీడియోలు, ఆడియో లీక్ లను బహిరంగంగా బయటపెట్టి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఈశ్వర్ సాయి భార్య శరణ్య (Saranya) లైవ్ డిబేట్ పెట్టి మరీ మాధురి రాథోడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మాధురి రాథోడ్ , ఈశ్వర్ సాయి రిలేషన్ పై పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవ్వడంతో తాజాగా ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. డ్యాన్సర్ ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, మోసం చేశాడని, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా సరే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మనస్థాపం చెంది మాధురి రాథోడ్.. తన ఇంట్లోనే ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్ గా మారింది.
మాధురి రాథోడ్ చేసిన కామెంట్లను బట్టి చూస్తే.. నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయికి రక్షణ కల్పిస్తున్నారు అంటూ ఆమె ఆరోపించింది. మరి నిజంగానే నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయికి రక్షణ కల్పిస్తున్నారా? అనే అనుమానాలు ఆడియన్స్ లో నెలకొన్నాయి.
also read:సంగీత్ శోభన్ ‘అంతా రాములోరు చూస్కుంటారు’ గ్లింప్స్ రిలీజ్!
ఫోక్ సాంగ్స్ తో డ్యాన్సర్స్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మాధురి రాథోడ్. ఈశ్వర్ సాయి అనూహ్యంగా ఒకే గదిలో ఈశ్వర్ సాయి భార్య శరణ్యకు పట్టుబడ్డారు. ఈశ్వర్ సాయి కి పెళ్లి జరిగి కొడుకు ఉన్నప్పటికీ , ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ తో రహస్య ఎఫైర్ కొనసాగించడం చూసిన ఈశ్వర్ సాయి భార్య శరణ్య రెడ్ హ్యాండెడ్గా వీరిని పట్టుకొని వేములవాడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. అంతేకాదు మాధురి రాథోడ్ తో పాటు తన భర్త ను కూడా కొట్టినట్టు ఇటీవల లైవ్ డిబేట్లో ఆమె చెప్పుకొచ్చింది. తనకు అన్యాయం జరిగిందని , న్యాయం కావాలని ఈశ్వర్ సాయి భార్య పోలీసులను ఆశ్రయించగా.. నార్సింగి పోలీసులు కేసు వద్దని ఇకపై ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ జోలికి వెళ్లకుండా ఒక పేపర్ పై సంతకం చేయించుకున్నారని తెలిపింది.
అటు ఈశ్వర్ సాయి కూడా మాధురి రాథోడ్ కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అయితే మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడని.. ఒక లేఖ విడుదల చేసింది. ఆ తర్వాత ఈశ్వర్ సాయి మోసం చేశాడని గ్రహించిన ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు అతడిని అరెస్టు చేయబోగా ఆయన పరారీలో ఉన్నట్లు సమాచారం . అయితే ఇప్పుడు మోసం చేశాడని, పోలీసులు అతడికి రక్షణ కల్పిస్తున్నారు అంటూ ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం
పెళ్లి చేసుకుంటానని మోసగించిన ఈశ్వర్ సాయిపై చర్యలు తీసుకోకపోవడంతో డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. నార్సింగి పోలీసులు ఈశ్వర్‌ను తప్పిస్తున్నారని ఆమె ఆరోపించారు.#MadhuriRathod #EeshwarSai #NarsingiPolice… pic.twitter.com/qRlwJH3Txx
— BIG TV Breaking News (@bigtvtelugu) September 6, 2026