E-Paper
Advertisement

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!
Advertisement

Gundeninda Gudigantalu Balu: గుండె నిండా గుడి గటలు సీరియల్ లో బాలు(Balu) పాత్రలో నటిస్తున్న విష్ణుకాంత్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఈ సీరియల్లో బాలు పాత్రలో తన అద్భుతమైన నటనను కనబరుస్తూ ఎంతోమంది ఆదరణ సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా విష్ణుకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఎంతో కంగారు వ్యక్తం చేస్తున్నారు. ఇకపై గుండె నిండా గుడిగంటలు (Gundeninda Gudigantalu)సీరియల్ లో బాలు పాత్రలో విష్ణు చూడలేమా? అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. అసలు బాలు సీరియల్ నుంచి తప్పుకోవడానికి కారణమేంటి అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే..

బిగ్ బాస్ హౌస్ లోకి గుండె నిండా గుడి గంటలు బాలు..

తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 కార్యక్రమం మరికొన్ని గంటలలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన వివరాలను ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అలాగే కొంతమంది కంటెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళుతున్నటువంటి వీడియోలు కూడా లీక్ అవుతున్నాయి. గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరో బాలు కూడా బిగ్ బాస్ హౌస్లో కనిపించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. విష్ణు బిగ్ బాస్ కార్యక్రమానికి తాను వెళ్లడం లేదని చెప్పారు కానీ ఇప్పుడు మాత్రం ఈయన ఉన్నఫలంగా బిగ్ బాస్ హౌస్ లో కనిపించడంతో ఈ ట్విస్ట్ ఏంటి బాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

గుండె నిండా గుడిగంటల నుంచి బాలు ఔట్…

Advertisement

ఇక నిజంగానే బాలు బిగ్ బాస్ హౌస్ సందడి చేయబోతున్నారా? ఇకపై గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో కనిపించరా? అనే విషయానికి వస్తే.. ఈయన బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం నిజమే అయినప్పటికీ బాలు మాత్రం ఫుల్ టైం కంటెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టలేదని తెలుస్తోంది. బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్ లో ఒక స్పెషల్ రోల్ లో మాత్రమే కనిపించి సందడి చేయబోతున్నారని సమాచారం. ఇలా బిగ్ బాస్ హౌస్ లో బాలు కంటెస్టెంట్ గా కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ కోసం మాత్రమే పిలిచారని తెలుస్తోంది. ఇలా బాలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ తెలియడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

బాలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే చూడాలని చాలామంది కోరుకుంటున్నారు కానీ అదే సమయంలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ కు దూరం అవటానికి కూడా అభిమానులు జీర్ణించుకోలేరనే చెప్పాలి. ప్రస్తుతానికి అయితే ఈ సీజన్ లో బాలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం లేదని తెలుస్తుంది. ఇక బాలు ప్రస్తుతం తెలుగులో గుండె నిండా గుడి గంటలు సీరియల్ తో పాటు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తెలుగులో తనకు గుండె నిండా గుడి గంటలు సీరియల్ మొదటి సీరియల్ అయినప్పటికీ ఈ సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు.

Also Read: జగమే సంగీతం పై చిరు ప్రశంసలు… చాలా గర్వంగా ఉందంటూ పోస్ట్!

Related News

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Big Stories

Advertisement
×