E-Paper
Advertisement

రిలీజ్ అయిన ఒక్కరోజులోనే ఓటీటీ నుంచి అవుట్… పట్టపగలే చూసినా ప్యాంటు తడవాల్సిందే

రిలీజ్ అయిన ఒక్కరోజులోనే ఓటీటీ నుంచి అవుట్… పట్టపగలే చూసినా ప్యాంటు తడవాల్సిందే
Advertisement

Horror Thriller OTT : కొన్ని హర్రర్ సినిమాలు ఎంత డేంజరస్ గా ఉంటాయంటే… మూవీని చూసిన చాన్నాళ్ల తరువాత కూడా దానికి సంబంధించిన జ్ఞాపకాలు వెంటాడతాయి. కల్లోకి వచ్చి కలవర పెడతాయి. ఇలాంటి సినిమాలకు వీక్ హార్ట్ ఉన్న ఆడియన్స్ చూస్తే అంతే సంగతులు. కానీ హర్రర్ మూవీ లవర్స్ కు మాత్రం ఇంతటి ఎక్స్ట్రీమ్ హర్రర్ ఉన్న సినిమాలంటేనే ఇష్టం. అలాంటి క్రేజీ మూవీ లవర్స్ కోసమే ఈ మూవీ సజెషన్.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఇండోనేషియా సంస్కృతి, మూఢనమ్మకాల నేపథ్యంలో సాగే ఒక భయంకరమైన సూపర్ నేచురల్ హర్రర్ థ్రిల్లర్ Waktu Maghri. 2023లో రూపొందిన ఈ మూవీని సూర్యాస్తమయం వేళ పిల్లలు బయట తిరగకూడదనే స్థానిక నమ్మకం ఆధారంగా తెరకెక్కించారు. ఈ సూపర్ హిట్ ఇండోనేషియన్ హారర్ చిత్రం సిద్ధార్థ్ టాటా దర్శకత్వంలో వచ్చింది. ఇప్పుడు Amazon Prime Video ఓటీటీలో ఈ మూవీని వీక్షించవచ్చు. ఈ సినిమాలో ఉన్న భయంకరమైన సీన్స్ కారణంగా UAE, సౌదీ అరేబియా వంటి కొన్ని ముస్లిం దేశాలలో ఈ సినిమాను ఓటీటీలో నుంచి రిమూవ్ చేశారు. ఇందులో చైల్డ్ ఆర్టిస్టుల నటన నుంచి మొదలు పెడితే, భయపెట్టే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, లోకల్ స్టోరీస్ వంటి ఎలిమెంట్స్ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. క్లైమాక్స్ క్రేజీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ భయంకరమైన మూవీ స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

Advertisement

సెంట్రల్ జావాలోని ఒక మారుమూల గ్రామంలో స్టోరీ నడుస్తుంది. ఆది, సమన్, ఆయు అనే ముగ్గురు చిన్న పిల్లలు ఉంటారు. ఆది, సమన్ రోజూ స్కూలుకు ఆలస్యంగా వెళతారు. అందుకు కారణం తమ కుటుంబాలకు పొలం పనుల్లో సహాయం చేయడం. దీనివల్ల రోజూ టీచర్ తో దెబ్బలు తినాల్సి వచ్చింది. దీంతో ఆమెపై తీవ్ర కోపంతో ఉంటారు. ఆ కోపంతోనే ఆది, సమన్, మగ్రిబ్ ప్రార్థనల సమయం మొదలవుతున్న తరుణంలో “ఆమె చచ్చిపోతే బాగుండు” అని గట్టిగా శపిస్తారు. విచిత్రంగా ఆ శాపం పెట్టిన కొద్దిసేపటికే మిసెస్ వోరో ఒక దారుణమైన ప్రమాదంలో చనిపోతుంది. అయితే ఆమె మరణం అనుమానాస్పదంగా మారుతుంది.

Also Read : కరోనా కంటే డేంజర్ వైరస్… ఒకసారి చూస్తే అస్సలు వదిలిపెట్టరు

Advertisement

టీచర్ చనిపోయినప్పటి నుండి ఆది, సమన్ ఇద్దరి జీవితంలో ఊహించని కష్టాలు ఎదురవుతాయి. భయంకరమైన దెయ్యాలు కన్పిస్తాయి. టీచర్ యూనిఫాంలో ఉన్న ఒక వింత ఆకారం వెంటాడుతూ భయపెడుతుంది. నెమ్మదిగా ఆ దుష్టశక్తి వారి శరీరాలపై, ఆత్మలను కంట్రోల్ చేస్తుంది. చూస్తుండగానే ఒకరోజు సమన్ ను పూర్తిగా దెయ్యం ఆవహిస్తుంది. తన సొంత అన్నతో దారుణంగా గొడవ పడతాడు. తరువాత మగ్రిబ్ ప్రార్థనల సైరన్ వినబడుతున్న సమయంలోనే ఆత్మహత్య చేసుకుంటాడు. అలాగే అతని స్నేహితులు కూడా షాక్ అవుతారు. ఆదిని, మిగిలిన ఫ్రెండ్స్ ను కాపాడడానికి ఆయు ఎంట్రీ ఇస్తుంది. మరి చివరికి ఏమవుతుంది ? అసలు వాళ్ళను వెంటాడుతున్న ఆత్మ ఎవరిది ? ఎందుకు ఆ శాపం అందరినీ చంపుతుంది ? అన్నది తెరపై చూడాల్సిన స్టోరీ.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×