E-Paper
Advertisement

కరోనా కంటే డేంజర్ వైరస్… ఒకసారి చూస్తే అస్సలు వదిలిపెట్టరు

కరోనా కంటే డేంజర్ వైరస్… ఒకసారి చూస్తే అస్సలు వదిలిపెట్టరు
Advertisement

Station Eleven Series on OTT : కరోనా సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ కరోనా అనే పేరు వింటేనే ఉలిక్కిపడే పరిస్థితులు చూసింది ప్రపంచమంతా. మరి అంతకంటే డేంజరస్ వైరస్ అటాక్ చేస్తే మనుషుల పరిస్థితి ఏంటి ? ప్రపంచంలో 99 శాతం జనాభాను ఆ వైరస్ తుడిచి పెట్టేస్తే ఏం జరుగుతుంది ? ఊహించడానికే భయంకరమైన ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైనా వచ్చాయా ? అయితే ఈ మూవీ మీ కోసమే. అచ్చం ఇలాంటి కథతోనే తెరకెక్కిన ఈ సినిమా పేరేంటి ? ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

అద్భుతమైన పోస్ట్-అపోకలిప్టిక్ సాగా మినీ-సిరీస్ Station Eleven. 2021లో వచ్చిన ఈ సిరీస్ హెమిలీ సెయింట్ జాన్ మాండెల్ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా రూపొందింది. ఒక భయంకరమైన ఫ్లూ వైరస్ వల్ల ప్రపంచ జనాభాలో 99% మంది చనిపోతారు. మిగిలిన వాళ్ళు తమ జీవితాలను ఎలా పునర్నిర్మించుకున్నారనేది ఈ సిరీస్ స్టోరీ. 10 ఎపిసోడ్ల ఈ ఎమోషనల్ సిరీస్ ఇండియాలో JioHotstar అవైలబుల్ గా ఉంది. మామూలు జోంబీ సినిమాలలా కాకుండా, ఇందులో మానవ సంబంధాలు, జ్ఞాపకాలు, మనల్ని బతికించే కళ గొప్పతనాన్ని చాలా అందంగా చూపించారు. అంతేకాదండోయ్ ఈ సిరీస్ అనేక ఎమ్మీ అవార్డుల నామినేషన్లను కూడా దక్కించుకోవడం విశేషం.

కథలోకి వెళ్తే…

Advertisement

చికాగో నగరంలో ఒక థియేటర్ నాటకంతో స్టోరీ షురూ అవుతుంది. పాపులర్ యాక్టర్ ఆర్థర్ లేండర్ స్టేజ్ పైనే హార్ట్ ఎటాక్‌ తో చనిపోవడంతో అందరూ షాక్ అవుతారు. ఆ సమయంలోనే మరోవైపు ప్రపంచాన్ని వణికించే ఒక భయంకరమైన ‘జార్జియన్ ఫ్లూ’ వైరస్ వ్యాపించి, ప్రాణాలు తీస్తూ ఉంటుంది. ఆ నాటకంలో నటించిన 8 ఏళ్ల పాప కిర్‌స్టెన్ బాధ్యతను అక్కడే ఉన్న జీవన్ అనే వ్యక్తి తీసుకుంటాడు. వారిద్దరూ జీవన్ సోదరుడి అపార్ట్‌మెంట్‌ లో దాక్కుని, బయట ప్రపంచం మొత్తం ఎలా నాశనం అవుతుందో, ఆ భయంకరమైన దృశ్యాలను కళ్లారా చూస్తారు.

ఆ తరువాత కథ ఒక్కసారిగా 20 ఏళ్ల ఫ్యూచర్ లోకి వెళ్తుంది. ఇప్పుడు కిర్‌స్టెన్ పెద్దదైపోతుంది. ‘ది ట్రావెలింగ్ సింఫనీ’ అనే సంచార కళాకారుల బృందంలో ఆమె ప్రధాన నటి. ఈ గ్రూప్ మిగిలి ఉన్న చిన్న చిన్న మానవ స్థావరాలకు తిరుగుతూ షేక్స్‌పియర్ వేస్తుంది. అయితే కిర్‌స్టెన్ కు చిన్నప్పుడు ‘స్టేషన్ ఎలెవెన్’ అనే ఒక అరుదైన గ్రాఫిక్ నవలను ఆర్థర్ లేండర్ ఇస్తాడు. ఇప్పటికీ ఆమె దాన్ని ప్రాణంగా దాచుకుంటుంది.

Advertisement

ఈ ప్రయాణంలో ‘ది ప్రాఫెట్’ అనే సైకో లీడర్ ఎదురవుతాడు. అతను చిన్న పిల్లలను బ్రెయిన్ వాష్ చేసి తన ముఠాలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాదు బాంబు దాడులు చేస్తాడు. ట్విస్ట్ ఏంటంటే… ఆ ప్రాఫెట్ ఆర్థర్ లేండర్ కొడుకు తైలర్. అతను కూడా చిన్నప్పుడు అదే ‘స్టేషన్ ఎలెవెన్’ కామిక్ బుక్ ను చదివి ఉంటాడు. కానీ అతను అందరిలా కాకుండా దానిని ఒక వినాశకరమైన సిద్ధాంతంగా మార్చుకుంటాడు. మరి ఒకే కామిక్ బుక్ చదివిన వీరిద్దరూ ఇంత భిన్నంగా ఎందుకు ఉన్నారు ? అతన్ని హీరోయిన్ ఏం చేసింది ? అన్నది స్టోరీ.

Read Also : హంతకులుగా మారే సైకో ప్రేమికులు… పబ్లిసిటీ స్టంట్స్‌ తో పిచ్చెక్కించే సాలిడ్ హాలీవుడ్ థ్రిల్లర్

Tags

Related News

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Big Stories

Advertisement
×