E-Paper
Advertisement

OTT Movie : 50 కి పైగా అవార్డులు…15 ఏళ్ల పాపకు నరకం చూపించే సైకోలు… గుండె తరుక్కుపోయే స్టోరీ

OTT Movie : 50 కి పైగా అవార్డులు…15 ఏళ్ల పాపకు నరకం చూపించే సైకోలు… గుండె తరుక్కుపోయే స్టోరీ
Advertisement

OTT Movie : ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకొని, అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకున్న సినిమా ‘వార్ విచ్’. ఈ మూవీ 50కి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుని రికార్డ్ సృష్టించింది. ముఖ్యంగా నటి రచెల్ మ్వాంజాకు అంతర్జాతీయ వేదికలపై లభించిన గుర్తింపు ఈ సినిమా ప్రత్యేకతను చెప్పకనే చెబుతోంది. ఇది 85వ అకాడమీ అవార్డుల వేడుకలో ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో కెనడా తరపున నామినేట్ అయింది. బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో రచెల్ మ్వాంజాకు ఉత్తమ నటిగా సిల్వర్ బేర్ అవార్డు లభించింది. ఇది ఆమెకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇలా అనేక అవార్డులను గెలుకుకున్న ఈ సినిమా స్టోరీ ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘వార్ విచ్’ (War Witch) 2012లో రిలీజ్ అయిన కెనడియన్ ఆఫ్రికన్ మూవీ. కిమ్ నుయేన్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో రాచెల్ మ్వాంజా, అలైన్ లెస్టర్, సెర్జ్ కాన్యోండా లీడ్ రోల్స్ లో నటించారు. 1 గంట 30 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 7.0/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

పశ్చిమ ఆఫ్రికాలోని ఒక మారుమూల గ్రామంలో కోమొనా అనే పదిహేనేళ్ళ అమ్మాయి, ఫ్యామిలీతో ప్రశాంతంగా జీవిస్తుంటుంది. అయితే ఉన్నట్టుండి ఆమె జీవితం అకస్మాత్తుగా తలకిందులవుతుంది. ఒక తిరుగుబాటు సైన్యం ఆమె గ్రామంపై దాడి చేసి, ఆమె కళ్లెదుటే తల్లిదండ్రులను బలవంతంగా చంపేస్తారు. కోమొనాను కిడ్నాప్ చేసి, తమ సైన్యంలోకి బలవంతంగా చేర్చుకుంటారు. అక్కడ ఆమెకు కఠోర శిక్షణ ఇస్తారు. తుపాకీ పట్టడం, చంపడం నేర్పుతారు. కఠినమైన శిక్షణ, మాదకద్రవ్యాల ప్రభావంతో ఆమె ఒక బాల సైనికురాలిగా మారుతుంది. ఒక రోజు కోమొనాకు చెట్ల పొదల మధ్య వింత ఆకారాలు, ఆత్మలు కనిపించడం మొదలవుతుంది. ఈ మంత్రశక్తులు శత్రువులని ముందుగానే పసిగట్టడానికి సహాయపడతాయని సైన్యాధ్యక్షుడు నమ్మడంతో, ఆమెకు “వార్ విచ్” (యుద్ధ మంత్రగత్తె) అనే పేరు పెట్టి, ప్రత్యేక గౌరవాన్ని ఇస్తాడు.

Read Also : గ్రామంలో వరుస హత్యలు… 20 ఏళ్ళ తరువాత సేమ్ సీన్ రిపీట్… ట్విస్టులతో పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

Advertisement

ఇక సైన్యంలో ఉండగానే, కోమొనా మాజిక్ అనే అబ్బాయితో స్నేహం చేస్తుంది. ఇక వాళ్ళ మధ్య ప్రేమ కూడా పుడుతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఆ భయంకరమైన వాతావరణం నుండి తప్పించుకోవడానికి ప్లాన్ వేస్తారు. అక్కడి నుంచి పారిపోయి, సురక్షితమైన ప్రదేశంలో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశపడతారు. అయితే అది అంత సులభం జరగదు. వీళ్ళకి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతాయి. చివరికి వీళ్ళు ఆక్కడి నుంచి తప్పించుకుంటారా ? ఆమెకు కనపడే మంత్రశక్తులు ఎలాంటివి ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

 

 

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×