Crime Thriller Web Series OTT : ప్రతిరోజూ అవమానాలు, వేధింపులు ఎదురైతే ? పని చేసే చోట కనీస గౌరవం దొరకకపోతే ? ప్రాణాల మీదకు వస్తే పిల్లి అయినా పులిలా మారుతుంది అంటారు కదా అలా ఉంటుంది సిట్యుయేషన్. ఎంత అమాయకంగా ఉన్నా ఓపిక నశించి, ఏదో ఒకరోజు అందరికీ ఎదురు తిరిగి తమకేం కావాలో అది దక్కించుకుంటారు. అలాంటి ఓ కానిస్టేబుల్ కథే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సిరీస్ లో ఉంటుంది. మరి ఈ ఖతర్నాక్ సిరీస్ పేరేంటి ? ఏ ఓటీటీలో చూసే ఛాన్స్ ఉంది ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఒరిజినల్ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ Warrant గురించే. ఇది 2026 మే 22న విడుదల కానుంది. ‘విలంగు’ (Vilangu – 2022) అనే సూపర్ హిట్ సిరీస్ కు సీక్వెల్ గా రానుంది ఈ సిరీస్.ను ప్రశాంత్ పాండియరాజ్ క్రియేట్ చేయగా, విగ్నేష్ నటరాజన్ దర్శకత్వం వహించారు. పోలీసుల అంతర్గత జీవితం, చట్టాలు, కానిస్టేబుల్ పరివర్తన వంటి అంశాల చుట్టూ తిరుగుతుంది ఈ సిరీస్ స్టోరీ. ఈ హై-వోల్టేజ్ క్రైమ్ డ్రామా సిరీస్ ను మరికొన్ని గంటల్లో ZEE5 లో చూడొచ్చు. తమిళంతో పాటు ఇతర దక్షిణ భాషల్లో కూడా ఇది అందుబాటులోకి రానుంది. ఇంటెన్స్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలను ఇష్టపడే వారికి ఇది మంచి ఎక్స్పీరియన్స్ ను ఇస్తుంది. ఈ సిరీస్‌లో కరుప్పుసామిగా ప్రశాంత్ పాండియరాజ్ నటిస్తే, బాలాజీ శక్తివేల్, కాళీ వెంకట్, అరుళ్ దాస్, నమ్రిత తదితరులు కీలక పాత్రల్లో కన్పించారు. సామ్ సి.ఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని ఇంటెన్సిటీని, సస్పెన్స్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లి, ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్ లోపల ఉండే వ్యవస్థాగత లోపాలను ఇందులో చాలా రియలిస్టిక్ గా చూపించారు.
ఒక చిన్న పట్టణంలో పని చేసే వ్యక్తి కోట్టై కరుప్పుసామి (ప్రశాంత్ పాండియరాజ్). ఈ అమాయకపు కానిస్టేబుల్ చుట్టూనే కథ అంతా తిరుగుతుంది. పోలీస్ శాఖలో తక్కువ స్థాయిలో పని చేసే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికే మనం చాలా సినిమాలలో చూశాము. అచ్చం అలాగే ఇందులో కూడా పై అధికారుల నుండి అతను ప్రతిరోజూ అవమానాలు, వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళు ఇతనికి తోటి మనిషి అనే కనీస గౌరవం కూడా ఇవ్వకుండా మాట్లాడతారు. నిరంతరం జరిగే ఈ అవమానాలు, హింస చూసి చూసి, ఒకానొక టైంలో అతని ఓపిక నశిస్తుంది. దీంతో మన హీరో తన లోపల అప్పటిదాకా అణచి పెట్టుకున్న కోపం, పగను బయటకు తీస్తాడు. దీంతో అతను మెల్లగా భయంకరమైన ఎన్‌ఫోర్సర్‌గా మారతాడు.
Also Read : ఆయుష్షును దొంగిలించే రాక్షసుడు… ‘స్ట్రేంజర్ థింగ్స్’ రేంజ్ లో అదరగొడుతున్న సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇక్కడే కథలో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంటుంది. సమాజం ఎప్పుడో మర్చిపోయిన, పెండింగ్‌లో ఉన్న పాత వారెంట్ (Warrant) కేసులను బయటకు తీస్తాడు. కరుప్పుసామి ఒక్కొక్క కేసును వినూత్న రీతిలో ఛేదించడం షురూ చేస్తాడు. అక్కడితో ఆగకుండా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని నేరస్థుల పట్ల అత్యంత క్రూరంగా బిహేవ్ చేస్తాడు. ఎంత దారుణంగా అంటే… అతని ప్రవర్తన చూసిన జనాలు ఇతను చట్టాన్ని కాపాడుతున్నాడా ? లేకపోతే ఆ చట్టానికే ముప్పుగా మారాడా అని భయంతో వణికిపోతారు. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ లో ఒక కస్టోడియల్ డెత్ జరుగుతుంది. ఈ కేసు అతని జీవితాన్నే కాదు, వ్యవస్థను కూడా కుదిపేస్తుంది.