E-Paper
Advertisement

భారీ యాక్షన్ సీన్స్ లేవు, స్టంట్స్ లేవు… టాప్ రేటింగ్ తో దుమ్మురేపుతున్న సిరీస్

భారీ యాక్షన్ సీన్స్ లేవు, స్టంట్స్ లేవు… టాప్ రేటింగ్ తో దుమ్మురేపుతున్న సిరీస్
Advertisement

Korean Comedy Drama: ప్రతి ఒక్కరూ లైఫ్ లో ఏదో ఒక టైమ్ లో తమను తాము తక్కువగా చూసుకుంటూ, పక్కవారితో పోల్చుకుంటూ బాధపడతారు. అసూయ, నిరాశలో మునిగిపోతారు. ఇలాంటి విషయాలనే సహజంగా, కామెడీ అండ్ ఎమోషనల్ గా చూపించిన కొరియన్ వెబ్ సిరీస్ ‘వీ ఆర్ ఆల్ ట్రైయింగ్ హియర్’ (We Are All Trying Here). పైగా దీన్ని సినిమా పరిశ్రమ నేపథ్యంతో ముడిపెట్టారు. 2026లోనే విడుదలైన ఈ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఇందులో మన హీరో పేరు హ్వాంగ్ డాంగ్-మాన్. అతను దర్శకుడిగా తన మొదటి సినిమాను ఎలాగైనా తెరకెక్కించాలని గత 20 సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉంటాడు. అతనితో పాటు కెరీర్ ప్రారంభించిన స్నేహితులంతా ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్లుగా మారి సక్సెస్ అవుతుంటే, తను మాత్రం ఇంకా లైఫ్‌లో స్థిరపడలేక నలిగిపోతుంటాడు. ఆ అసూయ, నిరాశ అతని మాటల్లో, ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తుంది.

Advertisement

ఎక్కడా దిక్కుతోచని స్థితిలో అతనికి బైన్ ఉన్-ఆ అనే వర్క్ ప్రెజర్‌తో సతమతమవుతున్న ఒక ప్రొడ్యూసర్ పరిచయం అవుతుంది. ఆమె కూడా తన ఉద్యోగంలో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ, వాటి నుంచి కోలుకోవడానికి కౌన్సెలింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఇద్దరి మధ్య స్నేహం మొదలై, క్రమంగా అది మరింత డీప్ బాండింగ్ గా మారుతుంది. ఇండస్ట్రీలో ఉన్న పార్క్ గ్యోంగ్-సే అనే మరో దర్శకుడితో డాంగ్-మాన్‌కు శత్రుత్వం మొదలవుతుంది.

గ్యోంగ్-సే ఇతనిపై రివెంజ్ తీర్చుకోవడానికి చాలా డర్టీ పాలిటిక్స్ ప్లే చేస్తాడు. మరోవైపు మా జే-యాంగ్ అనే వ్యక్తి సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడంతో, డాంగ్-మాన్ తీవ్రమైన ఈర్ష్యకు లోనవుతాడు. తనను అందరూ తక్కువ చేసి చూస్తున్నా, ఓటమి భయాలు వెంటాడుతున్నా… ఉన్-ఆ ఇచ్చే సపోర్ట్‌ తో డాంగ్-మాన్ తన విలువను తాను తెలుసుకుంటాడు. ఉన్-ఆ రాసిన ఒక సీక్రెట్ స్క్రిప్ట్‌కు కూడా ఇండస్ట్రీలో మంచి డిమాండ్ వస్తుంది. మరి చివరికి ఈ కథ ఎలా మారింది ? చివరకు హీరో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా ? క్లైమాక్స్ లో ఏం జరిగింది ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.

తెలుగులో ఉందా ?

Advertisement

ప్రముఖ స్క్రీన్‌ రైటర్ పార్క్ హే-యంగ్ రాసిన ఈ సైకలాజికల్, బ్లాక్ కామెడీ మెలోడ్రామాను… సినీ పరిశ్రమ నేపథ్యంలో ఈ ఎమోషన్స్ చాలా సహజంగా రూపొందించారు. Netflixలో కొరియన్ ఆడియోతో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు కాబట్టి ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ సహాయంతో చూడవచ్చు. దర్శకుడిగా మారాలి అనుకున్న ఒక వ్యక్తి పడే స్ట్రగుల్స్, ఒక్క సినిమాను డైరెక్ట్ చేయలేక అతను పడే ఇబ్బందులు చూస్తే జాలేస్తుంది. ఒకరకంగా సినిమా ఇండస్ట్రీలో ఫెయిల్ అయిన ప్రతీ ఒక్కరికీ, సినిమాలంటే పిచ్చి ఉండే వాళ్ళకి కూడా ఇది బాగా కనెక్ట్ అవుతుంది.

Read Also: 50 రోజులు అందమైన అమ్మాయితో గదిలో కాలు బయట పెట్టకుండా… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ

Tags

Related News

విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్..ఎక్కడ ?ఎప్పుడంటే?

Weekend OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. డోంట్ మిస్ ఇట్..

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

Big Stories

Advertisement
×