The Bluff OTT : ఎస్ఎస్ రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా వెంటనే వైరల్ అవుతోంది. తాజాగా ఆమె కొత్త చిత్రం గురించి వచ్చిన అప్డేట్ వైరల్ అవుతోంది. మరి ఈ మూవీ ఏంటి ? దానికి సంబంధించి వచ్చిన అప్డేట్ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
‘వారణాసి’తో పాటు ప్రియాంక చోప్రా నటిస్తున్న హాలీవుడ్ మూవీ ‘ది బ్లఫ్’ (The Bluff). ఈ సినిమా నుండి తాజాగా మేకర్స్ ప్రియాంక ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. నిజానికి ఈ చిత్రం షూటింగ్ 2024లోనే పూర్తయింది. కానీ ఇప్పుడు అంటే రెండు సంవత్సరాల తరువాత హీరోయిన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఏదైతేనేం ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రియాంక అభిమానులకు ఇది గుడ్ న్యూస్. ఈ సినిమాలో ఆమె యాక్షన్-ప్యాక్డ్ అవతార్ లో కనిపించనుందని ఫస్ట్ లుక్ ను చూస్తుంటే స్పష్టంగా అర్థం అవుతోంది.
రస్సో బ్రదర్స్ నిర్మించిన “ది బ్లఫ్” సినిమా నుంచి విడుదలైన ప్రియాంక చోప్రా లుక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక పోస్టర్ లో ఆమె కత్తి యుద్ధం చేస్తున్నట్లుగా ఉంది. మరో పోస్టర్‌లో తలపై స్కార్ఫ్ కప్పుకుని, ఇడియన్ లుక్ లో కన్పించింది. ఇంకొన్ని పోస్టర్లలో బ్లడ్ బాత్ తో ఇంటెన్స్ లుక్ లో దర్శనం ఇచ్చింది. ఇక ఈ పోస్ట్‌ను షేర్ చేస్తూ “సర్వైవల్ ఎట్ ఎనీ కాస్ట్” అని క్యాప్షన్ రాసి ఉండడం ఆసక్తిని కలిగిస్తోంది. ప్రియాంక చోప్రా ఇందులో కార్ల్ అర్బన్ అనే తల్లి, కేర్ టేకర్ పాత్రను పోషిస్తోంది. అయితే ఇక్కడ షాక్ అవ్వాల్సిన విషయం ఏమిటంటే ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోకి రాబోతోంది. థియేటర్లలో అయితే ప్రియాంక ఫ్యాన్స్ కు ఇదో విజువల్ ఫీస్ట్ అయ్యేది. కానీ మొత్తానికే ఆగిపోయింది అనుకున్న మూవీ నుంచి, ఇలా రెండేళ్ల తరువాత సడన్ గా అప్డేట్ ఊడిపడడం అన్నది మాత్రం సర్ప్రైజే. ఈ సినిమా 2026 ఫిబ్రవరి 25న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. ఫ్రాంక్ ఇ. ఫ్లవర్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి ప్రియాంక చోప్రా సహ నిర్మాతగా వ్యవహరించడం విశేషం.
Read Also : టీనేజ్ అమ్మాయి అదృశ్యం… 19 ఏళ్ల కిందటి కేసుతో లింక్… ట్విస్టులతో మతిపోగొట్టే మర్డర్ మిస్టరీ
‘ది బ్లఫ్’తో పాటు ప్రియాంక చోప్రా ప్రస్తుతం చేస్తున్న మరో పెద్ద సినిమా షూటింగ్ దశలో ఉంది. అదే రాజమౌళి ‘వారణాసి’ మూవీ. ఈ సినిమాలో కూడా ప్రియాంక యాక్షన్ అవతార్ లో కనిపించబోతోంది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదన్న సంగతి తెలిసిందే. ఆ మూవీ వచ్చేలోపు ‘ది బ్లఫ్’తోనే ఆమె ఫ్యాన్స్ సరిపెట్టుకోక తప్పదు.