E-Paper
Advertisement

Murder Mystery OTT : టీనేజ్ అమ్మాయి అదృశ్యం… 19 ఏళ్ల కిందటి కేసుతో లింక్… ట్విస్టులతో మతిపోగొట్టే మర్డర్ మిస్టరీ

Murder Mystery OTT : టీనేజ్ అమ్మాయి అదృశ్యం… 19 ఏళ్ల కిందటి కేసుతో లింక్… ట్విస్టులతో మతిపోగొట్టే మర్డర్ మిస్టరీ

Murder Mystery OTT : సీను సీనుకో ట్విస్ట్ తో ఊహించని మలుపులతో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజింగ్ గా సాగే జానరే మర్డర్ మిస్టరీ. మర్డర్ జరిగింది మొదలు, హంతకుడు ఎవరో కనిపెట్టే వరకు కథ ఊహకు అందకుండా పరుగులు పెడుతుంది. ఇప్పుడు మన మూవీ సజెషన్ కూడా అలాంటిదే. మరి ఆ మూవీ ఏంటి ? ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ 

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది మూవీ గురించి కాదు వెబ్ సిరీస్ గురించి. ఆ సిరీస్ పేరే ‘అరణ్యక్’ (Aranyak). 2021లో విడుదలైన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌ (netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. హిమాలయాల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ గ్రిప్పింగ్ క్రైమ్ డ్రామాను రోహిత్ శెట్టి నిర్మించగా, వినయ్ వైకుల్ దర్శకత్వం వహించారు. ఈ హిందీ సిరీస్ ను చరణ్ సింగ్ పఠానియా స్టోరీ ఆధారంగా తీశారు. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సీజన్ 1 ఓటీటీలో 2021 డిసెంబర్ 10 నుంచి అందుబాటులో ఉంది. మెయిన్ లీడ్ గా కస్తూరి డోగ్రా అనే పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ నటించింది. అంగద్ మాలిక్ అనే కొత్త ఆఫీసర్ గా పరంబ్రత చటర్జీ కన్పిస్తారు. అశుతోష్ రాణా, ఇంద్రనీల్ సేన్‌గుప్తా, మేఘ్నా మాలిక్, జాకీ ష్రాఫ్ (కేమియో) ఈ సిరీస్ లో కీ రోల్స్ పోషించారు. రాణీ ముఖర్జీ సినిమాలకు దూరమైన 7 ఏళ్ల తర్వాత ఈ సిరీస్ తో ఓటీటీ డెబ్యూ చేసింది.

Read Also : రిసార్ట్ లో 11 మందితో పార్టీ… రాత్రికి రాత్రే ఊహించని మర్డర్… ప్రతిక్షణం ఉత్కంఠ

స్టోరీలోకి వెళ్తే…

హిమాచల్ ప్రదేశ్‌ లోని ఫిక్షనల్ టౌన్ సిరోన్జ్‌ లో స్టోరీ సాగుతుంది. కస్టూరి డోగ్రా (రాణీ ముఖర్జీ) లోకల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ గా పని చేస్తుంది. డ్యూటీని పక్కన పెట్టి ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలని అనుకుంటుంది. అందుకోసం ట్రాన్స్‌ఫర్ తీసుకుని రిటైర్‌మెంట్ ప్లాన్ చేస్తుంది. కానీ అంతలోనె ఒక ఫ్రెంచ్ టీనేజ్ టూరిస్ట్ ఆయేషా అదృశ్యం అవుతుంది. ఆ కేసును కస్తూరికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మరోవైపు ఢిల్లీ నుండి యంగ్ ఆఫీసర్ అంగద్ మాలిక్ (పరంబ్రత చటర్జీ) ఇదే కేసులో జాయిన్ అవుతాడు. దీంతో ఇద్దరి మధ్య కేసు విషయమై విబేధాలు తలెత్తుతాయి. ఈ క్రమంలోనే ఇన్వెస్టిగేషన్ సాగుతుండగా, ఓ షాకింగ్ విషయం బయట పడుతుంది. ఆ షాకింగ్ విషయం ఏంటి ? ఆ అమ్మాయి ఎలా మిస్ అయ్యింది ? చివరకు ఈ కేసు ఏమైంది ? ఇందులో ఎవరి హస్తం ఉంది ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే సిరీస్ పై ఒక లుక్కేయండి. ముఖ్యంగా ట్విస్టులతో సాగే థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్.

Tags

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×