E-Paper
Advertisement

Venkaiah Naidu: మాతృభాష కంటి చూపు.. ఇంగ్లీష్ కళ్లజోడు: విశాఖలో వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు.

Venkaiah Naidu: మాతృభాష కంటి చూపు.. ఇంగ్లీష్ కళ్లజోడు: విశాఖలో వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు.
Advertisement

Venkaiah Naidu: విశాఖపట్నం వేదికగా జరిగిన ఒక కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మాతృభాష, సంస్కృతి, భారత ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాతృభాషను మర్చిపోయిన వాడు మానవుడు కాదని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. మాతృభాష కంటి చూపు వంటిదని, ఆంగ్ల భాష కేవలం కళ్లజోడు వంటిదని ఆయన అభివర్ణించారు. కంటి చూపు బాగుంటేనే కళ్లజోడుకు విలువ ఉంటుందని ఆయన గుర్తు చేశారు. తాను ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదని, అయితే మాతృభాషకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పాఠశాల విద్యలో తెలుగును తప్పనిసరి చేయాలని, ప్రభుత్వ పాలన, గెజిట్లు ప్రజల భాషలోనే ఉండాలని ఆయన కోరారు.

పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరించవద్దని, మమ్మీ, డాడీ వంటి పిలుపుల కంటే ‘అమ్మా’ అని పిలవడంలోనే అనురాగం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. సంప్రదాయ దుస్తులు, పద్ధతులను వదిలిపెట్టకూడదని, సంక్రాంతి వంటి పండుగలు పాతను వదిలి కొత్తను స్వీకరించడానికి సంకేతాలని వివరించారు. ఆహారపు అలవాట్లపై మాట్లాడుతూ.. పిజ్జాలు, బర్గర్లు వంటి పాశ్చాత్య ఆహార పదార్థాలు అనారోగ్యానికి హేతువులని, సంప్రదాయ వంటకాలతోనే ఆరోగ్యం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తన రాజకీయ ప్రస్థానం గురించి చెబుతూ.. ఎమర్జెన్సీ సమయంలో జైలు శిక్ష అనుభవించడం వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని, లేదంటే న్యాయవాది అయ్యేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. కేవలం సరిహద్దుల్లో ఉండటమే కాదని, ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వహించడమే నిజమైన దేశభక్తి అని ఆయన నిర్వచించారు. నదుల ఆక్రమణలపై యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఒకప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’గా అమెరికా విమర్శించినా, నేడు ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని ఐఎంఎఫ్ ప్రకటించడం గర్వకారణమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కన్నతల్లిని, జన్మభూమిని, గురువును ఎన్నటికీ గౌరవించాలని హితవు పలికారు.

Advertisement

Read Also:  బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్ష సూచన

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×