E-Paper
Advertisement

ఊరినే వల్లకాడుగా మార్చే ఒకే ఒక్క పొరపాటు… సింగిల్ గా చూశారో ఫసక్

ఊరినే వల్లకాడుగా మార్చే ఒకే ఒక్క పొరపాటు… సింగిల్ గా చూశారో ఫసక్
Advertisement

Horror movie OTT : హారర్ సినిమాల్లో దెయ్యం ఒక ఇంట్లో ఉంటుంది. ఒక కుటుంబాన్ని వెంటాడుతుంది. ఒక భవనాన్ని ఆక్రమిస్తుంది. ఇదంతా రోటిన్‌ కదా? అయితే ఒక తప్పు వల్ల మొత్తం గ్రామాన్నే నాశనం చేసే దుష్టశక్తి గురించి ఎప్పుడైనా విన్నారా? అదే కారణంగా 2023లో హారర్ అభిమానులను షాక్ కు గురిచేసిన చిత్రం వెన్ ఈవిల్ లర్క్స్ (When evil lurks) అర్జెంటీనా దర్శకుడు డెమియన్ రుగ్నా తెరకెక్కించిన ఈ సూపర్ నేచురల్ హారర్ మూవీ విడుదలైన వెంటనే ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ప్రస్తుతం జియోహాట్ స్టార్ లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం సాధారణ హారర్ కాదు. ఇది ప్రేక్షకుడికి నియమాలు నేర్పి, ఆ నియమాలను ఒక్కొక్కటిగా ఉల్లంఘిస్తూ భయాన్ని పెంచే సినిమా.

ఈ సినిమా కథ ఎందుకు డిఫెరెంట్?

కథ ఒక చిన్న గ్రామంలో మొదలవుతుంది. ఇద్దరు సోదరులు అడవి దగ్గర ఒక భయంకరమైన విషయాన్ని కనుగొంటారు. అక్కడ ఒక మనిషి శరీరంలో దుష్టశక్తి పెరుగుతూ ఉంటుంది. స్థానికుల నమ్మకం ప్రకారం అలాంటి వ్యక్తిని తప్పుగా హ్యాండిల్ చేస్తే ఆ చెడు శక్తి వేగంగా వ్యాపిస్తుంది. సమస్య ఏంటంటే ఆ గ్రామంలో ఎవరికీ ఏం చేయాలో పూర్తిగా తెలియదు. తెలిసిన వాళ్లు చెప్పిన మాటలు కూడా ఎవరూ వినరు. అక్కడి నుంచి కథ పరిగెడుతుంది. దెయ్యం ఎక్కడ ఉందో కాదు, ఎవరిలో ఉందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. నిన్నటి వరకు సాధారణంగా కనిపించిన వ్యక్తి ఈరోజు ప్రమాదంగా మారిపోతాడు. కుటుంబాలు చీలిపోతాయి. పిల్లలు కూడా సురక్షితంగా ఉండరు. నిజానికి ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకునేది పిల్లల పాత్రల వల్లే. సాధారణ హారర్ చిత్రాలు వెళ్లడానికి భయపడే కొన్ని చీకటి ప్రాంతాల్లో ఈ సినిమా ఎలాంటి బ్రేకులు లేకుండా దూసుకెళ్తుంది.

Advertisement

ఇక్కడ హీరోలు లేరు. తెలివైన పూజారులు లేరు. చివరి నిమిషంలో కాపాడే శక్తులు లేవు. ఒక్క తప్పు చేస్తే దాని మూల్యం చాలా పెద్దది. అదే ఈ సినిమా భయంకరమైన అంశం. ప్రేక్షకుడు కూడా పాత్రలతో పాటు నిరాశలోకి జారిపోతాడు. సినిమా చూస్తున్నప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది జంప్ స్కేర్స్ మీద ఆధారపడిన హారర్ కాదు. ఇది అసౌకర్యాన్ని సృష్టించే హారర్. కొన్ని సన్నివేశాలు పూర్తయ్యాక కూడా మెదడులో నుంచి వెళ్లవు. ముఖ్యంగా ఒక డిన్నర్ టేబుల్ సీన్, ఒక రోడ్ జర్నీ సీన్ చూసిన తర్వాత చాలా మంది ప్రేక్షకులు సినిమా ఆపేసి కొంతసేపు ఊపిరి పీల్చుకున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపించాయి.

Read Also : ప్రాణం వచ్చే బొమ్మలు… శపించబడిన జోకర్లు… తోడేలు మనుషులు… క్లైమాక్స్ కెవ్వు కేక

Related News

స్కూల్లో చేయకూడని పని… కట్ చేస్తే రౌడీ సీఈఓతో… మనసును హత్తుకునే కొరియన్ ప్రేమ కథ

మానవాళి మనుగడ కోసం క్రూరమైన రాక్షసులతో వార్… సెన్సేషనల్ యానిమే సిరీస్ తెలుగులో

డాన్ సామ్రాజ్యానికి రాణిగా మారే ఛాన్స్… ఈ క్రైమ్ అండ్ బోల్డ్ డ్రామాలో సస్పెన్స్ పీక్స్

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×