E-Paper
Advertisement

జైలులోనే అతి కిరాతకంగా హత్య… సైకో కిల్లర్ కు చెక్ పెట్టే లేడీ కిలాడీ

జైలులోనే అతి కిరాతకంగా హత్య… సైకో కిల్లర్ కు చెక్ పెట్టే లేడీ కిలాడీ
Advertisement

Crime Thriller OTT : ఒక హత్య కేసును ఛేదించాలంటే సాక్షులు కావాలి. ఆధారాలు కావాలి. నిందితుడు చేసిన పొరపాటు కావాలి. కానీ ఈ కథలో విచారణకు సహకరించింది ఒక శవం. మాట్లాడలేని శవం. కదలలేని శవం. అయినా అదే కేసును మలుపు తిప్పింది. ఇదే కడావర్ (Cadavar) సినిమా!

మర్డర్ మిస్టరీనా.. ఫోరెన్సిక్ థ్రిల్లరా?

2022లో విడుదలైన ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ లో అమలాపాల్ ప్రధాన పాత్ర పోషించింది. అనూప్ పణిక్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం జియోహాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. సాధారణ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కథల కంటే ఫోరెన్సిక్ సైన్స్ చుట్టూ తిరగడం ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. కథ మొదలయ్యేది ఒక సంచలన ఘటనతో. జైలులో కఠిన భద్రత మధ్య ఉన్న ఓ ఖైదీ అత్యంత కిరాతకంగా హత్య చేయబడతాడు. బయటివాళ్లు లోపలికి రావడం అసాధ్యం. లోపలివాళ్లు బయటకు వెళ్లడం అసాధ్యం. అలాంటి పరిస్థితుల్లో హత్య ఎలా జరిగిందనేది పోలీసులకు పెద్ద ప్రశ్నగా మారుతుంది.

Advertisement

ఈ కేసు దర్యాప్తులోకి డాక్టర్ భద్ర అడుగుపెడుతుంది . ఆమె ఒక ఫోరెన్సిక్ సర్జన్. శవాలను చూసి మరణానికి కారణం చెప్పడం మాత్రమే కాదు, శరీరంపై ఉన్న చిన్న చిన్న గుర్తుల ద్వారా మొత్తం కథను చదవగలిగే నిపుణురాలు. పోలీసులకు కనిపించని విషయాలు ఆమెకు కనిపిస్తాయి. అందుకే కేసు క్రమంగా పోలీసుల చేతుల నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్ టేబుల్ మీదికి చేరుతుంది. ఒక హత్య వెనుక మరో హత్య. ఒక ఆధారం వెనుక మరో రహస్యం. కథ ముందుకు వెళ్తున్న కొద్దీ ఇది సాధారణ మర్డర్ కేసు కాదని తెలుస్తుంది. ఎవరో చాలా తెలివిగా ప్లాన్ చేసిన నేరాల గొలుసు బయటపడుతుంది. ముఖ్యంగా హంతకుడు ఎంచుకునే విధానం, ఆధారాలను మాయం చేసే తీరు, పోలీసులను తప్పుదోవ పట్టించే పద్ధతులు కథకు మంచి ఉత్కంఠను తీసుకొస్తాయి.

ఈ సినిమాలో పెద్దగా మాస్ ఫైట్లు ఉండవు. హీరో ఎంట్రీలు ఉండవు. కానీ ప్రతి పోస్ట్ మార్టం సీన్ ఒక క్లూగా మారుతుంది. ప్రతి శవం కథలో కొత్త పేజీ తెరుస్తుంది. అదే ప్రేక్షకుడిని చివరి వరకు కూర్చోబెడుతుంది. అమలాపాల్ పాత్ర కూడా ఇక్కడ సాధారణ హీరోయిన్‌లా ఉండదు. కేసును పరిష్కరించే కేంద్ర బిందువుగా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ దగ్గరికి వెళ్లే కొద్దీ ఆమె పాత్ర ప్రాధాన్యం మరింత పెరుగుతుంది.

Advertisement

కడావర్‌ను చూస్తున్నప్పుడు ఇది మర్డర్ మిస్టరీనా, ఫోరెన్సిక్ థ్రిల్లరా, లేక సైకలాజికల్ గేమ్ ఆడుతున్న కిల్లర్ కథనా అనే సందేహం కలుగుతుంది. ఆ సందేహమే సినిమా బలం. చివర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం కథను మరో కోణంలో చూసేలా చేస్తుంది. ఒక శవం నుంచి మొదలైన ప్రయాణం చివరికి ఎవరి దగ్గర ముగుస్తుందో ఊహించడం అంత సులభం కాదు.

Read Also : రాత్రయితే చాలు అమ్మాయి కోసం వచ్చే వింత జీవి… ఇంటెన్స్ మిస్టరీ థ్రిల్లర్

Related News

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న తెలుగమ్మాయి ‘ఇల్లరికం’ కామెడీ మూవీ.. ఎందులో చూడొచ్చంటే?

ఒకే ప్యాటర్న్ లో వరుస హత్యలు… దిమాక్ కరాబ్ ట్విస్టులున్న మలయాళం థ్రిల్లర్

కొత్తగా చేరిన పోలీస్ ఆఫీసర్ కు చెమటలు పట్టించే ఊరు… తెలుగులోనే ఈ కన్నడ క్రైమ్ థ్రిల్లర్

థియేటర్లలోనే కాదు ఓటీటీలో దూసుకుపోతున్న సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ!

చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ట్విస్ట్?

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

10 రోజుల్లో పట్టుకోవాలని సీరియల్ కిల్లర్ ఛాలెంజ్… ప్రాసిక్యూటర్ కు మెంటలెక్కించే సైకో

పేర్లు తెలిస్తే చాలు చంపే టాలెంట్… స్పైన్ చిల్లింగ్ కొరియన్ హర్రర్ సిరీస్

Big Stories

Advertisement
×