E-Paper
Advertisement

ఫహాద్ ను ముప్పుతిప్పలు పెట్టే ముసలావిడ… మస్ట్ వాచ్ మలయాళ ఫీల్-గుడ్ అడ్వెంచర్ కామెడీ డ్రామా

ఫహాద్ ను ముప్పుతిప్పలు పెట్టే ముసలావిడ… మస్ట్ వాచ్ మలయాళ ఫీల్-గుడ్ అడ్వెంచర్ కామెడీ డ్రామా
Advertisement

Feel Good Malayalam Movie: ఎందుకిలా నా ఖర్మ కాలిపోయింది ? అని ఎప్పుడైనా అనిపించిందా ? లేదు అన్నారంటే అది బహుశా అబద్ధం అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక టైమ్ లో ప్రతి ఒక్కరం ఇలా అనుకుంటాము. లైఫ్ అంటేనే అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు, టర్నులు ఉన్న రోలర్ కోస్టర్. జీవితం ఎప్పుడూ ఒకేలా సాగదు. ఒక్క చిన్న ప్రయాణం, ఒక అనుకోని సమస్య… మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ ఫీల్-గుడ్ డ్రామా ‘పాచువుమ్ అద్భుత విళక్కుమ్’ (Pachuvum Athbutha Vilakkum) కూడా అలాంటి సినిమానే. 2023లో విడుదలైన ఈ మూవీని ఎక్కడ చూడవచ్చు ? అనే విషయం తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

సినిమాలో మన హీరో పేరు పాచు. ముంబైలో ఒక ఆయుర్వేద ఫార్మసీ షాప్ నడుపుకునే మధ్యతరగతి యువకుడు. అతను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిల కోసం వెతుకుతుంటాడు, కానీ ఏదీ కుదరదు. ఒక చిన్న పని మీద అతను కేరళకు వెళ్తాడు. తిరుగు ప్రయాణంలో, అతను ముంబైలో నడుపుతున్న షాప్ ఓనర్ రియాజ్ తల్లి లీల అనే వృద్ధురాలికి తోడుగా ట్రైన్‌లో రావాల్సి వస్తుంది. లీల ఒక చిన్న పని మీద గోవా స్టేషన్‌లో దిగిపోతుంది.

Advertisement

ఆమెను వెతుక్కుంటూ పాచు కూడా గోవా వెళ్తాడు. అక్కడ లీల ఒక చిన్న పిల్లని ‘నిధి’ను రక్షించడానికి వచ్చినట్లు తెలుస్తుంది. నిధి చదువుకోవాలని ఆశపడుతుంటే, ఆమె పేద కుటుంబం మాత్రం ఆమె చేత బలవంతంగా పనులు చేయించి, డబ్బు సంపాదించాలి అనుకుంటుంది. నిధిని ఆ నరకం నుండి కాపాడి, చదివించాలని లీల డిసైడ్ అవుతుంది. లీల అడిగిన సాయం చేస్తే, పాచు ముంబైలో రన్ చేస్తున్న ఆయుర్వేద షాపును అతని పేరు మీద రాసిస్తానని ఆఫర్ ఇస్తుంది.

ఈ మిషన్‌లో పాచుకు సహాయం చేయడానికి హంసధ్వని అనే అమ్మాయి పరిచయం అవుతుంది. కేవలం స్వార్థంతో మొదలైన పాచు ప్రయాణం, నిధి పరిస్థితిని చూశాక పూర్తిగా మారిపోతుంది. లీల, హంసధ్వని సహాయంతో పాచు అన్ని అడ్డంకులను దాటి నిధిని ఎలా రక్షించాడు? సమాజంలో చదువుకు ఉన్న ప్రాముఖ్యతను ఎలా చాటాడు ? చివరికి హంసధ్వనితో అతని ప్రేమ ఎలా సఫలమైంది ? అనేదే ఈ ‘అద్భుత విళక్కుమ్’ కథ.

తెలుగులోనూ స్ట్రీమింగ్

Advertisement

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఆడియోలతో అందుబాటులో ఉంది. ఈ సినిమా చూస్తే మీరు కూడా జీవితంలోని చిన్న చిన్న అద్భుతాలను గుర్తుచేసుకుంటారు ఇదొక హృదయానికి హత్తుకునే చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఫహాద్ ఫాజిల్ పాచు పాత్రలో అద్భుతంగా నటించాడు. అంజనా జయప్రకాష్ హంసధ్వనిగా, ధ్వని రాజేష్ నిధిగా చాలా సహజంగా కనిపిస్తారు. విజి వెంకటేష్ లీల పాత్రలో హృదయాన్ని కదిలిస్తుంది. సినిమా రొటీన్ కథలా కనిపించినా, దాని వెనుక ఉన్న సందేశం స్ట్రాంగ్ గా ఉంటుంది. చదువు ప్రాముఖ్యత, ఒక చిన్న పిల్లని రక్షించడం ద్వారా మనం ఎంత పెద్ద మార్పు తీసుకురావచ్చు అనేది ఈ సినిమా ముఖ్య సందేశం.

Read Also: ఈ ఊర్లో డైరెక్ట్ గా దేవుడే చంపేస్తాడు భయ్యా… సీన్ సీనుకో ట్విస్ట్ తో సినిమా చూపించే సిరీస్

Tags

Related News

అవమానాల నుంచి అధిపత్యం వైపు… చరిత్ర సృష్టించిన ఓ రియల్ హీరో లైఫ్ స్టోరీ

ఊహకు అందని భవిష్యత్తు ప్రపంచం… విజ్ఞాన శాస్త్రం సృష్టించిన వింత వినాశనం

అపరిచితుల మధ్య రాత్రికి రాత్రే పుట్టే అందమైన ప్రేమ… మనసును హత్తుకునే మధురమైన లవ్ స్టోరీ

బార్డర్ దాటి వెళ్లిన డెడ్లీ కమాండోలు… శత్రువుల డెన్‌లో మైండ్ బ్లాక్ వేట

 ఒక క్షణంలో గతంలోకి… మరుక్షణం భవిష్యత్తులోకి… టైమ్ ట్రావెల్ రొమాంటిక్ డ్రామా

కుప్పలు తెప్పలుగా వచ్చి పడే భారీ అనకొండలు… ప్రాణాల కోసం పరుగులు… ఊపిరి బిగపట్టించే మాన్స్టర్ థ్రిల్లర్

ప్రేమికులపై కన్నేసిన మాస్క్‌డ్ కిల్లర్… వీడి కంట్లో పడ్డారా డైరెక్ట్ నరకానికే… భయపెడుతూనే నవ్వించే రొమాంటిక్ స్లాషర్ ఫిల్మ్

భార్యాభర్తల మధ్య రగిలిన గొడవలు… కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ డ్రామా

Big Stories

Advertisement
×