E-Paper
Advertisement

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ
Advertisement

Action Thriller: ఇండియన్ సినిమాల్లో హీరోయిన్లు గ్లామర్ కు మాత్రమే పరిమితం అవుతుంటారు. ఇప్పుడిప్పుడే ఆ ట్రెండ్ మారుతోంది. అయితే హాలీవుడ్ సినిమాల్లో ఈ ట్రెండ్ ఎప్పటినుంచో ఉంది. అలా ఓ లేడి కమాండో తీర్చుకున్న రివెంజ్ ను చూస్తే ముక్కున వేలేసుకుంటారు. తండ్రిని చంపిన వారిని తెలివిగా మన హిరోయిన్ మట్టుబెట్టే ఈ యాక్షన్ థ్రిల్లర్ పేరు ‘ట్రిగ్గర్ వార్నింగ్’ (Trigger Warning 2024). ప్రతీకారం తీర్చుకునే లేడీ కమాండో స్టోరీని ఏ ఓటీటీలో చూడొచ్చు ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సినిమాలో హీరోయిన్ పేరు పార్కర్. ఆమె అమెరికన్ ఆర్మీలో స్పెషల్ ఫోర్సెస్ కమాండోగా పని చేస్తూ ఉంటుంది. విదేశాల్లో ఒక సీక్రెట్ మిషన్‌లో ఉన్నప్పుడు, స్వదేశంలో ఉన్న ఆమె తండ్రి హ్యారీ అకస్మాత్తుగా మరణించాడనే వార్త తెలుస్తుంది. ఆమె తండ్రి నడుపుతున్న బార్ బాధ్యతలను చూసుకోవడానికి, అతని అంత్యక్రియల కోసం పార్కర్ తన సొంత ఊరైన ‘స్వాలో’కి తిరిగి వస్తుంది.

Advertisement

కానీ తండ్రి నార్మల్ గా చనిపోలేదని, అదొక ప్లాన్డ్ మర్డర్ అని ఆమెకు అనుమానం వస్తుంది. పార్కర్ తన తండ్రి మరణం వెనుక ఉన్న నిజాలను వెలికితీసే క్రమంలో ఆ ఊరిని శాసిస్తున్న ఒక శక్తివంతమైన హింసాత్మక గ్యాంగ్‌తో తలపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె మాజీ ప్రియుడు, ప్రస్తుతం ఆ ఊరి షెరీఫ్ అయిన జెస్సీ, అతని తండ్రి అయిన సెనేటర్ ఈజీల గురించి షాకింగ్ నిజాలు బయట పడతాయి. ఆ ఊరి కింద ఉన్న ఒక పాత మిలిటరీ బంకర్ నుండి అత్యాధునిక ఆయుధాలను దొంగిలించి బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకునే ఒక పెద్ద మాఫియా నెట్‌వర్క్‌ను ఆమె తండ్రి కనిపెట్టాడని, అందుకే అతడిని చంపేశారని పార్కర్‌కు తెలుస్తుంది.

తన కమాండో స్కిల్స్ ఉపయోగించి ఆ ఊరిలోని అవినీతి రాజకీయ నాయకులను, క్రిమినల్ గ్యాంగ్‌ను పార్కర్ ఒంటరిగా అంతం చేస్తుంది. కత్తులతో యుద్ధాలు, గన్ ఫైట్స్, హై స్పీడ్ చేజ్ యాక్షన్ ప్యాక్డ్ సీక్వెన్స్‌లు అదిరిపోతాయి. మరి మాజీ ప్రియుడిని హీరోయిన్ ఎలా ఫేస్ చేసింది ? చివరికి వాళ్ళపై ఎలా పగ తీర్చుకుంది ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Advertisement

లీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ట్రిగ్గర్ వార్నింగ్’. జెస్సికా ఆల్బా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం2024 జూన్ 21న విడుదలైంది. Netflixలో ఈ సినిమా తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. కాబట్టి తెలుగు ప్రేక్షకులు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.

Read Also: బతికుండగానే చనిపోయిందని షాక్… డిజిటల్ ట్రాన్సాక్షన్ లో దిమ్మతిరిగే ట్విస్ట్

Tags

Related News

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Big Stories

Advertisement
×