E-Paper
Advertisement

ముళ్ల కుర్చీపై కూర్చున్న మ‌ల్ల‌న్న‌! బాస్‌ను తిట్టే తిట్ల‌న్నీ వింటూ ఓపిగ్గా భ‌రించిన మ‌ల్లారెడ్డి..!

ముళ్ల కుర్చీపై కూర్చున్న మ‌ల్ల‌న్న‌! బాస్‌ను తిట్టే తిట్ల‌న్నీ వింటూ ఓపిగ్గా భ‌రించిన మ‌ల్లారెడ్డి..!
Advertisement

మ‌ల్ల‌న్న‌, మ‌ల్లారెడ్డి.. అంటే ఎవ‌రో అనుకునేరు. మ‌న మేడ్చ‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డే. అంద‌రివాడు. అంద‌రి నోళ్ల‌లో ఉండేవాడు. న‌వ్వించేవాడు. రాజ‌కీయాల‌కు అతీతంగా క‌లిసిపోయేటోడు. కానీ ఇయాల మాత్రం బాగా ఇబ్బంది ప‌డ్డ‌డు. దాదాపు ఓ గంట‌పాటు తెగ ఇబ్బంది ప‌డ్డ‌డ‌నుకో. ముండ్ల కుర్చీపై కుర్చ‌న‌ట్టే ఫీల‌య్యాడు. ఆముదం తాగిన‌ట్టు ముఖం పెట్టాడు. ఎందుకు? అంటారా.

ఘ‌ట్‌కేస‌ర్‌లో జ‌రిగిన అందెశ్రీ జ‌యంతి వేడుల‌కు సీఎం రేవంత్‌రెడ్డి వ‌చ్చాడు క‌దా..ఆ ఏరియా ఎమ్మెల్యేనాయె.. పోక‌పోతే ఎట్లా? పార్టీ వేరే గావొచ్చు. సీఎం ప్రోగ్రామాయె. అందులోనూ అందెశ్రీ లాంటి ప్ర‌ముఖ క‌వి, గాయ‌కుడి జ‌యంతి ప్రోగ్రామాయె. అందుకే వ‌చ్చాడు. అక్క‌డ ఇసొంటిదేదో జ‌రుగుత‌ద‌ని ఆయ‌న‌కు తెలుసు. కానీ మ‌రీ ఇంత‌లా తిడ‌త‌డ‌ని మాత్రం ఊహించి ఉండ‌డు.

Advertisement

ఆ వేదిక మీద సీఎం మాట్లాడుతుంటే.. కేసీఆర్‌ను తిడుతుంటే.. బీఆరెస్ పాల‌న‌పై దుమ్మెత్తిపోస్తుంటే.. శాప‌నార్ధాలు పెడుతుంటే.. మాడిపోయిన ముఖ‌మేసుకుని దిక్కులు చూసుకుంట కూర్చున్న‌డు. త‌న‌ను ఎవ‌ర‌న్నా గ‌మ‌నిస్తున్నారా? అని దొంగ‌చాటుగా చూసిన‌ట్టే క‌నిపించింది. త‌న ఫీలింగ్సును ఎవ‌రి కంటా క‌న‌బ‌డ‌కుండా ఉండేందుకు విశ్వ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టుగా క‌నిపించాడు.

ఎప్పుడూ ఆ మోముపై చిరున‌వ్వు ఉంటుంది. కానీ సీఎం మాట్లాడుతున్నంత సేపు ఆ ముఖంలో న‌వ్వు ఛాయ‌లు బూత‌ద్దం పెట్టి వెతికినా క‌నిపించ‌లేదు. ముఖం ఎర్ర‌టి కంద‌గ‌డ్డ‌లా మారిపోయింది. పాపం.. ఈ బాధ ప‌గ‌వాడికి కూడా రావొద్దు మ‌ల్ల‌న్నా..! అని ఆయ‌న‌ను గ‌మ‌నించిన వారు మ‌న‌సులోనే అనుకుని బాధ‌ప‌డి, సానుభూతి తెలిపి.. సీఎం ప్రోగ్రం ఎప్పుడైపోత‌దో పాపం..అని అనుకున్నార‌ట‌.

Advertisement

అంత‌లా అక్క‌డి వాతావ‌ర‌ణం మ‌ల్ల‌న్న‌కు మ‌న‌స్తాపాన్ని, ఇబ్బందుల‌ను గురిచేసిందంటే అతిశ‌యోక్తి కాదేమో. ఎహె.. ఊకో అన్నా.. మ‌ల్ల‌న్న‌కు ఇవ‌న్నీ మామూలే. ఆయ‌న పార్టీలు మార‌లేదా? త‌నకు ప‌ద‌వి ముఖ్యం. ఆ ప‌ద‌వి కోసం రేపంటే రేపు కాంగ్రెస్‌లో కూడా చేరుత‌డు.. ! అని అంటారా? కావొచ్చు కానీ… ఇప్పుడు బీఆరెస్‌లో ఉన్నాడు క‌దా! ఆయ‌న ఇవ‌న్నీ ప‌ట్టించుకోడ‌న్నా.. పాల‌మ్మీ .. పూల‌మ్మీ వ‌చ్చినోడాయె..!

చెప్ప‌డం మ‌రిచిన‌.. ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా బీజేపీలో చేరే చాన్సుందంట అన్నా.. మొన్న పోయి క‌లిసి వ‌చ్చిండ్రంటా..! అవున‌నుకో.. కానీ.. ఎంతైనా కేసీఆర్ అంటే మ‌ల్ల‌న్న‌కు ఇష్టం. మ‌ల్ల‌న్న అంటే కేసీఆర్‌కు కూడా ఇష్ట‌మే. మ‌స్తు న‌వ్విపిస్త‌డు క‌దా. కేటీఆర్ కూడా బాగా లైక్ చేస్త‌డు మ‌ల్ల‌న్న‌ను. ఇంత‌లా ఇష్ట‌ప‌డ్డోళ్ల‌ను ఇష్ట‌మొచ్చిన‌ట్టు తుక్కు తుక్కు తిడుతుంటే.. మ‌న‌సు తుకడ‌లు.. తుక‌డ‌లు కాదానే!

మ‌రి ఎవ‌డు పోమ్మ‌న్న‌డు వ‌యా..! అరే పోయిన గానీ.. నెరీ ఇంత అన్నాల‌మాను వ‌యా..! ఏదో రెండు నిమిషాలు తిడుత‌డు కావొచ్చ‌నుకుంటే.. మొదాలు నుంచి కొసా వ‌ర‌కు.. ఒక‌టే తిట్టుడు..! తిట్టుడే తిట్టుడు.. ఒక్క మాట‌లో చెప్పాలంటే…..

Related News

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×