Thriller Series: మనుషుల్ని చనిపోక ముందే చనిపోయారు అంటూ ఫేక్ సర్టిఫికెట్లతో చేసే హంగామా గురించి మనందరికీ తెలుసు. కానీ ఒక్క క్లిక్ తో బతికి ఉన్న మనిషి చనిపోయిన్నట్టు మారిన కథను ఎప్పుడైనా చూశారా ? చూడకపోతే ఈ ‘డిజిటల్ డెత్’ (Digital Death)పై వెంటనే ఒక లుక్కేయండి. చాలామందికి తెలియని డిజిటల్ డెత్ అనే అంశాన్ని ఇందులో ప్రస్తావించారు. మరి ఈ సిరీస్ స్టోరీ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
సిరీస్ లో కథ మొత్తం మన హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది. ఆ అమ్మాయి లైఫ్ అందరిలాగే ఉద్యోగం, భవిష్యత్ ప్లాన్స్, కుటుంబం అంటూ సాఫీగా సాగిపోతుంది. కానీ ఓరోజు వచ్చిపడే ఊహించని ట్విస్ట్ తో ఆమె జీవితం మారిపోతుంది. ప్రభుత్వ రికార్డుల్లో ఒక చిన్న టెక్నికల్ ఎర్రర్ వల్ల ఆమె చనిపోయినట్లు రికార్డు అవుతుంది. ఆమె బతికే ఉన్నా, శ్వాస తీసుకుంటున్నా, కళ్లముందే ఉన్నా కూడా… సిస్టమ్ ఆమెను ‘డెడ్’గా మార్చేస్తుంది. మరి ఇలా ‘డిజిటల్ డెత్’ జరిగితే ఏం జరుగుతుంది ? అంటే…
ఆమె బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అవుతాయి. ఆధార్, పాన్, పాస్‌పోర్ట్ వంటి అన్ని డాక్యుమెంట్లు అన్నీ ఉన్నా ఎలాంటి వాల్యూ ఉండదు. ఇక హీరోయిన్ కు అప్పటికే అమెరికా వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ ఉంటుంది. కానీ ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను ‘డెడ్ పర్సన్’గా గుర్తించి ఎక్కనివ్వరు. ఆమె ఇంటి యజమాని, బ్యాంకు అధికారులు, పోలీసులు… అందరూ ఆమెను చనిపోయిన వ్యక్తిగా చూస్తారు. బతికున్నట్లు నిరూపించడానికి ఆమె పడే నరకయాతన ఈ సిరీస్ మెయిన్ స్టోరీ.
ఈ సిరీస్ ఊహ కాదు, మన దేశంలో నిజంగా జరుగుతున్న సాంకేతిక లోపాల ఫలితం. ETV Winలో ‘కథా సుధా’ వీక్లీ సిరీస్‌లో భాగంగా జూలై 5 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ‘డిజిటల్ డెత్’ సిరీస్ ఇదే విషయాన్ని ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. టాలెంటెడ్ నటి చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ టెక్ యుగంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో గుర్తు చేస్తుంది. ఒక్క డేటా ఎంట్రీ తప్పితే మన జీవితం ఎంత సులభంగా నాశనం అవుతుందో చూస్తే వణుకు పుట్టడం ఖాయం.
రియల్ లైఫ్ థ్రిల్లర్ లాగా ఉండే ఈ సిరీస్ తెలుగులోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. టెక్ థ్రిల్లర్లు, సస్పెన్స్ స్టోరీలు ఇష్టపడేవాళ్లు… ఎపిసోడ్ మొదలుపెడితే మొత్తం సిరీస్ కంప్లీట్ చేసేదాకా ఆపలేరు. మామూలు మనుషులు ఎదుర్కొనే సమస్యలను ఇందులో బాగా హైలైట్ చేశారు. ఈ కథలో హీరోయిన్ కేవలం తన గుర్తింపును తిరిగి పొందడానికి మాత్రమే కాకుండా, ఆ డిజిటల్ తప్పు వెనుక ఉన్న కుట్రను కూడా బయట పెట్టడానికి ట్రై చేస్తుంది. అందులో భాగంగా బయట పడే నిజం షాకింగ్ గా ఉంటుంది.
Read Also: మాఫియాను పట్టుకోవడానికి ఎరగా మారే లేడీ కానిస్టేబుల్… అన్నీ అవే సీన్లు