E-Paper
Advertisement

డివోర్స్ తీసుకోబోతున్న భార్య రాత్రికి రాత్రే మిస్సింగ్… గ్రిప్పింగ్ కొరియన్ సిరీస్

డివోర్స్ తీసుకోబోతున్న భార్య రాత్రికి రాత్రే మిస్సింగ్… గ్రిప్పింగ్ కొరియన్ సిరీస్
Advertisement

Korean psychological thriller: సంతోషంగా ఉండే భార్యాభర్తలు ఇద్దరూ సడన్ డివోర్స్ తీసుకోవాలి అనుకుంటే… అంతలోనే భార్య మిస్ అయితే… ఇలాంటి ఇంట్రస్టింగ్ స్టోరీతో రూపొందిన క్రేజీ కొరియన్ డ్రామానే ‘ది హస్బెండ్’ (The Husband). ఈ ఉత్కంఠభరితమైన రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

మన కొరియన్ హీరో కాంగ్ తే-జు. ఒకప్పుడు ప్రముఖ న్యూరోసర్జన్ గా ఉన్న ఆయన, ప్రస్తుతం ఒక హాస్పిటల్ డైరెక్టర్‌ గా పని చేస్తుంటాడు. అతని భార్య కో సే-యున్ అదే హాస్పిటల్‌కు చైర్‌పర్సన్ గా ఉంటుంది. వీరిద్దరి మధ్య గత కొన్ని సంవత్సరాలుగా పెరిగిన దూరం, మనస్పర్థల కారణంగా వారి వివాహ బంధం బీటలు వారుతుంది. ఎంతగానో ఆలోచించిన తర్వాత, వీరిద్దరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడాకులు తీసుకోవడానికి ఒక రోజు డిసైడ్ అవుతారు.

Advertisement

అయితే, విడాకులకు ఓకే అనుకున్న మరుసటి రోజే కో సే-యున్ అకస్మాత్తుగా మిస్ అవుతుంది. ఆమెను ఎవరో క్రూరమైన నేరస్థులు కిడ్నాప్ చేశారని తే-జుకు తెలియని నంబర్ నుండి వచ్చే ఫోన్ కాల్ ద్వారా తెలుస్తుంది. ఒకవైపు భార్య ఆచూకీ కోసం తే-జు వెతుకుతుంటే, మరోవైపు పోలీసులు ఈ కిడ్నాప్ వెనుక భర్త అయిన తే-జు హస్తమే ఉందని అనుమానిస్తారు. అతనిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెంబడిస్తారు. దీనితో అతను పోలీసుల నుండి తప్పించుకుని పారిపోతాడు.

అలా పారిపోతూనే భార్యను వెతికే డిటెక్టివ్ గా మారాల్సి వస్తుంది. భార్యను రక్షించే క్రమంలో అతను ప్రాణాలకు తెగించి పోరాడుతూ, దర్యాప్తు తీవ్రం చేసే కొద్దీ షాకింగ్ నిజాలు బయట పడతాయి. ఈ క్రమంలోనే తమ పెళ్లి వెనుక, అలాగే తన భార్య లీడర్‌షిప్‌లో ఉన్న హాస్పిటల్ మేనేజ్‌మెంట్ వెనుక దాగి ఉన్న కుట్రలు బయట పడతాయి. మరి హాస్పిటల్‌లో జరిగే అనేక అనుమానాస్పద సంఘటనలు ఏంటి ? అసలు తే-జు భార్యను కిడ్నాప్ చేసింది ఎవరు ?.శత్రువులు, పోలీసుల నుండి తప్పించుకుంటూ తే-జు తన భార్యను ఎలా కాపాడుకున్నాడు ? ప్రమాదంలో ఉన్నప్పుడు భార్యపై అతనిలో మళ్లీ ప్రేమ తిరిగి ఎలా చిగురించింది ? అనే ఉత్కంఠభరితమైన మలుపులతో సిరీస్ సాగుతుంది.

తెలుగులో ఇంకా రాలేదు

Advertisement

దక్షిణ కొరియా సూపర్ స్టార్ నామ్‌కూంగ్ మిన్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ది హస్బెండ్’ (The Husband). 2026లో విడుదలైన ఈ సిరీస్ 12 ఎపిసోడ్లుగా సాగింది. JioHotstarలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కొరియన్ భాషలో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియో ఇంకా అందుబాటులోకి రాలేదు. కొరియన్ మూవీ లవర్స్ కు ఈ సిరీస్ నచ్చుతుంది. ఇంకా చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి. ఖచ్చితంగా వర్త్ వాచింగ్ మావా అంటారు. భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్థలను, అనురాగాన్ని ఇందులో అద్భుతంగా చూపించారు.

Read Also:

పేపర్ లీక్ నిరసనలతో దేశం దద్దరిల్లుతున్న వేళ వివాదాస్పద సిరీస్… టైమ్ చూసి కొడుతున్న జీ5 ఓటీటీ

Tags

Related News

చిన్న పొరపాటుతో హెవెన్ లో ఎర్రర్… దేవుడితోనే డీల్ చేసుకునే క్రేజీ లాయర్

వైఫై సిగ్నల్స్ అంటే ఎలర్జీ… ఏ గ్రహం నుంచి వచ్చింది భయ్యా ? జెన్ జీ కిడ్స్ డోంట్ మిస్

ఫహాద్ ను ముప్పుతిప్పలు పెట్టే ముసలావిడ… మస్ట్ వాచ్ మలయాళ ఫీల్-గుడ్ అడ్వెంచర్ కామెడీ డ్రామా

ఒకే ఓటీటీలో రెండు మలయాళం సిరీస్ లు… ఇంకా చూడలేదా ?

బాబోయ్ ఒక్కవారంలో 15 మిలియన్ల వ్యూస్… ఈవారం హయ్యెస్ట్ వ్యూస్ రాబట్టిన సిరీస్ ఇదే

పేపర్ లీక్ నిరసనలతో దేశం దద్దరిల్లుతున్న వేళ వివాదాస్పద సిరీస్… టైమ్ చూసి కొడుతున్న జీ5 ఓటీటీ

శుక్రవారం ఒక్కరోజే ఓటీటీలోకి 20కి పైగా సినిమాలు… ఇవి మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు

Big Stories

Advertisement
×