E-Paper
Advertisement

1000 ఇంజెక్షన్లు.. 5సార్లు ఐవీఎఫ్.. నరకం అనుభవించానంటున్న ప్రముఖ నటి!

1000 ఇంజెక్షన్లు.. 5సార్లు ఐవీఎఫ్.. నరకం అనుభవించానంటున్న ప్రముఖ నటి!
Advertisement

Tejaswini Kolhapure:వివాహం తర్వాత ప్రతి ఒక్క మహిళ జీవితంలో ప్రెగ్నెన్సీ అనేది ఒక కొత్త అధ్యాయం. అమ్మ అనే పిలుపు కోసం ప్రతి పరితపిస్తుంది. అయితే ఆ పిలుపు వెనుక కష్టం ఏపాటితో ఒక్కొక్కరు వివరిస్తుంటే.. కళ్ళల్లో నీళ్లాగవు. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ అమ్మ అనే పిలుపు కోసం ఏకంగా ఐదు సార్లు ఐవీఎఫ్ చేయించుకోవడమే కాకుండా ఏకంగా వెయ్యికి పైగా ఇంజెక్షన్లు తీసుకున్నాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు తేజస్విని కొల్హాపురే. సిద్ధార్థ కన్హన్ తో జరిగిన ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఆమె ప్రెగ్నెన్సీ జర్నీ పై కామెంట్లు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.

ఐవిఎఫ్ వల్ల నరకం అనుభవించాను – తేజస్విని కొల్హాపురే

ఐవీఎఫ్ పద్ధతి చాలా కష్టమైంది. మొదటిసారి, రెండవసారి సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ తర్వాత మూడు, నాలుగు , ఐదోసారి పర్వాలేదనిపిస్తుంది. నిజానికి ఈ ఐవీఎఫ్ చేయించుకునేటప్పుడు మానసికంగా చాలా ధైర్యంగా ఉండాలి. ఇంజెక్షన్ల కోసం తరచూ హాస్పిటల్ కు వెళ్లాల్సి వస్తుంది. ఎంతో నొప్పిని తట్టుకోవాలి. ఆలస్యంగా పిల్లలు కణాలని అనుకున్నప్పటికీ.. 35 ఏళ్లలోపే పిల్లల్ని కంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు.. అంటూ తన స్వీయ అనుభవాలను సలహాలుగా మార్చి చెప్పుకొచ్చింది.

Advertisement

ALSO READ:బాలకృష్ణ మోకాలికి సర్జరీ పూర్తి.. బులెటిన్ విడుదల చేసిన ఏఐజీ బృందం!

వెయ్యికి పైగా ఇంజెక్షన్లు.. 5సార్లు ఐవీఎఫ్..

ముఖ్యంగా వందల సంఖ్యలో ఇంజెక్షన్లు తీసుకోవడం వల్ల బాడీ షేప్ కూడా మారిపోయింది. సుమారుగా 1000కి పైగా ఇంజెక్షన్లు తీసుకున్నాను. ప్రెగ్నెన్సీ ఓకే అయిన తర్వాతే ఆ ఇంజెక్షన్లను ఆపేస్తారు. నేను ప్రెగ్నెన్సీ కోసం ఎంతో ఇబ్బంది పడ్డానో నాకే తెలుసు. ఐదు సార్లు ఐవిఎఫ్ కి కూడా వెళ్లాల్సి వచ్చింది. అయితే ఐదవ సారి లక్కీగా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది . మధ్యలో రెండు సార్లు మిస్ క్యారేజ్ కూడా అయ్యింది” అంటూ తాను అనుభవించిన నరకం గురించి చెప్పుకొచ్చింది తేజస్విని కొల్హాపురే. ఇకపోతే ఈమె ప్రముఖ ఫిలిం మేకర్, నటుడు పంకజ్ సరస్వత్ తో ఏడడుగులు వేసింది. ఈ ఇద్దరికీ అమ్మాయి పుట్టింది. అయితే పెళ్లయిన ఎనిమిది ఏళ్ల తర్వాత. ఐదు సార్లు ఐవిఎఫ్ ప్రయత్నాలు జరిగిన తర్వాత ..2015 జనవరి 30వ తేదీన ఒక కూతురు పుట్టింది. అయితే కూతురు పుట్టిన ఇన్నేళ్ల తరువాత తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి అందరితో చెప్పి ఎమోషనల్ అయ్యింది తేజస్విని కొల్హాపురే. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

శ్రద్ధా కపూర్ కి వరుసకు మేనత్త..

Advertisement

ఇకపోతే తేజస్విని కొల్హాపురే ఎవరో కాదు ఒకప్పటి సినీనటి పద్మిని కొల్హాపురే సోదరి కూడా. అంతేకాదు బాలీవుడ్ నటుడు సిద్ధాంత కపూర్ తో పాటు ప్రముఖ హీరోయిన్ శ్రద్ధ కపూర్ లకు వరుసకు మేనత్త అవుతుంది. ఇక ఐవీఎఫ్ విధానం వల్ల తీవ్రమైన మానసిక, శారీరక బాధను అనుభవించాల్సి వచ్చినట్లు చెప్పి.. తన జీవితంలో అదో సంక్లిష్టమైన దశ అంటూ చెప్పుకొచ్చింది.

Related News

చెన్నై లవ్ స్టోరీ ట్విట్టర్ రివ్యూ.. రొమాంటిక్ డ్రామాతో కిరణ్-గౌరీ జంట మెప్పించిందా?

నాతో పనిచేసిన వాళ్లందరూ మంత్రులయ్యారు – బాబీ డియోల్ ఊహించని కామెంట్స్!

బాలకృష్ణ మోకాలికి సర్జరీ పూర్తి.. బులెటిన్ విడుదల చేసిన ఏఐజీ బృందం!

రాజకీయాల్లో తిట్లు తినడం కంటే సినిమాలే బెటర్.. రూటు మార్చిన పోసాని కృష్ణమురళి!

సినిమా ఫ్లాప్ అయితే గుండు కొట్టించుకుంటా – జబర్దస్త్ కమెడియన్!

2,100 కోట్ల బడ్జెట్… 91 రోజుల్లో షూటింగ్.. ‘ది ఒడిస్సీ’ మైండ్ బ్లాకింగ్ ఫ్యాక్ట్స్!

అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ.. ఒక్కమాటతో క్లారిటీ ఇచ్చిన మేనేజర్!

Big Stories

Advertisement
×