Horror Thriller OTT: హర్రర్ మూవీ లవర్స్ కు బాగా భయపెట్టే సినిమాలు అంటే ఒక రకమైన పిచ్చి ఉంటుంది. అయితే ఈ జానర్లో వచ్చిన అన్ని సినిమాలు అంత భయంకరంగా ఉండవు. అందుకే చాలాసార్లు హర్రర్ సినిమాలు చూసినప్పుడు డిసప్పాయింట్ అవుతుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా చూస్తే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఆ సినిమా పేరే ‘విచ్‌బోర్డ్’ (Witchboard).
ఈ సినిమా కథ 17వ శతాబ్దపు ఫ్రాన్స్ లో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి పవర్ ఫుల్ మంత్రగత్తెను గ్రామస్తులు వెళ్లగొడతారు. కానీ ఆమె ఆత్మ శాపంతో వెనక్కి తిరిగి వస్తుందని హెచ్చరిస్తారు. ఆ తరువాత కథ ఇప్పటి కాలంలోకి షిఫ్ట్ అవుతుంది. న్యూ ఓర్లీన్స్ నగరంలో ఎమిలీ, ఆమెకు కాబోయే భర్త క్రిస్టియన్ తో కలిసి కొత్త రెస్టారెంట్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తారు.
ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు ఎమిలీకి ఒక పురాతన విచ్ బోర్డ్ దొరుకుతుంది. మొదట్లో ఇది ఒక నార్మల్ ఆట వస్తువుగా అనిపిస్తుంది. ఎమిలీ ఆ బోర్డును ఉపయోగించి అకాల మరణానికి గురైన ఆత్మలతో మాట్లాడాలని అనుకుంటుంది. అనుకున్నట్టే చేస్తుంది. కానీ ఆ బోర్డు మామూలుది కాదు. అది 17వ శతాబ్దపు ఆ మంత్రగత్తె ఆత్మను మేల్కొలిపే శక్తివంతమైన సాధనం.
క్రమంగా ఆ దుష్టశక్తి ఎమిలీని తన వశం చేసుకుంటుంది. ఆ బోర్డును వాడిన తరువాత ఆమె ప్రవర్తన నెమ్మదిగా మారిపోతుంది. ఆమె చుట్టుపక్కల ఉన్న స్నేహితులు, సన్నిహితులు ఒకరి తర్వాత ఒకరు ఘోరమైన పద్ధతుల్లో చనిపోతుంటారు. ఈ క్రమంలో సినిమాలో భయంకరమైన సీన్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. క్రిస్టియన్ తనకు కాబోయే భార్య ప్రాణాలకు ప్రమాదం ఉందని గ్రహించి, అలెక్సాండర్ బాప్టిస్ట్ అనే సీక్రెట్ క్షుద్రవిద్యల నిపుణుడి సహాయం కోరతాడు.
కానీ ఆ నిపుణుడికి కూడా సెల్ఫీష్ సీక్రెట్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి కథ గ్రిప్పింగ్ గా, ట్విస్టులతో సాగుతుంది. సినిమాలో హారర్ ఎలిమెంట్స్ చాలా బాగుంటాయి. మరి ఇంతకీ ఆ బోర్డును వాడి హీరోయిన్ ఏం చేసింది ? ఆ మంత్రగత్తె మేల్కొన్నాక ఏం చేసింది ? చివరికి కథ ఎలాంటి టర్న్ తీసుకుంది ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
హారర్ థ్రిల్లర్ ప్రేమికులకు 2024లో వచ్చి అలరించిన మూవీ ‘విచ్‌బోర్డ్’. 1986లో వచ్చిన క్లాసిక్ హారర్ సినిమాకు ఆధునిక రీమేక్ ఇది. A Nightmare on Elm Street 3 ఫేమ్ దర్శకుడు చక్ రస్సెల్ తన స్టైల్‌తో ఈ చిత్రాన్ని భయంకరంగా, సస్పెన్స్‌తో నింపాడు. ఈ సినిమా ప్రస్తుతం JioHotstarలో హిందీ డబ్బింగ్ వెర్షన్ లో ఉంది. Amazon Prime Videoలో ఇంగ్లీష్ ఆడియోతో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు కాబట్టి ఇంగ్లీష్ లేదా హిందీలో చూడాలి.
Read Also: ప్రతీ ఎపిసోడ్లో ఒక కొత్త కేసు… ట్విస్టులతో మెంటలెక్కించే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్