No Rohit Sharma for ODI World Cup 2027: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో హిట్ రోహిత్ శర్మ అభిమానులకు చికాకు తెప్పిస్తున్నాడు. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లో కూడా సరిగ్గా రాణించడం లేదు. 2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందు కీలకమైన ఈ సిరీస్లో రాణించాల్సిన రోహిత్ శర్మ… చెత్త షాట్స్ వాడుతూ పరువు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో 2027 వన్డే వరల్డ్ కప్ నుంచి రోహిత్ శర్మను బీసీసీఐ తప్పించబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. వరల్డ్ కప్ ప్రణాళికలలో రోహిత్ శర్మ లేరని… ఈ విషయాన్ని కూడా సెలెక్టర్లు ఇప్పటికే అతడికి చెప్పినట్లు జాతీయ మీడియాలో కూడా ఓ న్యూస్ వైరల్ గా మారింది. దీంతో రోహిత్ శర్మ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ కోసం రిటైర్మెంట్ ప్రకటించకుండా టీమిండియాలోనే తిష్ట వేసి కూర్చున్న 40 ఏళ్ల రోహిత్ శర్మ… వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదు. ఇంగ్లాండ్ తో జరిగిన రెండు వన్డేల్లో కూడా చెత్త ప్రదర్శన చేసి వికెట్ సమర్పించుకున్నాడు. అయితే రెండవ వన్డే మ్యాచ్ సందర్భంగా కూడా విఫలమైన రోహిత్ శర్మ గురించి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ లో రోహిత్ శర్మాను తీసుకోవడం లేదని ఇప్పటికే అతనికి బిసిసిఐ సెలెక్టర్లు స్పష్టం చేశారు అంట. ఈ విషయాన్ని నేషనల్ మీడియా స్పష్టం చేసింది. ఈనెల 19వ తేదీన ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య లార్డ్స్ వేదికగా చివరి వన్డే మ్యాచ్ ఉండనుంది. ఇదే రోహిత్ శర్మకు చివరి వన్డే అని అంటున్నారు. 2026 లో 8 మ్యాచ్ లు ఆడిన రోహిత్ శర్మ కేవలం 241 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లాండ్ సిరీస్లో ఇప్పటివరకు 37 పరుగులు మాత్రమే సాధించాడు. ఇంత చెత్త ప్రదర్శన ఉంటే వన్డే వరల్డ్ కప్ లో కష్టమేనని క్రీడా విశ్లేషకులు కూడా చెబుతున్నారు.
ఇంగ్లాండ్ గడ్డపై వన్డేలు వాడుతున్న రోహిత్ శర్మ ప్రదర్శన పై అతడి భార్య రితికా కూడా అసహనంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అతని భార్యకే ఆట నచ్చనప్పుడు… బీసీసీఐ సెలెక్టర్లు కూడా రోహిత్ శర్మను రిజెక్ట్ చేయడం గ్యారంటీ అంటున్నారు.
2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో రోహిత్ శర్మను పక్కకు పెడితే… అతని స్థానంలో ఎవరు ఆడితే బెటర్ అని చర్చలు జరుగుతున్నాయి. యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, సాయి సుదర్శన్ లాంటి కుర్ర క్రికెటర్ల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో యశస్వి జైస్వాల్ ఫైనల్ అయ్యా అవకాశాలు ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అతడికి అనుభవంతో పాటు.. నిలకడగా ఆడే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో యశస్వి జైష్వాల్ కు అవకాశాలు వస్తాయని చెబుతున్నారు.
🚨 NO ROHIT SHARMA FOR WORLD CUP. 🚨
– Lord’s could be Rohit’s final ODI as the selectors have conveyed him he’s not part of the 2027 World Cup plans. (Express Sports). pic.twitter.com/7Mg7Cki2TV
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 16, 2026