Korean Romantic Drama: ప్రతీ ఒక్కరి జీవితంలో బాల్యం ఎంత బాగుంటుందో కదా. ఏ చీకూచింతా లేకుండా ప్రశాంతంగా బతికేది చిన్నప్పుడే. అందుకే ఏ బాధ వచ్చినా ప్రతీ ఒక్కరూ అదే తలచుకుంటారు. అలాగే టీనేజ్ కూడా. ఆ వయసులో ఉడుకు రక్తంతో చేసే అల్లరి చిలిపి పనులు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఇక కాలేజ్ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడే లైఫ్ స్టోరిలే కాదు లవ్ స్టోరీలు కూడా స్టార్ట్ అవుతాయి. అలాంటి ఒక అందమైన కొరియన్ ప్రేమ కథ ‘క్రషాలజీ 101’ (Crushology 101) ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో ఉందా ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ పేరు బాన్ హీ-జిన్. అందరూ ‘బని’ అని పిలిచే ఈ అమ్మాయి శిల్పకళా విద్యార్థిని. ఎయిన్ యూనివర్సిటీలో చదువుతున్న ఆ అమ్మాయి చాలా టాలెంటెడ్. కానీ ప్రేమలో ఆమెకు ఒక భయంకరమైన చేదు అనుభవం ఉంది. గతంలో ఒక అబ్బాయిని మనస్పూర్తిగా ప్రేమించి, ఘోరంగా మోసపోతుంది. ఆ గాయం నుంచి బయటపడలేక బని ఒక వింత నిర్ణయం తీసుకుంటుంది. ఇకపై కేవలం అందగాళ్లు, హ్యాండ్‌సమ్ అబ్బాయిలనే ప్రేమిస్తాను. మనసు చూసి మోసపోవడం వద్దు అనుకుంటుంది.
కానీ కాలేజీ జీవితం ఆమె ఆలోచనలకు ఆపొజిట్స్ గా మారిపోతుంది. యూనివర్సిటీలోకి అనుకోకుండా నలుగురు అందమైన సీనియర్ అబ్బాయిలు అడుగు పెడతారు. వీరందరూ విభిన్న వ్యక్తిత్వాలు, బ్యాక్‌గ్రౌండ్స్ కలిగి ఉంటారు. అయితే బనిని ఆకట్టుకోవడానికి తమ స్టైల్ లో ప్రయత్నిస్తారు. ఇక్కడే కథ సరదాగా, కామెడీగా, ఎమోషనల్‌గా టర్న్ అవుతుంది.
ఆ నలుగురు అబ్బాయిలలో హ్వాంగ్ జే-యూల్ విజువల్ డిజైన్ స్టూడెంట్. కూల్ ఆర్టిస్టిక్ స్వభావం కలిగిన వ్యక్తి. చా జి-వాన్ మాత్రం రిచ్ కిడ్, చాబోల్ వారసుడు. ఆత్మవిశ్వాసం, లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్న అతను బనిని ఆకర్షించడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేస్తాడు. జో ఆ-రాంగ్ వంటి మిగిలిన అబ్బాయిలు కూడా బని హృదయాన్ని గెలవడానికి గట్టిగా ట్రై చేస్తారు. బని తన శపథం చేసినట్టే అందగాళ్లనే సెలెక్ట్ చేస్కోవాలని ప్రయత్నిస్తుంది. కానీ నెమ్మదిగా వాళ్ళ మనస్తత్వాలు, స్నేహం, సపోర్ట్ చూసి ఆమె గందరగోళంలో పడుతుంది. అందమే కాదు మనసు కూడా ముఖ్యమని ఆమె గ్రహిస్తుంది. మరి బని జీవితం ఎలాంటి టర్న్ తీసుకుంది ? ఆ నలుగురిలో ఎవరిని బాయ్ ఫ్రెండ్ గా సెలెక్ట్ చేసుకుంది ? అనేది తెలియాలంటే సిరీస్ పై ఒక లుక్కేయాల్సిందే.
ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ కొరియన్ సిరీస్ 2025లో వచ్చింది. ఈ సిరీస్ ప్రస్తుతం Amazon Prime Video, Rakuten Vikiలో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు. తెలుగు డబ్బింగ్ లేదు కాబట్టి కొరియన్ ఆడియోతోనే వీక్షించాలి. మొత్తం 12 ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్ ఫన్నీగా, ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చేలా ఉంటుంది.
Read Also: ఒకే ఒక్క టాబ్లెట్ తో కంట్రోల్ తప్పే అమ్మాయిలు… కట్ చేస్తే చెమటలు పట్టించే థ్రిల్లింగ్ ట్విస్ట్