E-Paper
Advertisement

Kalamkaval OTT : “కలాంకావల్” అఫిషియల్ ఓటీటీ రిలీజ్ డేట్… ఎప్పుడు చూడొచ్చంటే ?

Kalamkaval OTT : “కలాంకావల్” అఫిషియల్ ఓటీటీ రిలీజ్ డేట్… ఎప్పుడు చూడొచ్చంటే ?
Advertisement

Kalamkaval OTT : గత ఏడాది మమ్ముట్టి హీరోగా నటించిన మూవీ ‘కలంకవల్’. ఈ సినిమా ఓటేటీ స్ట్రీమింగ్ ఎప్పుడెప్పుడా అని ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటిదాకా మూవీ స్ట్రీమింగ్ విషయంలో పలు రూమర్లు వినిపించగా, తాజాగా మేకర్స్ నుంచి అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. మరి ఈ మూవీ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతోంది ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

సోనీ లివ్ (Sonyliv) ఓటీటీలో స్ట్రీమింగ్

మలయాళం స్టార్ మమ్ముట్టి క్రైమ్ థ్రిల్లర్ ‘కలంకవల్’ (Kalamkaval). 2025 డిసెంబర్ 5న విడుదలైన ఈ మూవీకి థియేటర్ లలో అనూహ్య స్పందన వచ్చింది. జితిన్ కె జోస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక థియేటర్లలో విడుదలైన నెల తరువాత ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే మేకర్స్ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసి, మమ్ముట్టి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు.

Advertisement

మేకర్స్ నుంచి వచ్చిన అఫిషియల్ అనౌన్స్మెంట్ ప్రకారం ఈ మూవీ సోనీ లివ్ (Sonyliv)లో స్ట్రీమింగ్ కానుంది. జనవరి 16 నుంచి సంక్రాంతి కానుకగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. మలయాళంలో మాత్రమే కాదు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయినవారు, మరో వారం లోపే ఇంట్లోనే కూర్చుని ఈ మూవీని వీక్షించవచ్చు.

ఇక ఈ సినిమాలో రజిషా విజయన్, వినాయకన్, గిబిన్ గోపీనాథ్, గాయత్రి అరుణ్ ప్రధాన పాత్రలు పోషించారు. మమ్ముట్టి ఇందులో తన పవర్ ఫుల్ యాక్టింగ్ తో అదరగొట్టాడు. కాగా కలంకవల్ బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని కలెక్షన్లతో ఊదరగొట్టింది. సమాచారం ప్రకారం ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 819 కోట్లు రాబట్టి షాక్ ఇచ్చింది. ఇండియాలో భారీ వసూల్లు రాబట్టి సూపర్ హిట్ మూవీగా నిలిచింది.

Advertisement

Read Also : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సెన్సేషనల్ మర్డర్ కేసు… ఎక్కడ చూడవచ్చో తెలుసా ?

స్టోరీలోకి వెళ్తే…

ఇన్స్పెక్టర్ జయకృష్ణన్ చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. ఆయన ఒక షాకింగ్ కేసును ఇన్వెస్టిగేట్ చేయడంతో మూవీ షురూ అవుతుంది. కేరళ, తమిళనాడులో ఉన్న విడాకులు తీసుకున్న మహిళలు, లేదా పెళ్ళికాని వాళ్ళు, వితంతువులు మిస్ అవుతూ ఉంటారు. కిల్లర్ బాధితులకు ఫోన్ చేసి, తరువాత అట్రాక్ట్ చేస్తాడు. ఆనంతరం వాళ్లను కిడ్నాప్ చేస్తాడు. అలాగే కేసుతో సంబంధం లేని క్లూస్ వదిలేస్తూ పోలీసులను అయోమయానికి గురి చేస్తాడు. మరి జయకృష్ణన్ ఆ కిల్లర్ ను ఎలా పట్టుకున్నాడు ? అసలు అతను అమ్మాయిలని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ? చివరకు వచ్చే షాకింగ్ ట్విస్ట్ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే వరకూ ఆగాల్సిందే.

Tags

Related News

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

14,000 ఏళ్ల వయసున్న టీచర్… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులున్న క్లాసిక్ సై-ఫై మూవీ

Big Stories

Advertisement
×