E-Paper
Advertisement

మౌంట్ ఎవరెస్ట్‌ పై వందల మృతదేహాలు.. వాటిని ఎందుకు తీసుకురారు?

మౌంట్ ఎవరెస్ట్‌ పై వందల మృతదేహాలు.. వాటిని ఎందుకు తీసుకురారు?
Advertisement

Mount Everest Facts: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్వతారోహకులు ఈ శిఖరాన్ని అధిరోహించాలని కలలు కంటారు. అయితే, ఈ ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుందో, అంతే ప్రమాదకరంగా ఉంటుంది. ఈ పర్వతం ఎక్కేందుకు వెళ్లి.. వందల మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. చనిపోయిన వారి మృతదేహాలను కిందికి దించే పరిస్థితి కూడా ఉండదు. అందుకే, ఎవరెస్ట్‌ ను ప్రపంచంలోనే అతిపెద్ద శవాల దిబ్బగా పిలుస్తుంటారు. పర్వతం మీద కఠినమైన వాతావరణం, ఆక్సిజన్ కొరత కారణంగా.. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను కిందకు తీసుకురావడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే వాటిని అక్కడే వదిలేస్తారు.

డెత్ జోన్ లోకి అడుగు పెడితే తిరిగి రావడం కష్టం!

ఎవరెస్ట్‌ లో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాన్ని డెత్ జోన్  అని పిలుస్తారు. ఇది సముద్ర మట్టానికి సుమారు 8,000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతంలో గాలిలో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందక శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. ఎక్కువ సేపు అక్కడ ఉండటం వల్ల అలసట, స్పృహ కోల్పోవడం, గుండె,  ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అక్కడి వాతావరణం కూడా ఎంతో కఠినంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతాయి. బలమైన గాలులు, మంచు తుఫాన్లు ఎప్పుడు వస్తాయో చెప్పడం కష్టం. ఈ కారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు చలిలో గడ్డకట్టిపోతాయి. సాధారణంగా జరిగే కుళ్లిపోయే ప్రక్రియ అక్కడ జరగదు. అందుకే కొన్ని మృతదేహాలు సంవత్సరాల తరబడి అదే ప్రాంతంలో కనిపిస్తుంటాయి.

ఎందుకు మృతదేహాలను కిందికి తీసుకురారు?

Advertisement

మృతదేహాలను కిందకు తీసుకురావడం కూడా చాలా ప్రమాదకరమైన పని. ఒక్క మృతదేహాన్ని తరలించాలంటే ఎంతో ఎక్స్ పీరియెన్స్ ఉన్న షెర్పాలు, రెస్క్యూ బృందాలు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది. చనిపోయిన వారి బరువు, తక్కువ ఆక్సిజన్, మంచుతో కప్పబడిన మార్గాలు శవానలను కిందికి దింపే పనిని మరింత కష్టంగా మారుస్తాయి. అందువల్ల చాలా మంది మృతదేహాలను అక్కడే వదిలివేయాల్సి వస్తుంది.

ఇప్పటి వరకు ఎంత మంది చనిపోయారంటే?

ప్రస్తుతం అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం, 1920ల నుంచి ఇప్పటి వరకు మౌంట్ ఎవరెస్ట్‌ పై 340 మందికి పైగా పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలామంది డెత్ జోన్ లో ఆక్సిజన్ కొరత, తీవ్రమైన చలి, మంచు చరియలు విరిగిపడటం, ఎత్తు వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, వాతావరణం ఒక్కసారిగా మారిపోవడం లాంటి కారణాలతో మరణించారు. వీరిలో కొందరి మృతదేహాలను మాత్రమే కిందకు తీసుకురాగలిగారు. అయితే, 200కు పైగా మృతదేహాలు ఇప్పటికీ ఎవరెస్ట్ పర్వతంపైనే ఉన్నాయని పర్వతారోహణ నిపుణులు చెబుతున్నారు. కొన్ని మృతదేహాలు మార్గం పక్కనే పడి ఉంటాయి. వాటిని చూసుకుంటూనే ఇతర పర్వతారోహకులు శిఖరాన్ని చేరుతుంటారు.

కొత్త నిబంధనలను తీసుకొచ్చిన నేపాల్ సర్కారు

Advertisement

అటు నేపాల్ ప్రభుత్వం పర్వతారోహకులకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. పర్వతంపై పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు స్పెషల్ క్లీనింగ్ డ్రైవ్‌లు కూడా నిర్వహిస్తోంది. ఎవరెస్ట్ ఎక్కేందుకు వెళ్లిన పర్వతారోహకులు వచ్చేటప్పుడు కనీసం 8 కిలలో ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకురావాలనే నిబంధన పెట్టింది.  పర్యావరణాన్ని కాపాడడంతో పాటు ఎవరెస్ట్‌ ను మరింత సురక్షితంగా ఉంచేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ రూల్ తీసుకొచ్చింది.  ప్రకృతి అందాలకు ప్రతీకగా నిలిచే మౌంట్ ఎవరెస్ట్ ఒకవైపు సాహసానికి చిహ్నం అయితే, మరోవైపు ప్రకృతిని తక్కువ అంచనా వేయకూడదనే గట్టి హెచ్చరిక కూడా. సరైన శిక్షణ, అనుభవం, భద్రతా ఏర్పాట్లు లేకుండా ఎవరెస్ట్‌ ను అధిరోహించడం ప్రాణాలకు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Also: పక్షులతో యుద్ధం చేసి ఓడిపోయిన దేశం.. ఈ ఆసక్తికర చరిత్ర మీకు తెలుసా?

Related News

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. లగేజీ బుకింగ్ ఇక మరింత ఈజీ!

విశాఖ–బెంగళూరు వందే భారత్ స్లీపర్.. విజయవాడ మీదుగానేనా?

విమాన సంస్థపై ఆ ట్రావెలర్ ఆగ్రహం.. 5 వేలు ఇచ్చినందుకా? అసలేం జరిగింది?

నల్లగొండలో వైజాగ్ కాలనీ కనువిందు.. సాగర్ బ్యాక్‌ వాటర్స్ నేచర్ మ్యాజిక్ చూసొద్దాం రండి!

దేశంలో అడ్వెంచర్ టూరిజంకు పెరుగుతున్న ఆదరణ.. కొండలు, దట్టమైన అడవుల్లో సాహస యాత్రకు బెస్ట్ స్పాట్స్ ఇవే

క్వీన్ ఆఫ్ హిల్స్ ‘ముస్సోరీ’.. తప్పక చూడాల్సిన 7 టాప్ టూరిస్ట్ స్పాట్స్!

బీచ్ లవర్స్ కోసం పాండిచ్చేరి స్పెషల్.. బడ్జెట్, బ్యూటీ కలగలిపిన 5 హాట్‌స్పాట్స్!

Big Stories

Advertisement
×